Toyota: ప్రపంచవ్యాప్తంగా కార్ల తయారీ కంపెనీలు పలుమార్లు తమ వెహికల్స్ రీకాల్ చేస్తుంటాయి. రక్షణ పరమైన లేదా పనితీరుకు సంబంధించి ఏదైనా లోపాలను గుర్తిస్తే ఇలాంటి చర్యలకు దిగుతుంటాయి.
ప్రఖ్యాత కార్ల తయారీ సంస్థ టొయోటా స్వచ్ఛందంగా 2022, 2023 నుంచి సుమారు 1,68,000 టండ్రా, టండ్రా హైబ్రిడ్ ట్రక్కులను రీకాల్ చేసింది. ప్రధానంగా ఇంధన లీకేజీల ప్రమాదం కారణంగా మంటలు సంభవించవచ్చని గుర్తించిన నేపథ్యంలో లోపాలను సరిచేసేందుకు ఈ చర్యలు చేపట్టింది. ప్రయాణికుల భద్రత ముఖ్యమని కంపెనీ భావిస్తోంది.

అయితే టొయోటా ఇంత భారీ సంఖ్యలో రీకాల్ చేయటం ఈ సంవత్సరంలో అతిపెద్దదిగా తెలుస్తోంది. టండ్రా మోడల్‌లను కలిగి ఉన్న ఏడవ రీకాల్‌గా గుర్తించబడింది. బ్రేక్ లైన్‌కు వ్యతిరేకంగా రుద్దగలిగే ప్లాస్టిక్ ఇంధన ట్యూబ్ నుంచి సమస్య ఉత్పన్నమవుతోంది. ఇది ఇంధన లీక్‌కు దారితీయవచ్చని కంపెనీ గుర్తించింది. మంటలు చెలరేగే ప్రమాదాన్ని కలిగి ఉన్నందున ముందస్తు చర్యగా దీనిని సరిదిద్దేందుకు కంపెనీ చర్యలు చేపట్టింది.
టొయోటా లోపభూయిష్ట ఇంధన ట్యూబ్‌ను ఎలాంటి అదనపు ఖర్చులు లేకుండా రీప్లేస్ చేయనున్నట్లు ప్రకటించింది. రీప్లేస్‌మెంట్ పార్టులు అందుబాటులోకి వచ్చే వరకు, టయోటా డీలర్‌లు వినియోగదారులకు ఎటువంటి ఖర్చు లేకుండా రక్షిత సామగ్రిని, ఇంధన ట్యూబ్‌పై బిగింపును ఏర్పాటు చేస్తారని కంపెనీ వెల్లడించింది. ప్రభావిత వాహన యజమానులకు అక్టోబర్ ప్రారంభంలో విషయం తెలియజేయబడుతుందని కంపెనీ వెల్లడించింది. దీనికి ముందు ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ సిస్టమ్, లూజ్ యాక్సిల్ నట్స్, రియర్ వ్యూ కెమెరా సాఫ్ట్ వేర్ ఇబ్బందుల దృష్యా గతంలోనూ రీకాల్ చేసింది.


Click it and Unblock the Notifications