కేంద్ర ఆర్థికమంత్రిత్వ శాఖ ప్రకారం ఫిబ్రవరి నెలలో జీఎస్టీ వసూళ్లు రూ.1.33 లక్షల కోట్లకు పైగా వసూలయ్యాయి. ఏడాది ప్రాతిపదికన జీఎస్టీ వసూళ్లు 18 శాతం పెరిగాయి. మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ ప్రకారం ఫిబ్రవరి 2022లో జీఎస్టీ కలెక్షన్స్ అక్షరాలా రూ.1,33,026 కోట్లు. ఇందులో సీజీఎస్టీ రూ.24,435 కోట్లు, ఎస్‌జీఎస్టీ రూ.30,779 కోట్లు, ఐజీఎస్టీ రూ.67,4714 కోట్లు. ఇందులో రూ.33,837 కోట్లు దిగుమతి ఉత్పత్తుల ద్వారా వచ్చిన ఆదాయం కూడా ఉంది. సెస్ ద్వారా రూ.10,340 కోట్లు వచ్చింది. ఇందులో దిగుమతి ఉత్పత్తుల వాటా రూ.638 కోట్లు. సెస్ మొదటిసారి రూ.10వేల కోట్ల మార్కు దాటింది.
గత ఏడాది ఫిబ్రవరి నెలతో పోలిస్తే ఈసారి జీఎస్టీ వసూళ్లు 18 శాతం, 2020లో ఇదే నెలతో పోలిస్తే 26 శాతం పెరిగాయి. 2021 ఏప్రిల్ నెలలో వసూళ్లు ఆల్ టైమ్ గరిష్టాన్ని తాకాయి. ఆ నెల రూ.1.41 లక్షల కోట్లు వసూలు అయ్యాయి. ఫిబ్రవరి నెలలో 28 రోజులు మాత్రమే ఉంటాయి. కాబట్టి జనవరితో పోలిస్తే వసూళ్లు కాస్త తగ్గాయి. ఒమిక్రాన్ వ్యాప్తి కారణంగా విధించిన పాక్షిక లాక్ డౌన్, వారంతపు, నైట్ కర్ఫ్యూ వంటి పరిణామాలు కూడా వసూళ్లపై ప్రభావం చూపాయి.

ప్రభుత్వం ఐజీఎస్టీ నుండి రూ.26,347 కోట్లను సీజీఎస్టీ, రూ.21,909 కోట్లను ఎస్‌జీఎస్టీకి సెటిల్ చేసింది. రెగ్యులర్ సెటిల్మెంట్ తర్వాత కేంద్రం, రాష్ట్రాల ఫిబ్రవరి మొత్తం రెవెన్యూ రూ.50,782 కోట్లు (సీజీఎస్టీ), రూ.52,688 కోట్లు (ఎస్‌జీఎస్టీ) ఉంది.
ఫిబ్రవరిలో 28 రోజులు ఉంటాయి. కాబట్టి జనవరితో పోలిస్తే కాస్త తగ్గాయి. కానీ జీఎస్టీ ప్రారంభమైనప్పటి నుండి ఓ ఫిబ్రవరి నెలలో అత్యధిక వసూళ్లు ఇవి. మరోవైపు, జీఎస్టీ వసూళ్లు ప్రారంభం నుండి ఐదో నెల రూ.1.30 లక్షల కోట్లు దాటింది.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications