అమెరికా ద్రవ్యోల్బణం క్రమంగా తగ్గడంతో పాటు ఆర్థిక డేటా మిశ్రమంగా ఉండడాన్ని దృష్టిలో ఉంచుకుని.. యూఎస్ ఫెడరల్ రిజర్వ్ తన ప్రామాణిక వడ్డీ రేటును మరోసారి 25 బెసిస్ పాయింట్లు తగ్గించింది. ఈ నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు అత్యంత ఆసక్తిగా ఎదురుచూసిన విధాన ప్రకటనల్లో ఒకటి. 43 రోజుల పాటు కొనసాగిన అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ వల్ల ముఖ్యమైన ఆర్థిక డేటా విడుదలల్లో ఆలస్యం జరిగింది.
అదే సమయంలో ట్రంప్ పరిపాలన వచ్చే సంవత్సరం మధ్యంతర ఎన్నికల ముందు సడలించిన విధానాలను అనుసరించాలని ఫెడ్‌పై ఒత్తిడి తెచ్చిన విషయం కూడా ఈ నిర్ణయంపై ప్రభావం చూపింది. ఈ అనిశ్చితి మధ్య వెలువడిన తాజా రేటు తగ్గింపు.. 2026లో ప్రపంచ ద్రవ్య విధానం ఎలా మలుపు తిరుగుతుందనే దానిపై స్పష్టమైన దిశను చూపుతోంది. ఫెడరల్ ఫండ్ రేటు ఇప్పుడు 3.5 నుంచి 3.75 శాతం శ్రేణిలోకి వచ్చింది.

అమెరికాలో ద్రవ్యోల్బణం గత సంవత్సరం గరిష్ట స్థాయిల నుంచి పడిపోయినప్పటికీ ఇంకా ఫెడరల్ రిజర్వ్ నిర్దేశించిన 2 శాతం లక్ష్యాన్ని మించి కొనసాగుతోంది. ఉద్యోగాల పెరుగుదల మందగించినప్పటికీ, లేబర్ మార్కెట్ మాత్రం ఇంకా బలంగానే ఉంది. ఈ పరిస్థితులు ఫెడ్‌ను మరింత జాగ్రత్త ధోరణి వైపు నడిపిస్తున్నాయి. న్యూయార్క్ ఫెడరల్ రిజర్వ్ అధ్యక్షుడు జాన్ విలియమ్స్ భీమా చర్యగా వడ్డీ రేటు తగ్గింపు అవసరమని ఇటీవల వ్యాఖ్యానించడంతో.. మార్కెట్లు ఈ నిర్ణయానికి 87 శాతం అవకాశాన్ని ముందే అంచనా వేశాయి.
కానీ ఫెడ్‌లో అంతర్గత విభేదాలు పెరుగుతున్నాయి. ఫెడ్‌లోని 19 మంది సభ్యులు 2026 కోసం ప్రతిపాదించిన రేటు కోతల అంచనాలు పూర్తిగా భిన్నంగా ఉన్నాయి. ఏడుగురు అధికారులు వచ్చే ఏడాది ఎలాంటి కోతలు ఉండవని భావిస్తుండగా.. ఎనిమిది మంది రెండు లేదా అంతకంటే ఎక్కువ కోతలు అవసరమని భావిస్తున్నారు. నలుగురు మాత్రం ఒక్క చిన్న కోత సరిపోతుందని అంటున్నారు. ఇంకా అత్యంత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే.. ఈ సభ్యులందరికి ఓటు హక్కు లేకపోవడం, నిజంగా విధానంపై నిర్ణయం తీసుకునే 12 మంది మాత్రమే తమ అభిప్రాయాన్ని అధికారికంగా నమోదు చేశారు. ఈ విభేదాలు అమెరికా ఆర్థిక వ్యవస్థ భవిష్యత్తు ఎంత అస్థిరంగా ఉందో చెబుతున్నాయి.
భారతదేశం విషయంలో ఈ నిర్ణయ ప్రభావం త్వరగా కనిపించే అవకాశం ఉంది. అమెరికా వడ్డీ రేట్లు తగ్గితే డాలర్ బలహీనమవుతుంది, దీంతో విదేశీ పెట్టుబడులు అభివృద్ధి చెందుతున్న మార్కెట్లకు ముఖ్యంగా భారతదేశానికి చేరే అవకాశాలు పెరుగుతాయి. కానీ ఇటీవలి వారాల్లో రూపాయి ఇప్పటికే ఒత్తిడిలో ఉంది. దేశీయ వాణిజ్య ఆందోళనలు, గ్లోబల్ రిస్క్ అవర్షన్, ఫెడ్ విధానంపై అనిశ్చితి రూపాయిపై అదనపు భారాన్ని మోపాయి.
అధిక వడ్డీ రేటు వాతావరణం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక పరిస్థితులను కఠినతరం చేస్తోంది. అర్థ భారత్ గ్లోబల్ మల్టిప్లయర్ ఫండ్ మేనేజర్ నచికేత సావ్రికర్ చెప్పినట్లు, ఈ అనిశ్చితి భారత ఆస్తుల విలువలపై ఒత్తిడి పెంచుతోంది. ముఖ్యంగా రేటు-సున్నితమైన రంగాలలో మార్పులకు కారణమవుతోంది. ఎఫ్‌ఐఐ (FII) ప్రవాహాలు కూడా రాబోయే రోజుల్లో అస్థిరంగా ఉండే అవకాశం ఉంది. ఇది భారతీయ ఈక్విటీలు, బాండ్ మార్కెట్లపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుంది. బంగారం ధరలు మాత్రం ఈ వాతావరణంలో భారీగా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గ్లోబల్ అనిశ్చితి పెరిగినప్పుడు ఇన్వెస్టర్లు సేఫ్ హేవెన్ ఆస్తులను ఆశ్రయించటం సహజం.
More From GoodReturns

ఇరాన్ యుద్ధంపై ట్రంప్ సంచలన ప్రకటన.. చారిత్రాత్మక ఒప్పందంపై ఏమన్నారంటే..

అమెరికాతో చర్చలేమి జరగలేదు..ట్రంప్ వ్యాఖ్యలను ఖండించిన ఇరాన్.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలిందనే భయంతోనే..

పాకిస్తాన్లా బ్రోకర్ పనులు భారత్ ఎప్పటికీ చేయదు.. ట్రంప్‌తో ఫోన్లో ప్రధాని మోదీ మాట్లాడారు: జైశంకర్

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన..శత్రుదేశాల నౌకలకు ప్రవేశం లేదని స్పష్టం చేసిన టెహ్రాన్..

వెండి ధరలు బిగ్ క్రాష్.. దెబ్బకు నిలిచిపోయిన ట్రేడింగ్.. లబోదిబోమంటున్న పెట్టుబడిదారులు

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?



Click it and Unblock the Notifications