Indian Economy: గత కొంత కాలంగా విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు భారత మార్కెట్లను వీడుతున్న సంగతి మనం చూస్తూనే ఉన్నాం. భారతీయ ఈక్విటీలు ఖరీదైనవిగా మారాయంటూ వారు చైనా, దక్షిణ కొరియా, తైవాన్ వంటి చవకైన ఉత్తర-ఆసియా మార్కెట్లకు తమ పెట్టుబడులను తరలిస్తున్నారు. అయితే ఇలాంటి సమయంలో ప్రఖ్యాత మార్కెట్ నిపుణుడు మాత్రం భారతదేశంపై బుల్లిష్ దృక్పథాన్ని వ్యక్తం చేస్తున్నాడు.

భారత మార్కెట్..
గత కొంత కాలంగా భారత స్టాక్ మార్కెట్లు ఒడిదొడుకుల్లో కొనసాగుతున్నాయి. అయితే ఇలాంటి సందర్భంలో Mobius క్యాపిటల్ పార్ట్‌నర్స్‌కు చెందిన మార్కెట్ నిపుణుడు మార్క్ మోబియస్ మాత్రం భారత మార్కెట్లపై తన నమ్మకాన్ని కొనసాగిస్తున్నారు. గతంలో మాట్లాడుతూ అదానీ వ్యవహారాన్ని పక్కన పెడితే భారత మార్కెట్లలో తాము పెట్టుబడులను కొనసాగిస్తామని ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే.

దీర్ఘకాలంలో రాబడి..
చాలా మంది విదేశీ ఇన్వెస్టర్లు భారత మార్కెట్ల నుంచి ఇతర చౌక మార్కెట్లకు వెళ్లటం స్వల్పకాలిక చర్యగా భావిస్తున్నట్లు మోబియస్ తెలిపారు. దీర్ఘకాలంలో భారత స్టాక్ మార్కెట్లు మంచి పనితీరును కనబరుస్తాయని తాను గట్టిగా నమ్ముతున్నానని ఆశాభావం వ్యక్తం చేశారు. భారత వృద్ధి రేటు ప్రపంచంలోని చాలా దేశాలకంటే మెరుగైన స్థితిలో ఉందని ఆయన తెలిపారు.

కలిసొచ్చే అంశాలు..
చాలా దేశాలు తమ కంపెనీ ఉత్పత్తిని చైనా నుంచి భారత్ కు తరలిస్తున్నందున దీర్ఘకాలంలో ఇండియా మంచి మార్కెట్ గా మారుతుందని మోబియస్ తెలిపారు. దీనిలో భాగంగా సాఫ్ట్ వేర్, తయారీ రంగాలకు మారుతున్న టెక్నాలజీ అతిపెద్ద మద్ధతును అందిస్తుందని మోబియస్ వెల్లడించారు. ఇతర మార్కెట్లతో పోల్చితే భారత ఈక్విటీలో ఎక్కువ సంపాదించటానికి మంచి అవకాశంగా తాను భావిస్తున్నానని ఆయన వెల్లడించారు.

టార్గెట్ రంగాలు ఇవే..
ప్రఖ్యాత ఇన్వెస్టర్ మోబియస్ ప్రధానంగా సాఫ్ట్ వేర్, హెల్త్ కేర్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాలపై తన దృష్టి ఉందని తెలిపారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ కంపెనీలకు పైపులు, టర్బైన్‌ల వంటి భాగాలను సరఫరా చేసే కంపెనీల్లో బలమైన రాబడులు పొందేందుకు అవకాశం ఉందని అన్నారు. భారతదేశంలో ఆరోగ్యం పట్ల ప్రజలకు ఆసక్తి పెరుగుతున్నందున మెడికల్ టెస్టింగ్ స్టాక్‌లు బాగా పెరిగే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications