Income Tax: పన్నుల విషయంలో మోడీ సర్కారు ఓ భారీ ముందడుగు వేసినట్లు చెప్పుకోవాల్సిందే. గతంలో ఉన్న వివిధ ఉన్న పన్నులను తీసివేసి వాటి స్థానంలో ఒకే పన్నుగా GSTని ప్రవేశపెట్టింది. ఆదాయపు పన్ను విషయంలోనూ గతంలో ఉన్న శ్లాబులను తగ్గిస్తూ, ఈ ఏడాది కొన్ని సంచలన నిర్ణయాలను సైతం తీసుకుంది. అయితే ఇప్పటికీ పర్సనల్ ట్యాక్స్ పై విమర్శలు వస్తున్నాయి.
భారతదేశం ప్రపంచంలో అత్యంత ధనిక దేశం కాకపోయినప్పటికీ ఇక్కడ పన్నుల వసూళ్లు అత్యధికంగా ఉన్నాయని ప్రఖ్యాత ఆర్థికవేత్త సుర్జిత్ భల్లా అభిప్రాయపడ్డారు. ప్రస్తుతమున్న ఆదాయపు పన్ను రేటును 40 నుంచి 25 శాతానికి తగ్గించాల్సిన అవసరం ఉందన్నారు. దేశ ఆర్థిక వృద్ధిని వేగవంతం చేయడానికి ట్యాక్స్ తగ్గింపు మంచి మార్గమని సూచించారు.

కేంద్రం, రాష్ట్రాలతో పాటు స్థానిక సంస్థల వారీగా చూస్తే పన్నుల వసూళ్లు దేశ GDPలో దాదాపు 19 శాతం ఉన్నట్లు భల్లా చెప్పారు. "మనం దీనిని 2 శాతం తగ్గించే దిశగా ప్రయత్నం చేయాలి. ప్రత్యక్ష పన్నుల విషయానికొస్తే మొత్తం ట్యాక్స్ రేటు 25 శాతం కంటే ఎక్కువ ఉండకూడదని నేను భావిస్తున్నాను. సర్ ఛార్జ్‌లు మొదలైన వాటితో కలిపి ప్రస్తుతం ఇది 40 శాతానికి దగ్గరగా ఉంది. కార్పొరేట్ పన్ను మాదిరిగానే ఆదాయపు పన్ను రేటు కూడా ఉండాలి" అన్నారు.
కేవలం ఏ ఒక్క వర్గానికే కాకుండా సమాజంలోని అందరిపై పన్నులు తగ్గించాల్సిన అవసరం ఉందని భల్లా అభిప్రాయపడ్డారు. పన్ను ఎగవేతలను తగ్గించేందుకు ట్యాక్సేషన్ విధానాన్ని మరింత క్రమబద్ధీకరించాలని సూచించారు. అయితే 2023-24 బడ్జెట్ లో హై నెట్ వర్త్ ఇండివిడ్యువల్స్ పై విధించే సర్ ఛార్జ్ లో కోత విధించడం ద్వారా అత్యధిక ఆదాయ ట్యాక్స్ రేటు 42.74 శాతం నుంచి తగ్గించబడింది. ఫలితంగా ప్రస్తుతం ఇండియాలో అత్యధిక ఆదాయపు పన్ను రేటు 39 శాతంగా ఉంది.
మార్చి 2023తో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ స్థూల ప్రత్యక్ష పన్ను వసూళ్లు 20 శాతానికి పైగా పెరిగి 19.68 లక్షల కోట్లకు చేరాయి. ఇందులో స్థూల కార్పొరేట్ పన్ను వసూళ్లు 16.91 శాతం వృద్ధితో 10.04 లక్షల కోట్లకు పైగా ఉన్నాయి. ఇక వ్యక్తిగత ఐటీ సేకరణ 24.23 శాతం పెరిగి 9.60 లక్షల కోట్లకు చేరుకుంది.
More From GoodReturns

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications