2022లో మూడు రేట్ హైక్స్‌కు ఫెడ్ సంకేతాలు, 2024 వరకు ఇలా...
కరోనా మహమ్మారి నేపథ్యంలో అమెరికా ఆర్థిక రికవరీ కోసం ఫెడరల్ రిజర్వ్ మరోసారి దాదాపు జీరో వద్దనే కొనసాగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆర్థిక రికవరీకి ఊతమిచ్చేందుకు మరికొంత కాలం వడ్డీ రేటుల స్థిరంగా కొనసాగించాలని నిర్ణయించింది. సెంట్రల్ బ్యాంకు బాండ్స్ కొనుగోళ్లను వేగవంతం చేయనుంది. ప్రస్తుత సమయంలో మరింత పాలసీ మద్దతు అవసరం లేదని ఫెడ్ చీఫ్ జెరోమో పోవెల్ అన్నారు. ఆర్థిక వ్యవస్థపై ఒమిక్రాన్ ప్రభావం అంతగా ఉండదని అభిప్రాయపడ్డారు.

వచ్చే ఏడాది మూడు రేట్ హైక్స్
అయితే అధిక ద్రవ్యోల్భణాన్ని ఎదుర్కోవడానికి సమీప భవిష్యత్తులో ఫెడ్ రిజర్వ్ షార్ట్ టర్మ్ రేటును పెంచేందుకు దాదాపుగా నిర్ణయించుకున్నట్లుగా కనిపిస్తోంది. గత నవంబర్ నెలలో ధరల పెరుగుదల 39 సంవత్సరాల గరిష్టస్థాయికి చేరుకుంది. ఈ పెరుగుదలను నియంత్రించే ప్రయత్నంలో ఫెడ్ బుధవారం బాండ్ కొనుగోలును దశలవారీగా వేగవంతం చేయాలని నిర్ణయించింది. అలాగే గతంలో అంచనా వేసిన దాని కంటే ముందుగానే వడ్డీ రేట్లు పెంచాలని భావిస్తోంది. వచ్చే ఏడాది (2022)లో మూడు రెట్ల పెంపుకు సంకేతాలు ఇచ్చింది.

అన్ని అస్త్రాలతో రెడీ
అధిక ద్రవ్యోల్భణాన్ని తగ్గించేందుకు, తమ వద్ద ఉన్న అన్ని అస్త్రాలను ఉపయోగించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని ఫెడ్ చైర్మన్ జెరోమ్ పోవెల్ అన్నారు. ఇది బలమైన ఆర్థిక వ్యవస్థ అని, వడ్డీ రేటు పెంపుకు తగినది అన్నారు. నవంబర్ నెలలో ధరల సూచీ 6.8 శాతానికి చేరుకుంది. నిరుద్యోగిత రేటు 4.2 శాతంగా నమోదయింది. ఫెడ్ వడ్డీ రేట్లను వరుసగా నెమ్మదిగా పెంచనుంది. నిరుద్యోగం రేటు మూడు సంవత్సరాలకు 3.5 స్థాయికి తగ్గించాలని భావిస్తున్నారు.

వడ్డీ రేటు పెంపు ఇలా
ఫెడ్ విధాన నిర్ణేత కమిటీ దాని బెంచ్ మార్క్ రేటును జీరో సమీపంలో కొనసాగించింది. అయితే వచ్చే ఏడాది మూడు పర్యాయాలు పెంచనుంది. ఫెడ్ రిజర్వ్ ప్యానెల్ 2023లో మరో మూడుసార్లు, 2024లో రెండుసార్లు అంచనా వేస్తోంది. దీంతో 2024 చివరి నాటికి వడ్డీ రేటును 2.1 శాతానికి పెంచాలని భావిస్తోంది.


Click it and Unblock the Notifications