రైతు దీక్షల వల్ల రోజువారీ నష్టం ఎంతో తెలుసా: రూ.వేల కోట్లు: అసోచామ్ ఆందోళన

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా అమలు చేయడానికి ఉద్దేశించిన మూడు వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతుల చేపట్టిన ఉద్యమం మరంత ఉధృతమౌతోంది. రోజురోజుకూ బలపడుతోంది. దేశ రాజధానిని ముట్టడించడానికి బయలుదేరిన రైతులు..ప్రతికూల వాతావరణంలోనూ తమ నిరసన ప్రదర్శనలను సడలించట్లేదు. ఎముకలు కొరికే చలిని సైతం వారు లెక్క పెట్టట్లేదు.. పట్టిన పట్టును విడవట్లేదు. కేంద్ర ప్రభుత్వం రైతు ప్రతినిధులతో చేపడుతోన్న సంప్రదింపులు, సమావేశాల్లో ప్రతిష్ఠంభన నెలకొంటోంది. అవి కొలిక్కి రావట్లేదు.

వ్యవసాయ అనుబంధ పరిశ్రమలపై దెబ్బ..

వ్యవసాయ అనుబంధ పరిశ్రమలపై దెబ్బ..

ఈ పరిణామాలతో వ్యవసాయ ఆధారిత కార్యకలాపాలు స్తంభించిపోయాయి. వ్యవసాయంపై ఆధారపడిన పరిశ్రమలు, రవాణా వ్యవస్థ, అనుబంధ రంగాలపై ఈ నిరసన దీక్షల ప్రభావం తీవ్రంగా పడుతోంది. కొన్ని రోజులుగా వ్యవసాయ పనులు నిలిచిపోవడం వల్ల.. దాని అనుబంధ రంగాల్లో స్తబ్దత నెలకొందని, అది మరింత ముదిరే అవకాశాలు లేకపోలేదని పారిశ్రామిక వర్గాలు, పరిశ్రమల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. కరోనా వైరస్ వ్యాప్తి చెందడాన్ని నివారించడానికి అమలు చేసిన లాక్‌డౌన్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న దేశ ఆర్థిక వ్యవస్థసై రైతుల నిరసన దీక్షలు ప్రభావం చూపుతున్నాయని చెబుతున్నాయి.

రోజూ రూ.3,500 కోట్ల నష్టం..

రోజూ రూ.3,500 కోట్ల నష్టం..

రైతాంగ నిరసన దీక్షల వల్ల రోజూ 3,500 కోట్ల రూపాయల మేర నష్టం వస్తోందని అసోసియేటెడ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఆఫ్ ఇండియా (అసోచామ్) అంచనా వేస్తోంది. ఈ నిరసన దీక్షల ప్రభావం సరఫరా రంగంపై తీవ్రంగా పడిందని అసోచామ్ సెక్రెటరీ జనరల్ దీపక్ సూద్ అన్నారు. పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్‌లతో ముడిపడి ఉన్న అన్ని రంగాలు దెబ్బతినే పరిస్థితి నెలకొందని చెప్పారు. ఫుడ్ ప్రాసెసింగ్, కాటన్ టెక్స్‌టైల్స్, ఆటోమొబైల్, ఫామ్ మిషనరీ, ఐటీ వంటి రంగాలు దేశీయ ఆర్థిక వ్యవస్థకు వన్నెముకగా ఉంటున్నాయని.. రోజులు తరబడి సాగుతోన్న ఈ దీక్షల వల్ల అవన్నీ ప్రభావితమౌతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు.

18 లక్షల కోట్ల లావాదేవీలు..

18 లక్షల కోట్ల లావాదేవీలు..

పంజాబ్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్, జమ్మూకాశ్మీర్‌లతో ముడిపడి ఉన్న ఆర్థిక కార్యకలాపాల విలువ ఒక రోజుకు 18 లక్షల కోట్ల రూపాయల మేర ఉంటుందని అన్నారు. రైతులు టోల్ గేట్లు, జాతీయ రహదారులు, రైళ్ల రాకపోకలను దిగ్బంధించడం వల్ల రవాణా రంగం మొత్తం కుదేల్ అయిందని, ఫలితంగా రోజూ 3,500 కోట్ల రూపాయల నష్టాన్ని ఆయా రంగాలు చవి చూస్తున్నాయని దీపక్ సూద్ అన్నారు. ప్రపంచ దేశాలు వేడుకగా జరుపుకొనే క్రిస్మస్ పర్వదినం సందర్భంగా ఏర్పడే మార్కెట్ డిమాండ్‌ను అందుకోలేకపోవాల్సి వస్తోందని చెప్పారు.

విదేశీ పెట్టుబడులపైనా

విదేశీ పెట్టుబడులపైనా

దేశీయంగా ఆటోమొబైల్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, టెక్స్‌టైల్స్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లల్లో కొన్ని విదేశీ సంస్థలు పెట్టుబడులు పెట్టాయని, ఇప్పడు వాటి ఆర్థిక ఫలితాలపైనా రైతుల దీక్షల ప్రభావం పడుతోందని అన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమించడానికి వ్యవసాయం, పరిశ్రమలు రెండు కళ్లుగా భావిస్తారని, అలాంటిది రైతాంగ దీక్షల వల్ల ఈ రెండు రంగాలు కునారిల్లే పరిస్థితి ఏర్పడిందని అన్నారు. రైతుల డిమాండ్లను సామరస్యంగా పరిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాల్సిన అవసరం ఉందని దీపక్ సూద్ పేర్కొన్నారు. మరిన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి కొనసాగితే.. నష్టాలు తప్పవని హెచ్చరించారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+