Nykaa share price : స్టాక్ మార్కెట్‌లో కొనసాగుతున్న అస్థిరతల మధ్య నిన్న మంగళవారం ఇన్వెస్టర్లు బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ కంపెనీ Nykaa మాతృ సంస్థ అయిన FSN E-కామర్స్ వెంచర్స్ లిమిటెడ్ షేర్లను కొనేందుకు మక్కువ కనబరిచారు. అయితే ఈ వారంలోనే రెండవ రోజు అంటే మంగళవారం (మార్చి 11) కంపెనీ పూర్తిగా యాజమాన్యంలోని కొత్త అనుబంధ సంస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపింది. ఈ వార్త వెలువడిన తరువాత Nykaa షేర్లు ఊపందుకున్నాయి.
కంపెనీ వ్యాపార వివరాలు: నిజానికి, FSN ఈ-కామర్స్ వెంచర్స్ నైకా ఎస్సెన్షియల్స్ ప్రైవేట్ లిమిటెడ్‌ను స్థాపించింది. ఈ కంపెనీ రిజిస్టర్డ్ ఆఫీస్ మహారాష్ట్రలోని ముంబైలో ఉంది. ఈ అనుబంధ సంస్థ బ్యూటీ అండ్ పర్సనల్ కేర్ (BPC) రిటైల్ విభాగంలో కోనసాగుతుంది. ఈ విభాగంలో ఇ-కామర్స్ ఇంకా ఫిజికల్ స్టోర్స్ రెండూ ఉంటాయి. నైక్ ఎసెన్షియల్స్ బ్యూటీ కాస్మెటిక్స్, పర్సనల్ కేర్, హెల్త్ కేర్, లైఫ్ స్టయిల్ ఇంకా పెర్ఫ్యూమరీ ప్రొడక్ట్స్ బిజినెస్ అలాగే డీల్స్ పై పనిచేస్తుంది. అయితే, ఈ కొత్త సంస్థ ఇంకా వ్యాపార కార్యకలాపాలను ప్రారంభించలేదు. కానీ ఈ అనుబంధ కంపెనీలో Nykaaకి 100% మ్యానేజ్మెంట్ ఉంటుంది.

Nykaa Now లాంచ్: ఈ చర్య Nykaa వ్యాపార వ్యూహానికి అనుగుణంగా ఉంది. ఈ కంపెనీ తాజాగా 'నైకా నౌ' అనే ఈ-కామర్స్ ప్రారంభించింది. సెలెక్ట్ చేసిన మెట్రో నగరాల్లో ప్రతిరోజు ఉపయోగపడే నిత్యావసరాలను 30 నిమిషాల నుండి మూడు గంటలలోపు అందించడం దీని లక్ష్యం.
Nykaa షేర్ ధర: BSEలో FSN ఈ-కామర్స్ వెంచర్స్ లిమిటెడ్ షేర్లు నిన్న రూ.165.85 వద్ద ముగిశాయి. ఈ స్టాక్ మొత్తంగా 2.06% పెరిగింది. అలాగే ట్రేడింగ్ సమయంలో ఈ స్టాక్ రూ.166.60 గరిష్ట స్థాయికి చేరుకుంది. మార్చి 2024లో షేరు ధర రూ.145.35 కనిష్ట స్థాయికి పడిపోయింది. దింతో స్టాక్‌లో 52 వారాల కనిష్ట స్థాయి చేరింది. ఆగస్టు 2024లో ఈ షేరు ధర రూ.229.90 స్థాయికి ఎగబాకింది. ఇది ఈ స్టాక్ 52 వారాల గరిష్ట స్థాయి.
స్టాక్ టార్గెట్ ధర: స్విట్జర్లాండ్‌కు చెందిన బ్రోకరేజ్ సంస్థ UBS Nykaa షేర్లను 'న్యూట్రల్' నుండి 'బై'కి అప్‌గ్రేడ్ చేశాయి. అయితే, బ్రోకరేజ్ స్టాక్ టార్గెట్ ధరను రూ.205 నుండి రూ.200కి తగ్గించింది.
Nykaa Q3 ఫలితాలు: 2025 ఆర్థిక సంవత్సరం (Q3FY25) మూడవ త్రైమాసికంలో Nykaa నికర లాభంలో 51.3 శాతం పెరుగుదలను నివేదించింది, దీనికి ఫెస్టివల్ అమ్మకాలు దోహదపడ్డాయి. గత సంవత్సరం (Q3FY24) ఇదే కాలంలో రూ. 17.45 కోట్లతో పోలిస్తే, Q3FY25లో రూ. 26.4 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. వరుస ప్రాతిపదికన నికర లాభం 103.6 శాతం పెరిగింది.


Click it and Unblock the Notifications