Investment: రెండు లక్షల షేర్లు కొన్న ప్రముఖ ఇన్వెస్టర్.. పరుగులు తీస్తున్న కంపెనీ స్టాక్..

Investment: దిల్లీకి చెందిన ప్రముఖ స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ ఆశిష్ చుగ్ రాజ్ తాజాగా ఒక కంపెనీలో షేర్లను కొనుగోలు చేశారు. ఆయన బల్క్ డీల్ రూపంలో కపిల్ రాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ కంపెనీకి చెందిన 2,00,000 షేర్లను కొనుగోలు చేశారు. దీంతో ఈ స్టాక్ 5 శాతం అప్పర్ సర్క్యూట్ తాకింది. ఆయన ఒక్కో షేరును రూ.12 రేటుకు కొనుగోలు చేశారు. అయితే ఈ డీల్ వివరాలు బయటకు రావటంతో స్టాక్ ప్రస్తుతం రూ.13.67 వద్ద లాక్ అయ్యింది.

ఆశిష్ చుగ్ ఎవరు..?
ఆశిష్ చుగ్ ఒక ఇండిపెండెంట్ ఇన్వెస్టర్. మార్కెట్లో పెట్టుబడుల నుంచి లాభాలు ఆర్జించడంలో పేరుగాంచిన ఆయన ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్‌లో పట్టా పొందిన తర్వాత 2000లో పెట్టుబడిదారుగా తన వృత్తిని ప్రారంభించారు. దీనికి ముందు ఆయన ఎంబీఏ పూర్తయ్యాక కుటుంబ వ్యాపారంలో చేరారు. కొన్నాళ్లకు దానిని వదలిపెట్టి స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్ గా మారి విజయవంతం అయ్యారు.

Famous investor Ashish Chug bougt 200000 shares Of Kapil raj Finance know details

కంపెనీ వ్యాపారం..
కపిల్ రాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ 1985లో స్థాపించబడిన సంస్థ. ఇది ఫైనాన్షియల్ సర్వీసెస్ రంగంలో వ్యాపారాన్ని నిర్వహిస్తున్న స్మాల్ క్యాప్ కంపెనీ. గత ఐదు ట్రేడింగ్ సెషన్లలో 10.06 లాభపడింది. ఈ ఏడాది స్టాక్ ఇప్పటి వరకు 15.55 శాతం పెరిగి ఇన్వెస్టర్లకు రాబడిని అందించింది. ప్రముఖ ఇన్వెస్టర్ పెట్టుబడులు పెట్టడంతో స్టాక్ రానున్న కాలంలో మరింతగా లాభపడవచ్చని తెలుస్తోంది.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+