IPO News: తొలిరోజే నిరాశపరిచిన ఐపీవో.. ఇన్వెస్టర్ల ఆశలు ఆవిరి.. మీరూ కొన్నారా..??
IPO News: ఈరోజు మార్కెట్లోకి అడుగుపెట్టిన టాటా, గాంధార ఐపీవోలు ఇన్వెస్టర్లకు కనకవర్షం కురిపించాయి. తొలిరోజే దాదాపు పెట్టుబడిని రెండింతలు చేయటంతో చాలా మంది సంతోషంగా ఉన్నప్పటికీ ఒక ఐపీవో మాత్రం నిరాశకు గురిచేసింది.
ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్నది ఫెడ్ బ్యాంక్ ఫైనాన్సియల్ సర్వీసెస్ ఐపీవో గురించే. నేడు మార్కెట్లో జాబితా అయిన ఐపీవో ఇన్వెస్టర్లను కొంత నిరాశకు గురిచేసింది. దీంతో అరంగేట్రంలో షేర్లు ఇష్యూ ధర కంటే 1.61 శాతం తక్కువ రేటుకు నష్టాల్లో జాబితా చేయబడ్డాయి. ఎన్ఎస్ఈలో షేర్లు రూ.137.75 రేటు వద్ద, బీఎస్ఈలో రూ.138 వద్ద జాబితా చేయబడ్డాయి. అయితే జాబితా చేయబడిన కొద్దిసేపటికే షేర్ ధర మరింతగా క్షీణించటం నమోదైంది.

వాస్తవానికి కంపెనీ ఒక్కో షేరును గరిష్ఠంగా రూ.140 రేటుకు విక్రయించిన సంగతి తెలిసిందే. తాజా ఐపీవో ద్వారా కంపెనీ మార్కెట్ల నుంచి రూ.1,092.26 కోట్లను విజయవంతంగా సమీకరించింది. ఇందులో రూ.600.77 కోట్ల విలువైన 4.29 కోట్ల తాజా ఈక్విటీ షేర్లను జారీ చేసింది. అలాగే మిగిలిన రూ.492.26 కోట్లను ఆఫర్ ఫర్ సేల్ రూపంలో షేర్ల జారీ ద్వారా సమీకరిస్తోంది. ఈ క్రమంలో ఐపీవో ప్రైస్ బ్యాంక్ రేటును పరిశీలిస్తే రూ.133-140గా కంపెనీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
యాంకర్ ఇన్వెస్టర్ల నుంచి ఫెడ్ బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ రూ.324.68 కోట్లను సేకరించింది. ఇందులో దాదాపు 22 ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టారు. సబ్‌స్క్రిప్షన్ చివరి రోజైన నవంబర్ 24న ఇష్యూ 2.2 సార్లు సబ్‌స్క్రయిబ్ చేయబడింది. రిటైల్ ఇన్వెస్టర్లు తమకు కేటాయించిన వాటాల కోటాను 1.82 రెట్లు కొనుగోలు చేశారు. ఫెడరల్ బ్యాంక్ ఫెడ్‌బ్యాంక్ ఫైనాన్షియల్ సర్వీసెస్ ముంబైకి చెందిన రిటైల్-ఫోకస్డ్ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీ. ఇది 17 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో ఉనికిని కలిగి ఉంది.


Click it and Unblock the Notifications