Father's day 2021: నాన్న..హీరో: వాట్సప్‌లో అద్భుతమైన ఫీచర్: డౌన్‌లోడ్ ఇలా

న్యూఢిల్లీ: ఆదివారం ఫాదర్స్ డే. ప్రతి సంవత్సరం జూన్ మూడో ఆదివారాన్ని ప్రపంచవ్యాప్తంగా తండ్రుల దినోత్సవంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ సారి కూడా నాన్నల గొప్పదనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే తండ్రుల దినోత్సవం ఈ ఆదివారం జరుపుకోబోతోన్నాం. ఈ సందర్భాన్ని పురస్కరించకుని టాప్ ఇన్‌స్టంట్ మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ వాట్సాప్‌ యూజర్ల కోసం కొత్త ఫీచర్స్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. తండ్రుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వాట్సప్ యాజమాన్యం పాపా మేరే పాపా థీమ్‌తో రూపొందించిన ఫీచర్ ఇది.

యూజర్లు తమ వాట్సప్ యాప్‌ను అప్‌డేట్ చేసుకోవడం ద్వారా ఈ ఫీచర్‌ను వినియోగించుకోవచ్చు. పాపా మేరే పాపా థీమ్‌తో- తండ్రులకు సంబంధించిన కొన్ని స్టిక్కర్లను వాట్సప్ రూపొందించింది. ఈ స్టిక్కర్ ప్యాక్ సైజ్ 8.3 మెగా బైట్స్. సాజిద్ షేఖ్ దీన్ని రూపొందించారు. ఒకే రూపంతో ఉన్న స్టిక్కర్ వేర్వేరు ఫోజుల్లో కనిపిస్తుందీ ప్యాక్‌లో. ఆండ్రాయిడ్, ఐఓఎస్ ఆధారిత మొబైల్ ఫోన్ యూజర్లు ఇప్పటికిప్పుడు తమ వాట్సప్‌ యాప్‌ను అప్‌డేట్ చేసుకోవడం ద్వారా దీన్ని పొందవచ్చు.

Fathers day 2021: WhatsApp launches Papa mere papa stickers in India

ఈ ప్యాక్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలంటే.. తొలుత యూజర్లు తమ వాట్సప్‌లో వ్యక్తిగతంగా లేదా గ్రూప్ ఛాట్ విండోను ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అక్కడ కనిపించిన ప్లస్ ఐకాన్‌ను ప్రెస్ చేయాల్సి ఉంటుంది. ఆ వెంటనే స్టిక్కర్ మెను ప్రత్యక్షమౌతుంది. స్టిక్కర్ సెక్షన్‌లోకి వెళ్లాలి. ఈ సెక్షన్‌లో లేటెస్ట్ స్టిక్కర్ ప్యాక్ కనిపిస్తుంది. దాన్ని డౌన్‌లోడ్ చేసుకోవాలంటే.. డౌన్‌లోడ్ ఐకాన్‌ను ప్రెస్ చేయాలి. డౌన్‌లోడ్ పూర్తయిన తరువాత.. చెక్ మార్క్ ప్రత్యక్షమౌతుంది. దాన్ని పైకి స్వైప్ చేయడం ద్వారా డౌన్‌లోడ్ చేసుకున్న ప్యాక్‌లోని స్టిక్కర్లన్నీ కనిపిస్తాయి. తమకు ఇష్టమైన స్టిక్కర్‌పై ప్రెస్ చేయడం ద్వారా దాన్ని వాట్సప్ ఛాట్‌గా పంపించవచ్చు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+