హైవే మీద ప్రయాణం అంటే టోల్‌గేట్ దగ్గర ఆగడం, వాహనాల లైన్‌లో నిలబడటం, రీఛార్జ్ అయిపోయిందేమో అనే టెన్షన్ ఇవన్నీ డ్రైవర్లకు కొత్తేమీ కావు. ఇప్పుడు ఈ సమస్యలకు ఒక సులభమైన పరిష్కారం తీసుకొచ్చింది జాతీయ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా (NHAI). వారు తాజాగా FASTag వార్షిక పాస్ను ప్రారంభించారు. కేవలం రూ. 3,000 చెల్లిస్తే, ఏడాది పాటు మీరు ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు జాతీయ రహదారులపై, ఎక్స్‌ప్రెస్‌వే లపై టోల్‌గేట్ వద్ద ఆగకుండా ప్రయాణించవచ్చు.

ఈ పాస్ ఏమిటి?
ఇది ఒక ప్రత్యేకమైన ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్. దీన్ని ఒకసారి తీసుకుంటే మీరు ఏడాది పాటు రోడ్డుపై టోల్‌గేట్లు దాటేటప్పుడు ప్రతి సారి వేర్వేరుగా టోల్ చార్జీలు చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ పాస్‌కి వాణిజ్య వాహనాలు (లారీలు, ట్రక్కులు వంటివి) అర్హులు కావు. కేవలం ప్రైవేటు వాహనాలు ఉదాహరణకి కార్లు, జీపులు, వ్యానులు వంటి వాటికి మాత్రమే ఈ సదుపాయం ఉంటుంది. ఈ పాస్ కొనుగోలు చేసిన తర్వాత టోల్ చార్జీలు మళ్లీ మళ్లీ రీఛార్జ్ చేయాల్సిన పని ఉండదు.
సాధారణంగా ఫాస్టాగ్ వాడితే మీ ఖాతాలో ఉన్న డబ్బు తగ్గిపోతుంది, అప్పుడు మళ్లీ మళ్లీ రీఛార్జ్ చేయాల్సి వస్తుంది. కానీ ఈ వార్షిక పాస్ తీసుకుంటే ఆ టెన్షన్ ఉండదు. ఒకసారి మాత్రమే మొత్తం మొత్తాన్ని చెల్లిస్తే, ఒక సంవత్సరం పాటు ఆ రహదారిపై మీరు ఎన్ని సార్లు వెళ్ళినా మళ్లీ టోల్ చార్జీ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అంటే, ఒకే చెల్లింపుతో మొత్తం సంవత్సరం ఫ్రీగా, టెన్షన్ లేకుండా ప్రయాణం చేయొచ్చు.
పాస్‌ను ఎలా యాక్టివేట్ చేయాలి?
1. రాజమార్గ యాత్ర (Rajmarg Yatra) యాప్ లేదా NHAI అధికారిక వెబ్‌సైట్ ద్వారా పాస్ కొనుగోలు చేయాలి.
2. ముందుగా మీ వాహనం వివరాలు, ఫాస్టాగ్ వివరాలు వెరిఫై చేయాలి.
3 రూ. 3,000 చెల్లించిన వెంటనే ప్రాసెస్ పూర్తవుతుంది.
4. రెండు గంటల్లోపే ఈ పాస్ యాక్టివేట్ అవుతుంది.
5. ఈ పాస్ ఒక సంవత్సరం లేదా గరిష్టంగా 200 ప్రయాణాలు (ట్రిప్స్) వరకు వాడుకోవచ్చు.
ఈ పాస్ కేవలం జాతీయ రహదారులు (NH), జాతీయ ఎక్స్‌ప్రెస్‌వేలు (NE)లోని టోల్ ప్లాజాల దగ్గర మాత్రమే వర్క్ అవుతుంది. స్టేట్ హైవేలు లేదా ప్రైవేటు రోడ్లు మీద ఇది పనిచేయదు. ఇప్పటికే ఫాస్టాగ్ ఉన్నవారు కొత్త ట్యాగ్ కొనాల్సిన అవసరం లేదు. అదే ట్యాగ్‌పై ఈ పాస్ యాక్టివేట్ అవుతుంది. అయితే, ఆ ట్యాగ్‌లో "వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ (VRN)"తో కేవైసీ వివరాలు సరిగ్గా ఉండాలి.
డ్రైవర్లు ఏడాదికి సుమారు రూ. 5,000 - రూ. 7,000 టోల్ ఖర్చు ఆదా చేసుకోవచ్చు. ప్రయాణ మధ్యలో "రీఛార్జ్ అయిపోయింది" అనే ఆందోళన ఉండదు. ఈ పాస్ ఇతర వాహనానికి ట్రాన్స్‌ఫర్ చెయ్యలేరు. క్లోజ్డ్ టోల్ రూట్లలో ఒక ట్రిప్ అంటే ఎంట్రీ నుంచి ఎగ్జిట్ వరకు పరిగణిస్తారు. ఓపెన్ టోల్ రూట్లలో ఒక్కో ప్లాజా క్రాస్ చేసిన ప్రతీసారి వేరే ట్రిప్‌గా లెక్కలోకి వస్తుంది.
హైవే మీద ఎక్కువ ప్రయాణాలు చేసే కుటుంబాలు, ఆఫీస్-టు-సిటీ ట్రావెలర్స్, పర్యటనలు చేసేవారు వీరందరికీ ఇది ఒక పెద్ద రిలీఫ్. రీఛార్జ్ సమస్యలు లేకుండా, డబ్బు కూడా సేవ్ అవుతుంది. ముఖ్యంగా ప్రతి వారం టోల్ గేట్లు దాటే వాళ్లు దీని వల్ల చాలా లాభపడతారు.
ఇప్పటివరకు రహదారుల మీద టోల్ చెల్లింపులు చాలామందికి చిన్న చిన్న ఇబ్బందులు కలిగించేవి. కానీ ఈ కొత్త ఫాస్టాగ్ ఆధారిత వార్షిక పాస్ ద్వారా ప్రయాణం మరింత సులభం, వేగం, తక్కువ టెన్షన్‌తో మారబోతోంది. ఒకసారి పాస్ తీసుకుంటే సంవత్సరం పొడవునా మీరు ఆందోళన లేకుండా ప్రయాణించవచ్చు. ఇది సమయం ఆదా చేయడమే కాకుండా, ప్రయాణానికి సంబంధించిన చిన్న చిన్న చిక్కులను కూడా తొలగిస్తుంది. భవిష్యత్తులో మరిన్ని రహదారుల మీద కూడా ఇలాంటి సౌకర్యాలు వస్తే, డ్రైవింగ్ అనుభవం మరింత ఆనందంగా మారడం ఖాయం.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications