PM Kisan News: పీఎం కిసాన్ పథకం కింద కేంద్ర ప్రభుత్వం అందించే ఆర్థిక సహాయం కోసం చాలా మంది రైతులు ఎదురుచూస్తున్నారు. ప్రస్తుతం 19వ విడత డబ్బు విడుదలకు సర్వం సిద్ధం అయ్యింది. ప్రధాని మోదీ దేశంలోని రైతుల ప్రజలకు సహాయం కోసం వాస్తవానికి దీనిని ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
వచ్చే వారం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన 19వ విడత కోట్లాది మంది రైతుల ఖాతాల్లోకి విడుదల చేయబడుతుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 24న బీహార్‌లోని భాగల్పూర్ నుంచి నిధులను విడుదల చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. ప్రధానమంత్రి కిసాన్ పథకం కింద ఏటా రూ.6,000 డీబీటీ బెనిఫిట్ కింద నేరుగా ఖాతాలో జమచేస్తున్న సంగతి తెలిసిందే. దీనికింద దేశంలోని అర్హులైన రైతులందరికీ ప్రతి 4 నెలలకు ఒకసారి అంటే ఏడాదికి మూడు దఫాలుగా రైతుల ఖాతాలోకి పీఎం కిసాన్ నిధులను ఎలాంటి మధ్యవర్తులు లేకుండా బ్యాంక్ అకౌంట్లలోకి జమచేయబడుతున్న సంగతి తెలిసిందే.

పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం మరో మూడు రోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు నేరుగా జమచేయబడతారు. పీఎం కిసాన్ లో నమోదైన రైతులకు eKYC తప్పనిసరి. OTP ఆధారిత eKYC PMKISAN పోర్టల్‌లో అందుబాటులో ఉంది లేదా బయోమెట్రిక్ ఆధారిత eKYC కోసం సమీపంలోని CSC కేంద్రాన్ని సంప్రదించటం ద్వారా ప్రక్రియను పూర్తి చేయవచ్చు. స్కీమ్ బెనిఫిట్స్ పొందటానికి సదరు వ్యక్తి భారత పౌరుడై ఉండాలి. తక్కువ భూమి కలిగిన రైతై ఉండాలి. నెలకు పెన్షన్ రూపంలో రూ.10 వేల కంటే ఎక్కువ ఆదాయం ఉండకూడదు.
खुशहाली और समृद्धि के खुलेंगे द्वार, जब किसानों के खातों में आएंगे ₹2000
— Agriculture INDIA (@AgriGoI) February 17, 2025
माननीय प्रधानमंत्री श्री नरेन्द्र मोदी पीएम किसान सम्मान निधि की 19वीं किस्त का ट्रांसफर 24 फरवरी 2025 को भागलपुर, बिहार से करेंगे।
सभी किसान भाई-बहन योजना का लाभ उठाने के लिए आज ही अपनी eKYC पूरी करवाएं।… pic.twitter.com/XvoBFDR0H3
పిఎం కిసాన్ ఇన్‌స్టాల్‌మెంట్ మొత్తాన్ని అందుకోవడానికి లబ్దిదారుడు రైతుల ఆధార్ కార్డు తప్పనిసరిగా వారి బ్యాంకు ఖాతాతో అనుసంధానించబడి ఉండాలి. ఈ పథకాన్ని పొందేందుకు eKYC, యాక్టివ్ బ్యాంక్ ఖాతాతో ఆధార్ లింక్ అవసరం. ఈ ప్రభుత్వ పథకంలో భూమి ధృవీకరణ కూడా ఒక ముఖ్యమైన ప్రక్రియ. జాబితాలోని పేరును తనిఖీ చేయడానికి రైతులు ముందుగా PM కిసాన్ అధికారిక వెబ్‌సైట్ www.pmkisan.gov.inని సందర్శించాల్సి ఉంటుంది. అక్కడ హోమ్ పేజీలో 'బెనిఫిషియరీ లిస్ట్' ట్యాబ్‌పై క్లిక్ చేసి.. రాష్ట్రం, జిల్లా, ఉపజిల్లా, బ్లాక్, గ్రామం వంటి వివరాలను పూరించి రిపోర్ట్ ట్యాబ్‌పై క్లిక్ చేయాలి. అప్పుడు మీ స్క్రీన్‌పై లబ్ధిదారుల జాబితా కనిపిస్తుంది. అందులో మీరు మీ పేరును తనిఖీ చేసుకోవచ్చు.
కింది ప్రక్రియను పాటించటం ద్వారా రైతులు PM కిసాన్ పథకంలో తొలగించబడిన పేర్ల జాబితాను పరిశీలించవచ్చు..
Step 1: పీఎం కిసాన్ అధికారిక వెబ్‌సైట్‌కి లాగిన్ చేయండి.
Step 2: హోమ్ పేజీలో "డ్యాష్‌బోర్డ్"పై క్లిక్ చేయండి.
Step 3: రాష్ట్రం, జిల్లా, ఉప-జిల్లా, గ్రామానికి సంబంధించిన వివరాలు పూరించి "షో" పై క్లిక్ చేయండి.
Step 4: ఆధార్ స్టేటస్‌లో "తిరస్కరించబడింది" ఎంచుకోండి.
Step 5: పీఎం కిసాన్ సమన్ ఫండ్ తిరస్కరణలు, తిరస్కరణకు గల కారణాల గురించిన సమాచారాన్ని కలిగి ఉన్న జాబితా వస్తుంది. అందులో తిరస్కరణ కారణాలను పరిశీలించవచ్చు.
More From GoodReturns

Bengaluru: ఇండియాలో ఏ సిటీలో ఉండటం చీప్? బెంగళూరు నుండి ఢిల్లీ వరకు.. పూర్తి ఖర్చుల రిపోర్ట్!

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు భారీగా తగ్గాయి.. ఉగాది పర్వదినాన పసిడి ప్రియులకు పండగే పండగ.. మార్చి 19, గురువారం ధరలు ఇవే..

Interest rates Hike: త్వరలో ప్రపంచవ్యాప్తంగా పెరగనున్న వడ్డీ రేట్లు.. మన EMIలు కూడా పెరుగుతాయా?

బంగారం, వెండి ధరల పెరుగుదలపై బాంబు పేల్చిన కియోసాకి.. అంచనాలు చూస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..

Future city: హైదరాబాద్ పక్కనే భారత్ ఫ్యూచర్ సిటీ? ఇందులో ఏమేం ఉంటాయంటే..

బంగారం ధరలు ఈ స్థాయి వద్దకు దిగబోతున్నాయి.. కొనుగోలుపై కీలక నిర్ణయం తీసుకోమంటున్న ఆర్థిక నిపుణులు

గత 15 ఏళ్ళ రికార్డును తిరగరాస్తూ బంగారం, వెండి ధరలు ఢమాల్..భవిష్యత్తులో తగ్గుదలపై విశ్లేషకులు ఏమంటున్నారంటే..

క్రెడిట్ కార్డు క్లోజ్ చేసిన 10 ఏళ్ళ తర్వాత రూ. 33 లక్షలు కట్టాలని బ్యాంక్ నోటీసులు.. కస్టమర్ ఏం చేశాడంటే..

ఇరాన్ యుద్ధాన్ని బంగారంపై అస్త్రంగా వాడుకుంటున్న చైనా.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ పునాదులపై భారీ స్కెచ్..

Bengaluru: సిలికాన్ వ్యాలీకి ఏమైంది? టెక్ కంపెనీలు బెంగళూరుని వదిలి ఎందుకు వెళ్లిపోతున్నాయి?



Click it and Unblock the Notifications