న్యూఢిల్లీ: ఫాస్టాగ్ కలెక్షన్లు అదరగొట్టాయి. ఇదివరకెప్పుడూ లేనంత రికార్డు స్థాయిలో వసూళ్ల వర్షం కురిసింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో నమోదైన వసూళ్లు కొత్త రికార్డును నెలకొల్పాయి. వాహనాల రాకపోకలు పెరగడం, ఫాస్టాగ్‌ను తప్పనిసరి చేయడం, టోల్ ప్లాజాల వద్ద అన్ని లేన్లనూ ఫాస్టాగ్‌రూ బదలాయించడం.. వంటి చర్యలు దీనికి కారణాలు అయ్యాయి. ఫలితంగా- ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో ఫాస్టాగ్ ద్వారా సాధించాల్సిన ఆదాయాన్ని మరింత పెంచుకుంది. భారీ టార్గెట్‌ను నిర్దేశించుకుంది కేంద్ర ప్రభుత్వం.

ఒక్క నెలలో రికార్డు స్థాయిలో..
గత ఆర్థిక సంవత్సరం చివరి నెల అంటే మార్చిలో ఫాస్టాగ్ ద్వారా వచ్చిన ఆదాయం 4,095 కోట్ల రూపాయలు. ఈ స్థాయి కలెక్షన్లు ఇదివరకెప్పుడు నమోదు కాలేదు. 2016లో డిజిటల్ కలెక్షన్ల వ్యవస్థను జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ ప్రవేశపెట్టింది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ స్థాయిలో వసూళ్లు రాలేదు. తొలిసారిగా 4,000 కోట్ల రూపాయల మార్క్‌ను దాటాయి. గత ఆర్థిక సంవత్సరం మొత్తానికి 38,084 కోట్ల రూపాయలను ఫాస్టాగ్ ద్వారా మాత్రమే వసూలయ్యాయి.

68 శాతం పెరుగుదల..
2020-21 ఆర్థిక సంవత్సరంలో పోల్చుకుని చూస్తే 68 శాతం పెరుగుదల కనిపించింది. కిందటి సంవత్సరం మార్చినెలలో నమోదైన వసూళ్లపరంగా చూసినా తాజాగా సాధించిన వసూళ్లు 33 శాతం అధికం. గత ఆర్థిక సంవత్సరం మొత్తం మీద నమోదైన 38,084 కోట్ల రూపాయల్లో చివరి త్రైమాసికం అంటే జనవరి-ఫిబ్రవరి-మార్చి నెలల్లో వచ్చిన కలెక్షన్ల వాటా అధికం. ఫిబ్రవరిలో 13 శాతం కలెక్షన్ల పెరుగుదల చోటు చేసుకుంది.

ఏప్రిల్ 1 నుంచి కొత్త ఛార్జీలు అమల్లో..
ఆ ఒక్కనెలలోనే అయిదు కోట్ల వరకు ఫాస్టాగ్‌ను నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ (ఎన్సీసీఐ) జారీ చేసింది. 27 కోట్ల ఫాస్టాగ్ లావాదేవీలు నమోదయ్యాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అంటే 2022-23 ఆరంభం నుంచే కేంద్ర ప్రభుత్వం టోల్ ప్లాజాల వద్ద వాహనదారులు చెల్లించాల్సిన ఛార్జీల మొత్తాన్ని భారీగా పెంచిన విషయం తెలిసిందే. ఈ నెల 1వ తేదీ నుంచి ఇవి అమల్లోకి వచ్చాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ వాటి ఛార్జీలు పెరిగాయి. ఈ అదనపు భారాన్ని తెలంగాణ ఆర్జీసీ యాజమాన్యం ప్రయాణికులపై ఇప్పటికే మోపింది.

ఈ ఆర్థిక సంవత్సరంలో టార్గెట్ మరింత..
కార్లు, జీపులు వంటి వాహనాలపై 5 నుంచి 10, బస్సులు, లారీలు- 15 నుంచి 25, భారీ వాహనాలు-40 నుంచి 50 రూపాయల వరకు టోల్ ఛార్జీలను పెంచింది కేంద్ర ప్రభుత్వం. ఒక్కో వాహనం మీద సగటున 30 నుంచి 50 రూపాయల మేర అదనంగా టోల్ ప్లాజా ఛార్జీల అదనపు భారం పడింది. గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన 38,084 కోట్ల రూపాయలకు మించిన ఆదాయాన్ని ఆర్జించడానికే కేంద్రం ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది.
More From GoodReturns

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Bengaluru: ట్రాఫిక్ కష్టాలకు గుడ్ బై.. ఈ యువతి ఐడియా నెటిజన్లను ఆశ్చర్యపరుస్తోంది!

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..



Click it and Unblock the Notifications