బ్యాంకు వడ్డీరేట్లు పడిపోతున్నాయని.. అవగాహన లేకుండా షేర్లు కొనవద్దు!
బ్యాంకుల్లో ఫిక్స్డ్ డిపాజిట్ వడ్డీ రేట్లు పడిపోవడం క్యాపిటల్ మార్కెట్లో రిటైల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టేందుకు కారణం కావొద్దని సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI) సభ్యులు జీ మహాలింగమ్ అన్నారు. కరోనా మహమ్మారి సంక్షోభం నేపథ్యంలో పెట్టుబడి వ్యూహాలను జాగ్రత్తగా క్రమబద్దీకరించుకోవాలని ఆయన సూచించారు. ఇటీవల లాక్ డౌన్ సమయంలో రిటైల్ ఇన్వెస్టర్లు భారీగా పెరిగిన విషయం తెలిసిందే.

దురాశకు పోవద్దని హెచ్చరిక
రిటైల్ ఇన్వెస్టర్లు ప్రయోజనాల కోసం మార్కెట్లను సురక్షితం, భద్రంగా మార్చేందుకు సెబి నిరంతరం పని చేస్తోందని మహాలింగమ్ తెలిపారు. ఎంసీసీఐ నిర్వహించిన ఓ కార్యక్రమంలో వెబినార్ ద్వారా మాట్లాడారు. బ్యాంకు డిపాజిట్ రేట్లు తగ్గుతున్న తరుణంలో చిన్న ఇన్వెస్టర్లు జాగ్రత్తగా వ్యూహాలు రచించుకోవాలని తెలిపారు. పెట్టిన పెట్టుబడులకు సహేతుక రాబడినే ఆశించాలని దురాశకు పోకూడదని హెచ్చరించారు.

మ్యూచువల్ ఫండ్స్..
మ్యూచువల్ ఫండ్స్ నుంచి ఇలాగే ఆశించాలని మహాలింగం అన్నారు. దీర్ఘకాల పెట్టుబడులకు మార్కెట్లను సురక్షితంగా మార్చేందుకు కృషి చేస్తున్నట్లు తెలిపారు. కార్పోరేట్ బాండ్ మార్కెట్ అభివృద్ధి చెందాలంటే రిటైల్, ఇనిస్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు పెట్టుబడులు పెట్టాలని తాను కోరుకుంటున్నట్లు చెప్పారు.

పెరిగిన రిటైల్ ఇన్వెస్టర్లు
గత కొంతకాలంగా రిటైల్ ఇన్వెస్టర్లు పెద్ద ఎత్తున పెరిగారు. తెలుగు రాష్ట్రాల్లోను ఎక్కువగానే పెరిగారు. కరోనా సమయంలో కేపిటల్ మార్కెట్ బూస్ట్ కోసం వివిధ రకాల చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇలాంటి ట్రబుల్ సమయంలో ఇన్వెస్టర్లు ఆచితూచి వ్యవహరిస్తూ ఇన్వెస్ట్ చేయాలన్నారు. అయితే బ్యాంకుల వడ్డీ రేట్లు పెరుగుతున్నాయని అవగాహన లేకుండా షేర్లు కొనవద్దన్నారు.


Click it and Unblock the Notifications