For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

Investment: ప్రముఖ ఇన్వెస్టర్ పెట్టుబడులు పెట్టిన స్టాక్.. బ్రోకరేజ్ లు బుల్లిష్ గా ఉన్నాయ్..

|

Investment: రాకేష్ జున్ జున్ వాలా మరణం తర్వాత చాలా మంది రిటైల్ ఇన్వెస్టర్లు మార్కెట్లోని ఇతర ప్రముఖ పెట్టుబడిదారులను అనుకరిస్తున్నారు. మార్కెట్లపై పట్టుతో పాటు కంపెనీలపై లోతుగా రీసెర్చ్ చేసిన తర్వాతే పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటారని మనందరికీ తెలిసిందే. అందుకే ఇలాంటి వారి పోర్ట్ ఫోలియోల్లో జరిగే మార్పులను చాలా మంది నిశితంగా పరిశీలిస్తుంటారు.

కంపెనీ వివరాలు..

కంపెనీ వివరాలు..

ఇప్పటి వరకు మనం మాట్లాడుకున్నది సుప్రసిద్ధ మనీ మేనేజర్ సౌరభ్ ముఖర్జీ కొనుగోలు చేసిన రిలాక్సో ఫుట్‌వేర్ లిమిటెడ్ స్టాక్ గురించే. అయితే ద్రవ్యోల్బణంతో పెరిగిన ముడి సరుకుల ధరల కారణంగా కంపెనీ రెండవ త్రైమాసిక లాభాలు 67% క్షీణించి రూ.22.4 కోట్లుగా నమోదైంది. ప్రస్తుతం స్టాక్ ధర ఈరోజు ఉదయం 10.14 గంటలకు రూ.939.45గా ఉంది. ఈ స్టాక్ 52 వారాల గరిష్ఠ ధర రూ.1,448 ఉండగా.. 52 వారాల కనిష్ఠ ధర రూ.910గా ఉంది.

ప్రముఖ ఇన్వెస్టర్..

ప్రముఖ ఇన్వెస్టర్..

సుప్రసిద్ధ మనీ మేనేజర్ సౌరభ్ ముఖర్జీ మార్సెల్లస్ ఇన్వెస్ట్‌మెంట్ మేనేజర్స్ వ్యవస్థాపకుడు, చీఫ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆఫీసర్ (CIO). ఇటీవలి కాలంలో ఒక టీవీ ఇంటరాక్షన్‌లో ఆయన మేనేజ్‌మెంట్ బృందం ఫుట్ వేర్ రంగంపై బలంగా ఉంది. ప్రస్తుతం మార్జిన్లు తగ్గటాన్ని తాము నెగటివ్ గా చూడటం లేదని వారు అన్నారు. గత త్రైమాసికంలో రిలాక్సో పనితీరుతో తాము సంతోషిస్తున్నామన్నారు. రిలాక్సో ఫుట్‌వేర్ షేర్లు సెప్టెంబర్ 2009 నుంచి 6,500% మల్టీబ్యాగర్ రాబడులను అందిస్తోంది.

బ్రోకరేజ్ బుల్లిష్..

బ్రోకరేజ్ బుల్లిష్..

రానున్న కాలంలో స్టాక్ మంచి పనితీరును కనబరుస్తుందని ఐసీఐసీఐ సెక్యూరిటీస్ పేర్కొంది. ధరల పెరుగుదల వల్ల మార్జిన్లపై ప్రభావం పడి తీవ్ర ఒత్తిడికి గురిచేయటం వల్ల తైమాసిక ఫలితాలు కొంత తగ్గినట్లు బ్రోకరేజ్ అభిప్రాయపడింది. ప్రస్తుతం షేర్ ధర 52 వారాల కనిష్ఠానికి దగ్గరగా ఉన్నందున రానున్న కాలంలో 50 శాతం వరకు ధర పెరగవచ్చని తెలుస్తోంది. యాక్సిస్ సెక్యూరిటీస్ సైతం బులిష్ గానే ఉంది.

కంపెనీ వ్యాపారం..

కంపెనీ వ్యాపారం..

రిలాక్సో ఫుట్‌వేర్ లిమిటెడ్ భారతదేశంలోని న్యూ ఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న భారతీయ బహుళజాతి పాదరక్షల తయారీదారు. కంపెనీ వాల్యూమ్ పరంగా దేశంలో అతిపెద్ద పాదరక్షల తయారీదారుగా ఉంది. ఆదాయం పరంగా రెండవ అతిపెద్ద కంపెనీగా కొనసాగుతోంది. కంపెనీ ప్రస్తుతం Flite, Sparx, Bahamas, Schoolmate సహా 10 బ్రాండ్‌ల క్రింద ఉత్పత్తులను తయారు చేస్తోంది. ప్రీమియమైజేషన్, వేగంగా అభివృద్ధి చెందుతున్న క్రీడలు అండ్ అథ్లెయిజర్ విభాగంలో వాటాను పెంచడంతో పాటు.. Sparx తయారీ సామర్థ్యాన్ని రోజుకు 50,000 జతలకు పెంచాలని ప్లాన్ చేస్తోంది.

Read more about: investment multibagger
English summary

Investment: ప్రముఖ ఇన్వెస్టర్ పెట్టుబడులు పెట్టిన స్టాక్.. బ్రోకరేజ్ లు బుల్లిష్ గా ఉన్నాయ్.. | famous investor Saurabh Mukherjea adding relaxo footware and brokerages also bullish

famous investor Saurabh Mukherjea adding relaxo footware and brokerages also bullish
Story first published: Saturday, November 5, 2022, 11:02 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X