For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మైక్రోసాఫ్ట్ షాకింగ్, వచ్చే ఏడాది నుండి ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు గుడ్‌బై

|

అంతర్జాతీయ ఐటీ దిగ్గజం మైక్రోసాఫ్ట్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. దాదాపు పాతిక సంవత్సరాలుగా మైక్రోసాఫ్ట్ ద్వారా నెటిజన్లకు సేవలు అందిస్తోన్న ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ బ్రౌజర్ ఇక క్లోజ్ కానుంది. వ‌చ్చే ఏడాది జూన్ 15వ తేదీ నుండి ఇంట‌ర్నెట్ ఎక్స్‌ప్లోర‌ర్ సేవలను నిలిపివేస్తామని మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. ఈ వెబ్ బ్రౌజర్‌ను విండోస్ 95తో కంపెనీ విడుదల చేసింది.

ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ 11 డెస్క్‌టాప్ అప్లికేషన్‌కు వీడ్కోలు చెప్పాల‌ని నిర్ణ‌యించామని, విండోస్ 10కి చెందిన కొన్ని వర్షన్లలో 2022 జూన్ 15 నుండి ఈ సేవలు అందుబాటులో ఉండవని మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ ప్రోగ్రాం మేనేజర్ సియాన్ లిండర్‌సే తెలిపారు.

Farewell to Microsofts Internet Explorer

విండోస్ 10లో ఇక ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర సేవ‌ల‌ను మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌లో చూస్తామని, మైక్రోసాఫ్ట్ ఎడ్జ్ వేగవంతమైనది కావడంతో పాటు మరింత సురక్షితమని తెలిపారు. ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌ను మించిన‌ వినూత్న బ్రౌజింగ్ అనుభూతిని అందిస్తుందన్నారు. మైక్రోసాఫ్ట్ ఎడ్జ్‌లో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ మోడ్ ఉంటుందని, దీంతో ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్ ఆధారిత వెబ్‌సైట్స్, అప్లికేషన్లకు యాక్సెస్ కావొచ్చన్నారు.

English summary

మైక్రోసాఫ్ట్ షాకింగ్, వచ్చే ఏడాది నుండి ఇంటర్నెట్ ఎక్స్‌ప్లోరర్‌కు గుడ్‌బై | Farewell to Microsoft's Internet Explorer

Microsoft's Internet Explorer will finally be retired next year after more than 26 years of service, the tech giant says.
Story first published: Sunday, May 23, 2021, 17:38 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X