ఫాస్టాగ్‌ను ఉపయోగిస్తున్న వాహనదారులకు అలర్ట్ న్యూస్.. ఫిబ్రవరి 1 నుంచి FASTag నియమాలు మారబోతున్నాయి. ఈ మార్పులు ప్రత్యక్షంగా ప్రైవేట్ వాహన యజమానులపై ప్రభావం చూపనున్నాయి. నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI) కొత్త మార్గదర్శకాలను అమలు చేయనుంది. ముఖ్యంగా, కార్లు, జీపులు, వ్యాన్ల కోసం జారీ చేసే కొత్త FASTagలకు సంబంధించి KYV (Know Your Vehicle) ప్రక్రియను నిలిపివేయడం ప్రధాన మార్పుగా నిలుస్తోంది.
ఇప్పటివరకు కొత్త FASTag కొనుగోలు చేసిన తర్వాత వాహన వివరాలను ధృవీకరించేందుకు యాక్టివేషన్ అనంతరం KYV ప్రక్రియ తప్పనిసరిగా ఉండేది. అయితే ఈ ప్రక్రియ తరచుగా ఆలస్యం కావడం, పత్రాలు ఇప్పటికే సమర్పించినప్పటికీ మళ్లీ మళ్లీ ఫాలోఅప్ చేయాల్సి రావడం వల్ల వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. చాలా సందర్భాల్లో FASTag యాక్టివ్ అయినా, KYV పెండింగ్ కారణంగా టోల్ ప్లాజాల వద్ద సమస్యలు ఎదురవుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ సమస్యకు చెక్ పడనుంది.

ఈ సమస్యలకు పరిష్కారంగా.. ఫిబ్రవరి 1 నుంచి కార్ల కోసం కొత్తగా జారీ చేసే FASTagలకు KYV ప్రక్రియను పూర్తిగా నిలిపివేస్తున్నారు. దీని వల్ల వాహనదారులు ట్యాగ్ యాక్టివేషన్ తర్వాత ఎలాంటి అదనపు ధృవీకరణలు లేకుండా FASTagను నిరంతరాయంగా ఉపయోగించుకోవచ్చు. ఈ కొత్త నియమం భౌతిక విక్రయ కేంద్రాల ద్వారా గానీ, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా గానీ కొనుగోలు చేసిన FASTagలకు సమానంగా వర్తిస్తుంది.
ఇంకో ఒక ముఖ్యమైన విషయం ఏమిటంటే.. గతంలో జారీ చేసిన FASTagలకు కూడా ఇకపై తరచుగా KYV అవసరం ఉండదు. అయితే, కొన్ని ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే KYV చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకు తప్పుగా జారీ చేసిన FASTag, వాహనానికి సరిగా అంటించని ట్యాగ్, దెబ్బతిన్న FASTag లేదా అనుమానాస్పద దుర్వినియోగం గుర్తించబడితే మాత్రమే KYV ప్రక్రియను అమలు చేస్తారు. సాధారణ వినియోగదారులకు ఇది పెద్ద ఉపశమనంగా మారనుంది.
కొత్త నిబంధనల ప్రకారం.. FASTag యాక్టివేషన్‌కు ముందే బ్యాంకులు వాహన ధృవీకరణను పూర్తి చేయాల్సి ఉంటుంది. వాహన వివరాలను మొదట అధికారిక వాహన డేటాబేస్‌తో సరిపోలుస్తారు. ఆ సమాచారం అందుబాటులో లేకపోతే.. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ (RC) ఆధారంగా వాహనాన్ని ధృవీకరిస్తారు. ఆన్‌లైన్‌లో FASTag కొనుగోలు చేసే వినియోగదారులకు కూడా ఇదే విధానం వర్తిస్తుంది.
ఏదేమైనా ఈ కొత్త FASTag నిబంధనలు వాహనదారుల అనుభవాన్ని మరింత సులభతరం చేయడమే లక్ష్యంగా తీసుకొచ్చారు. అనవసరమైన ఆలస్యాలు, డాక్యుమెంట్ సమస్యలు తగ్గి, టోల్ ప్లాజాల వద్ద సాఫీగా ప్రయాణం సాగేందుకు ఈ మార్పులు దోహదపడతాయి. ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి వచ్చే ఈ నియమాలను ప్రతి FASTag వినియోగదారు తెలుసుకుని ఉండటం చాలా అవసరం.
More From GoodReturns

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదల ఎంతో తెలుసా.. మార్చి 20, శుక్రవారం ధరలు ఇవే..

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..



Click it and Unblock the Notifications