కరోనా మహమ్మారి వ్యాప్తి చెందకుండా కంపెనీలు, ఉద్యోగులు సహా ప్రతి ఒక్కరు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. సామాజిక దూరం పాటించడం, శానిటైజేన్ వంటి చేస్తున్నారు. సెంట్రలైజ్డ్ ఎయిర్ కండిషన్స్ కరోనా వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని చెబుతున్నారు. దీంతో లాక్ డౌన్ ఆంక్షలు క్రమంగా ఎత్తివేస్తున్న నేపథ్యంలో వివిధ సంస్థలు తమ కార్యాలయాల్లో సెంట్రల్ ఏసీకి బదులు ఫ్యాన్లు, కిటికీలు తెరవడం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నాయి.

ఏసీలు వద్దు.. అవసరమైతే ఖర్చుతో కూడుకున్న డివైజ్
వివిధ కంపెనీలు, సంస్థలు తమ కార్యాలయాల్లో సాధ్యమైనంత మేరకు ఏసీలు ఉపయోగించకపోవడం మంచిదిగా భావిస్తున్నాయి. ఎండాకాలం కారణంగా అవసరమైతే టేబుల్ ఫ్యాన్స్, సీలింగ్ ఫ్యాన్స్, కిటికీలు తెరవడం.. మరీ అవసరమైతే ఏసీని ఉపయోగిస్తే వైరస్‌ను నివారించేందుకు వీలుగా అల్ట్రా వయోలెట్ జెర్మిసైడ్ ఎరాడికేషన్ డివైజ్ ఉపయోగించే అంశాన్ని పరిశీలిస్తున్నాయి. ఈ డివైజ్ ఏర్పాటు ఖర్చుతో కూడుకున్నది. అయినా వైరస్‌ను అరికడుతుందనే గ్యారెంటీ కనిపించడం లేదు.

నిన్నటి వరకు అలా.. నేడు ఇలా
కరోనా వ్యాప్తిని నిరోధించేందుకు అన్ని సంస్థలు కూడా తమ కార్యాలయాల్లో శానిటైజర్లు ఏర్పాటు చేయడంతో పాటు సామాజిక దూరం పాటించే చర్యలు చేపట్టాలి. నిన్నటి వరకు వైట్ కాలర్ ఉద్యోగులు ఏసీ లేకుంటే కార్యాలయాల్లో పని చేయని పరిస్థితి. ఇప్పుడు ఏసీలు లేని కార్యాలయాల్లో పని చేయడం లేదా ఖర్చుతో కూడిన ఏసీ గదుల్లో పని చేయాల్సిందే! ఎయిర్ ఫ్లో ద్వారా కరోనా వ్యాప్తి చెందే ప్రమాదం ఉన్న నేపథ్యంలో కార్యాలయాలలో కొన్ని మార్పులు వస్తున్నాయి.

కార్యాలయాలకు టేబుల్ ఫ్యాన్స్
ఇప్పటికే తెరుచుకున్న చాలా కంపెనీల్లో ఏసీలు ఆన్ చేయడం లేదు. అవసరమైతే కిటికీలు తెరుస్తున్నారు. సీలింగ్ ఫ్యాన్స్ వేస్తున్నారు. అవసరమైతే టేబుల్ ఫ్యాన్స్ ఉపయోగిస్తున్నారు. కొంతమంది ఉద్యోగులు టేబుల్ ఫ్యాన్స్ కార్యాలయాలకు తీసుకువెళ్లే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయట. అవసరమైతే ఉద్యోగులు కూడా వీటిని తీసుకు వెళ్తున్నారట.

ఏసీలకు సరికొత్త ఫీచర్స్
ఎయిర్ కండిషన్స్ లేదా ఏసీలు తప్పనిసరిగా కావాల్సిన కార్యాలయాల్లో సరికొత్త భద్రతా ఫీచర్స్ జోడిస్తున్నారు. దీనికి అదనపు ఖర్చు అవుతోంది. కోవిడ్ వ్యాప్తి చెందకుండా ఉండేలా పెద్ద పెద్ద కంపెనీలు టెక్నాలజీని జోడిస్తున్నాయి. మింత్రా, విల్‌పూల్, ఎన్టీపీసీ, పానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్, అల్‌స్టోమ్, వేక్ ఫిట్ డాట్ కామ్ వంటి సంస్థలు ఏసీలు లేకుండా ప్రారంభమయ్యాయి. కొన్ని కంపెనీలు ఏసీలను పరిమితంగా వినియోగిస్తున్నాయి. నెస్ట్లే, మోతీలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆర్పీజీ గ్రూప్ వంటి కంపెనీలు కొత్త సేఫ్టీ ఫీచర్స్‌ను పొందుపరిచాయి.

ఏసీ వద్దు.. ఫ్యాన్ ఉపయోగించి, కిటికీలు తెరిస్తే చాలు
మింత్ర టేబుల్ ఫ్యాన్స్ వినియోగిస్తోంది. బెంగళరు, హైదరాబాద్ వంటి వివిధ నగరాల్లో చాలా వరకు స్టార్టప్స్ ఇదే పద్ధతిని అనుసరిస్తున్నాయి. పానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ వెంటిలేషన్ (కిటికీలు తెరవడం), సీలింగ్ ఫ్యాన్స్, టేబుల్ ఫ్యాన్స్ వినియోగించనుంది. ఎన్టీపీసీ తమ కార్యాలయంలో అన్ని కిటీకీలు, డోర్లు తెరుస్తోంది. ఇది ఎండకాలం కాబట్టి ఉక్కపోత భారీగా పెరిగింది. మొత్తానికి ఏసీలకు నో, ఫ్యాన్స్, కిటికీలు తెరుద్దామని చెబుతున్నారు.

ఉద్యోగుల భద్రత కోసం కంపెనీల చర్యలు
ఉద్యోగుల భద్రత కోసం కంపెనీలు కరోనా వ్యాప్తి చెందకుండా వివిధ చర్యలు తీసుకుంటున్నాయి. శానిటైజర్లు అందుబాటులో ఉంచడం, ఏసీలు ఉపయోగించకుండా ప్రత్యామ్నాయ మార్గాలు లేదా ఏసీలు తప్పనిసరైతే అదనపు ఖర్చుతో సరికొత్త ఫ్యూచర్స్ అనుసంధానం చేస్తున్నారు. భారతీ రియాల్టీ తమ యూనిట్లలో ఫ్రెష్ ఎయిర్ యూనిట్లతో పాటు ప్రత్యేక ఫిల్టర్స్‌ను ఏర్పాటు చేసింది.
More From GoodReturns

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

Bengaluru: ఢిల్లీ వర్సెస్ బెంగళూరు మెట్రో.. ఏది బెస్ట్? సోషల్ మీడియాలో మొదలైన ఆసక్తికర చర్చ!

Bengaluru: టోక్యో, పారిస్‌లను దాటేసిన బెంగళూరు! ఆ విషయంలో ఇదే టాప్!

Bengaluru: మధ్యతరగతి కష్టాలే నా సక్సెస్ సీక్రెట్! వైరల్ అవుతున్న బెంగళూరు యువతి స్టోరీ!

బెంగళూరు vs హైదరాబాద్: దేశపు అసలైన సిలికాన్ వ్యాలీ ఏది? తాజా రిపోర్ట్ ఏం చెబుతోంది?

Bengaluru: బెంగళూరులో ఈ యువతి నెలకు రూ. 25 వేలు దేనికి ఖర్చు చేస్తుందో తెలుసా? వైరల్ అవుతున్న లిస్ట్!

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications