ధూమ్ సినిమాలో తన యాక్టింగ్ తో వావ్ అనిపించుకున్న బిగ్ బి కొడుకు అభిషేక్ బచ్చన్ మిస్ ఇండియా ఐశ్వర్య రాయ్ ని పెళ్లి చేసుకున్న సంగతి మీకు తెలిసే ఉంటుంది. వీరికి ఆరాధ్య అనే ఒక పాపా కూడా ఉంది. అయితే అభిషేక్ బచ్చన్ సినిమాల గురించి తక్కువ చర్చలు జరుగుతున్నప్పటికీ, అతని సంపాదన గురించి వార్తలు వస్తూనే ఉంటాయి. అభిషేక్ బచ్చన్ సినిమాలే కాకుండా చాలా పెట్టుబడులు, వ్యాపారాలు కూడా చేస్తుంటాడు, వీటి ద్వారా అతనికి ప్రతి సంవత్సరం మంచి మొత్తం వస్తుంది. దేశంలోని అతిపెద్ద బ్యాంకు ఎస్‌బీఐ కూడా అతనికి ప్రతి నెలా దాదాపు రూ.19 లక్షలు చెల్లిస్తుంది. SBI ఏ స్కీమ్‌లో అభిషేక్ బచ్చన్ పెట్టుబడి పెట్టాడు అని అనుకుంటున్నారా... అదేం లేదు అభిషేక్ ఈ మొత్తం తీసుకువడానికి అతనికి బ్యాంక్‌తో ఒక కనెక్షన్ ఉంది.
15 సంవత్సరాల డీల్
ఒక నివేదిక ప్రకారం, అభిషేక్ బచ్చన్ ముంబైలోని జుహు ప్రాంతంలో ఉన్న తన లగ్జరీ బంగ్లా అమ్ము అండ్ వత్స గ్రౌండ్ ఫ్లోర్‌ను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI)కి రెంటుకు ఇచ్చాడు. బచ్చన్ ఫ్యామిలీ అండ్ బ్యాంక్ మధ్య ఈ లీజు అగ్రిమెంట్ పై 28 సెప్టెంబర్ 2021న సంతకం జరిగింది. ఈ అగ్రిమెంట్ కాలం 15 సంవత్సరాలు. ఒప్పందం ప్రకారం, అభిషేక్ బచ్చన్‌కు ఎస్‌బిఐ ప్రతి నెలా రూ.18.9 లక్షలు చెల్లిస్తుంది.

రెంటు పెరుగుతూనే ఉంటుంది
అయితే, అభిషేక్ బచ్చన్ మొత్తం 15 సంవత్సరాలకు SBI నుండి కేవలం 18.9 లక్షలు మాత్రమే అద్దెగా తీసుకుంటారు అని అనుకుంటున్నారా.. కాదు కాదు, ఎప్పటికప్పుడు ఛార్జీలను పెంచాలనే నిబంధన కూడా ఒప్పందంలో ఉంది. 5 ఏళ్ల తర్వాత ఈ అద్దె రూ. 23.6 లక్షలకు, 10 ఏళ్ల తర్వాత రూ. 29.5 లక్షలకు పెరుగుతుంది. ఈ డీల్‌కు సంబంధించి ఎస్‌బీఐ ఇప్పటికే రూ.2.26 కోట్లను
అడ్వాన్స్ డిపాజిట్ గా కట్టింది.
రియల్ ఎస్టేట్‌లో భారీ పెట్టుబడి
ఎస్‌బీఐ లీజుకు తీసుకున్న బచ్చన్ కుటుంబానికి చెందిన ఆస్తి 3,150 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉందని ఒక నివేదికలో పేర్కొంది. అభిషేక్ బచ్చన్ మొత్తం సంపద విలువ గురించి చెప్పాలంటే దాదాపు 280 కోట్లుగా అంచనా. రియల్ ఎస్టేట్‌లో భారీగా పెట్టుబడులు పెడుతుంటాడు. అభిషేక్‌కు స్కైలార్క్ టవర్‌లో 5BHK అపార్ట్‌మెంట్ ఉంది, దీని విలువ రూ.41.14 కోట్లు. కొంతకాలం క్రితం బోరివలిలో రూ.15 కోట్ల విలువైన ఆస్తిని కూడా కొనుగోలు చేశాడు. అతను దుబాయ్‌లోని కాస్ట్లీ నగరమైన జుమేరియా ప్రాంతంలో ఒక ప్రాపర్టీ కూడా కట్టాడు.
ఎస్‌బీఐ అలెర్ట్
మరోవైపు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమర్లను హెచ్చరించింది. రివార్డ్ పాయింట్లను రీడీమ్ చేసుకోమంటూ సైబర్ కేటుగాళ్లు ప్రజలను ట్రాప్ చేయవచ్చని ఎస్‌బీఐ సోషల్ మీడియా పోస్ట్‌లో పేర్కొంది. ఇలాంటి మెసేజ్‌లలో .apk అనే ఫైల్‌ని డౌన్‌లోడ్ చేయమని కోరుతుంది, నిజానికి ఎస్బిఐ బ్యాంక్ ఎప్పుడూ అలా చేయమని అడగదు. కాబట్టి వాట్సాప్, SMS లేదా మరే ఇతర మాధ్యమం ద్వారా వచ్చిన అటువంటి లింక్‌లపై ఎప్పుడూ క్లిక్ చేయండి అని కోరింది.
More From GoodReturns

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

విజయవాడ నుంచి హైదరాబాద్‌కు గంటే ప్రయాణం.. 220 కి.మీ స్పీడ్‌తో కొత్త రైలు.. వందే భారత్ కన్నా ఫాస్ట్..

Gold price: 2013 తర్వాత అతిపెద్ద పతనం ఇదే! బంగారం కొనేందుకు ఇదే సరైన సమయమా?

Today Gold Silver Rate Live: బంగారం ధరల్లో తీవ్ర మార్పులు..కొంపలు ముంచుతున్న పశ్చిమాసియా యుద్ధం

టీసీఎస్ క్యూ4 ఫలితాలు: ఇన్వెస్టర్లకు భారీ లాభాల పండుగ?

బంగారం ధరలపై యూబీఎస్ సంచలన నివేదిక.. పసిడి ధరలు కుప్పకూలుతాయనే భయంతో కేంద్ర బ్యాంకులు..

కుప్పకూలిన బంగారం ధరలు.. భారీ తగ్గుదలతో ఈ రోజు పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 9, గురువారం ధరలు ఇవే..

టీసీఎస్ క్యూ4 ఫలితాలు.. ప్రకటనకు ముందే స్టాక్ మార్కెట్లో దుమ్మురేపిన టెక్ దిగ్గజం..

అంబేద్కర్ జయంతి సెలవు: మీ బ్యాంక్ పనుల పరిస్థితి ఏంటి?

బంగారం, వెండి ధరలు ఈ రేటుకు దిగి వస్తేనే కొనండి.. కీలక సూచన చేస్తున్న బులియన్ నిపుణులు

TCS Q4 ఫలితాలు: ఇన్వెస్టర్ల అంచనాలను అందుకుంటుందా?



Click it and Unblock the Notifications