మీ సేవింగ్స్ డబ్బు కాపాడుకోవడానికి మంచి బ్యాంకును సెలెక్ట్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే న్యూ ఇండియా కోఆపరేటివ్ బ్యాంక్ (NICB) మోసాలు(fraud) డిపాజిట్ల భద్రత గురించి అనేక ప్రశ్నలను లేవనెత్తింది. గతంలో కూడా చాలా సహకార బ్యాంకులు సంక్షోభాలను ఎదుర్కొన్నాయి, దీనివల్ల డిపాజిటర్లు భారీ నష్టాలను చూడాల్సి వచ్చింది. చాలా మంది ఎక్కువ వడ్డీ రేట్లు అందించే బ్యాంకుల కోసం వెతుకుతారు.
కానీ, ఏదైనా బ్యాంకు నమ్మకమైనదని మీరు ఖచ్చితం చేసుకోవాలి. మీ సేవింగ్స్ మొత్తాన్ని ఒకే బ్యాంకులో ఉంచడం కూడా ప్రమాదకరం. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) అనుబంధ సంస్థ అయిన డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారెంటీ కార్పొరేషన్ (DICGC) ఒక బ్యాంకులో రూ.5 లక్షల వరకు మాత్రమే ఇన్సూరెన్స్ అందిస్తుంది. అందువల్ల, మీ సేవింగ్స్ ఇతర బ్యాంకులులో కూడా పెట్టడం మంచిది.

బ్యాంకులను ఎంచుకునేటప్పుడు, ప్రభుత్వ రంగ బ్యాంకులకు ప్రాధాన్యత ఇవ్వాలి. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI), ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ (IOB), పంజాబ్ నేషనల్ బ్యాంక్ (PNB) వంటి బ్యాంకులు ప్రభుత్వ సహకారంతో పనిచేస్తాయి. ఇవి ఆర్థిక సంక్షోభాలను ఎదుర్కొనే అవకాశం తక్కువగా ఉంటుంది. కాబట్టి, మీ పూర్తి సేవింగ్స్ మొత్తాన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఉంచడం సురక్షితమైన నిర్ణయం.
ప్రభుత్వ రంగ బ్యాంకుల కంటే పెద్ద ప్రైవేట్ బ్యాంకులు ఎక్కువ వడ్డీ రేట్లను అందించవచ్చు. అయితే, ఇవి ఆర్థిక సంక్షోభానికి గురైతే పెట్టుబడిదారులు, కస్టమర్లు ప్రభావితమవుతారు. ఇప్పటికే యెస్ బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంక్ వంటి బ్యాంకులు సంక్షోభాలను ఎదుర్కొన్నాయి. కాబట్టి, మీరు మీ మొత్తం సేవింగ్స్ ప్రైవేట్ బ్యాంకుల్లో ఉంచకుండా ఉండాలి. దానిలో కొన్ని భాగాలను మాత్రమే సేవ్ చేయవచ్చు. చిన్న ఫైనాన్స్ బ్యాంకులు 8% లేదా అంతకంటే ఎక్కువ వడ్డీ రేట్లను అందించవచ్చు. అయితే, ఈ బ్యాంకులు ఎక్కువ కాలాం పాటు నమ్మదగినవిగా ఉంటాయనే హామీ లేదు. కాబట్టి, మీరు SFBలలో డబ్బు జమ చేయాలనుకుంటే, మీరు ఒకే బ్యాంకులో రూ. 5 లక్షల కంటే ఎక్కువ జమ చేయకూడదు.
సహకార బ్యాంకులు కొన్నిసార్లు అధిక వడ్డీ రేట్లను అందించవచ్చు. కానీ, ఇప్పటివరకు వందకి పైగా సహకార బ్యాంకులు దివాలా తీశాయి. అందువల్ల, సహకార బ్యాంకుల్లో పొదుపు చేయడం చాలా ప్రమాదకరం. అవసరమైతే ఇక్కడ చాలా తక్కువ మొత్తాన్ని మాత్రమే సేవింగ్స్ చేయాలి. DICGC బ్యాంకులో ప్రతి డిపాజిటర్‌కు రూ. 5 లక్షల వరకు ఇన్సూరెన్స్ అందిస్తుంది. ఇందులో వడ్డీ, అసలు రెండూ ఉంటాయి. కాబట్టి, మీ డిపాజిట్లను సురక్షితంగా ఉంచడానికి మీ డబ్బును ఇతర బ్యాంకులల్లో పెట్టడం ఉత్తమం. పేమెంట్స్ తప్పిపోకుండా ఉండటానికి అకౌంట్ వివరాలను అప్ డేట్ చేయండి.
మీ ప్రతినెలా జీతం, పెన్షన్, EMI చెల్లింపులు మొదలైనవి క్రమం తప్పకుండా బ్యాంకు అకౌంట్లోకి చేరాలనుకుంటే, మీరు మీ బ్యాంక్ అకౌంట్ వివరాలను అప్ డేట్ చేయాలి. మీరు మ్యూచువల్ ఫండ్స్, ఆటో డెబిట్ మొదలైన వాటి కోసం కొత్త బ్యాంక్ వివరాలను రిజిస్టర్ చేసుకుని వెరిఫై చేయాలి. బ్యాంకింగ్ సంక్షోభం తలెత్తినప్పుడు, మీ బకాయి ఉన్న రుణాలను ఇతర బ్యాంకులకు బదిలీ చేయడం మంచిది. క్రమం తప్పకుండా EMI చెల్లింపులు జరిగేలా చూసుకోవడానికి, మీరు కొత్త బ్యాంకు సరైన అకౌంట్ వివరాలను అందించాలి. మీ సేవింగ్స్ కాపాడుకోవడానికి తెలివైన నిర్ణయాలు తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక ఆర్థిక స్థిరత్వం లభిస్తుంది.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications