Crypto News: చాలా కాలం తర్వాత క్రిప్టో ఇన్వెస్టర్లు సంతోషంలో మునిగి తేలుసుతున్నారు. ఏడాది కింద దాదాపు 60,000 డాలర్ల మార్కును దాటి రికార్డు స్థాయిలకు బిట్ కాయిన్ చేరుకున్న తర్వాత క్షీణించింది.
తాజాగా మళ్లీ బిట్‌కాయిన్ తన ర్యాలీని మెుదలు పెట్టడంతో ఇన్వెస్టర్లలో కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. వడ్డీ-రేటు తగ్గింపుల అంచనాలు, ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్స్ నుంచి పెరిగిన డిమాండ్ ఉన్నప్పటికీ.. బిట్‌కాయిన్ మే 2022 తర్వాత మొదటిసారిగా 40,000 డాలర్ల మార్కును అధిగమించింది. సోమవారం తెల్లవారుజామున టోకెన్ సింగపూర్‌లో 40,005 డాలర్ల వద్ద ట్రేడవుతోంది. మెుత్తం మీద 2023లో 142 శాతం జంప్‌ను నమోదు చేసింది.

ద్రవ్యోల్బణం క్రమంగా చల్లారటం, ఫెడరల్ రిజర్వ్ రేట్లను పెంచడం పూర్తైందని ఇన్వెస్టర్లు ఎక్కువగా నమ్ముతున్నారు. రానున్న కొత్త సంవత్సరంలో వడ్డీ రేట్ల తగ్గింపులపై సెంట్రల్ బ్యాంక్ దృష్టి సారిస్తుందని ఆశాజనకమైన వార్తల నడుమ ప్రపంచవ్యాప్తంగా మార్కెట్లు పుంజుకున్నాయి. దీనికి తోడు అమెరికాలో మొదటి బిట్‌కాయిన్ ఎక్స్ఛేంజ్-ట్రేడెడ్ ఫండ్‌ను ప్రారంభించడానికి ప్రముఖ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ BlackRock అప్లై చేసింది. వచ్చే ఏడాది అనుమతలు వస్తాయని వారు భావిస్తున్నారు.
2024లో వడ్డీ రేట్ల తగ్గింపులపై ఆశాభావంగా ఇన్వెస్టర్లు ఉన్నందున బిట్‌కాయిన్ కు మద్దతు లభిస్తుందని మార్కెట్ విశ్లేషకుడు టోనీ సైకామోర్ వెల్లడించారు. 2022 క్రిప్టో క్రాష్ తర్వాత బిట్‌కాయిన్ అమెరికా నుంచి అణిచివేతను ఎదుర్కొంది. FTXలో మోసానికి సామ్ బ్యాంక్‌మ్యాన్-ఫ్రైడ్‌ను జైలుకు పంపింది. అలాగే మరో ఎక్స్ఛేంజీ అయిన బినాన్స్ వ్యవస్థాపకుడు చాంగ్‌పెంగ్ జావోకు జరిమానా విధించింది. ఇదే సమయంలో చాలా మంది నష్టాల పాలు కావటంతో భారత ప్రభుత్వం సైతం క్రిప్టోలపై తన కఠిన వైఖరిని టైట్ చేసింది. పన్ను రేట్లను పెంచేసిన సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications