FASTag Annual Toll Pass 2025: జాతీయ రహదారులపై ప్రయాణం విషయంలో కేంద్రంలోని మోదీ సర్కారు కీలక నిర్ణయం తీసుకుంది. కొత్తగా ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్‌ను అందుబాటులోకి తీసుకువచ్చింది. ఈ పాస్ ద్వారా టోల్ ప్లాజాల వద్ద పొడవైన క్యూలతో ఇబ్బంది పడుతున్న ప్రజలకు ఉపశమనం లభించనుంది. 15 ఆగస్టు 2025న ఫాస్ట్‌ట్యాగ్ ఆధారిత వార్షిక పాస్‌ను ప్రారంభించడానికి ప్రణాళిక రూపొందించామని కేంద్ర రహదారులు, రోడ్డు రవాణా మంత్రి నితిన్ గడ్కరీ తెలిపారు.
వాహన ప్రయాణికులు రూ. 3 వేలు చెల్లించి ఈ పాస్ తీసుకోవాల్సి ఉంటుందని కేంద్రమంత్రి బుధవారం ఎక్స్‌లో పోస్ట్ చేశారు.యాక్టివేట్ చేసిన పాస్‌లు ఏడాదిపాటు లేదా 200 ట్రిప్పులు రెండింటిలో ఏదో ఒకటి చెల్లుబాటు అవుతుందని నితిన్ గడ్కరీ తెలిపారు. కార్లు, జీపులు, వ్యాన్లు వంటి నాన్- కమర్షియల్ వాహనాలకు ఇది వర్తిస్తుందని ఆయన వెల్లడించారు. ఒక సంవత్సరంలో 200 ప్రయాణాలు పూర్తి కాకపోతే లేదా రూ. 3000 మొత్తం ఉపయోగించకపోతే తరువాతి సంవత్సరానికి ఈ పాస్ లో ఉన్న మొత్తం చెల్లదనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది. ప్రస్తుతం వచ్చిన కథనం ప్రకారం ఈ పాస్ ఒక సంవత్సరం మాత్రమే చెల్లుతుంది. ఏడాదిలోపే ఈ ప్రాసెస్ వాహన ప్రయాణికులు పూర్తి చేయాల్సి ఉంటుంది.

ఈ ఫాస్టాగ్ వార్షిక పాస్ ప్రత్యేకంగా వాణిజ్యేతర ప్రైవేట్ వాహనాల (కార్లు, జీపులు, వ్యాన్లు మొదలైనవి) కోసం మాత్రమే రూపొందించబడింది. ఈ వాహనాలన్నీ దేశవ్యాప్తంగా ప్రధాన జాతీయ రహదారులపై సజావుగా ప్రయాణించడానికి ఈ పాస్ వీలు కల్పిస్తుంది. ఈ వార్షిక పాస్ యాక్టివేషన్/పునరుద్ధరణ కోసం హైవే ట్రావెల్ యాప్, NHAI/MoRTH వెబ్‌సైట్‌లలో త్వరలో ప్రత్యేక లింక్ అందుబాటులోకి వస్తుందని కేంద్ర మంత్రి గడ్కరీ తెలిపారు.లింక్ అందుబాటులోకి రాగానే వాహన ప్రయాణికులు డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు. అలాగే ఫాస్ట్‌ట్యాగ్ లో రూ. 3 వేలు అయిపోతే సాధారణ రీఛార్జ్ మాదిరిగానే చేసుకోవచ్చు.
కొత్తగా తీసుకువచ్చిన ఈ విధానం 60 కి.మీ పరిధిలో ఉన్న టోల్ ప్లాజాల గురించి చాలా కాలంగా ఉన్న ట్రాఫిక్ ఆందోళనలను పరిష్కరించే అవకాశం ఉంది. ఒకే అనుకూలమైన లావాదేవీ ద్వారా టోల్ చెల్లింపులను ఇది సజావుగా చేస్తుంది. అలాగే టోల్ ప్లాజా వద్ద వేచి ఉండే సమయాన్ని తగ్గించడం, టోల్ ప్లాజాల వద్ద వివాదాలు లేకుండా చేసేందుకు సాయపడనుంది.ఈ వార్షిక పాస్ విధానం లక్షలాది మంది ప్రైవేట్ వాహనదారులకు వేగవంతమైన ప్రయాణంతో పాటుగా..సౌకర్యవంతమైన ప్రయాణ అనుభవాన్ని అందిస్తుందని కేంద్ర మంత్రి తెలిపారు. కాగా రాజ్‌మార్గ్ యాప్‌తోపాటు NHAI (National Highways Association of India), MoRTH (Ministry of Road Transport and Highways) వెబ్‌సైట్లలో ఈ లింగ్ అందుబాటులోకి రానుంది.
ప్రస్తుతం, ఒక నిర్దిష్ట టోల్ ప్లాజా గుండా తరచుగా ప్రయాణించే ప్రయాణికులు చిరునామా ధృవీకరణ, సంబంధిత డాక్యుమెంటేషన్‌ను సమర్పించడం ద్వారా నెలవారీ పాస్‌లను పొందవచ్చు. ఈ పాస్‌ల ధర నెలకు రూ. 340 ఉండగా మొత్తం సంవత్సరానికి రూ. 4,080గా ఉంది. 2023-24లో మొత్తం రూ.55,000 కోట్ల టోల్ ఆదాయంలో ప్రైవేట్ కార్లు రూ.8,000 కోట్లు మాత్రమే అందించాయని టోల్ గణాంకాలు సూచిస్తున్నాయి.
టోల్ లావాదేవీల విశ్లేషణ ప్రకారం, ప్రైవేట్ కార్లు మొత్తం పాసేజీలలో 53% వాటా కలిగి ఉన్నప్పటికీ, అవి ఆదాయంలో కేవలం 21% మాత్రమే ఉన్నాయి.అదనంగా, ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల మధ్య ట్రాఫిక్‌లో ప్రైవేట్ వాహనాలు దాదాపు 60% వాటా కలిగి ఉండగా, వాణిజ్య వాహనాలు పగలు, రాత్రి సమయాల్లో స్థిరంగా కదలికను కొనసాగిస్తున్నాయి.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications