డిజిటల్ విప్లవం పెరిగిన తర్వాత ప్రతిదీ ఆన్‌లైన్‌లోకి మారిపోయింది. చివరికి ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే వచ్చే చలాన్లు కూడా మన ఫోన్‌కే వస్తున్నాయి. అయితే ఇదే ఇప్పుడు సైబర్ నేరగాళ్లకు ఒక ఆయుధంగా మారింది. హైదరాబాద్, పూణే వంటి నగరాల్లో వాహనదారుల భయాన్ని ఆసరాగా చేసుకుని 'నకిలీ RTO ఇ-చలాన్' స్కామ్ వేగంగా విస్తరిస్తోంది. చలాన్ కట్టకపోతే చట్టపరమైన చర్యలు తప్పవంటూ బెదిరిస్తూ పంపే ఈ మెసేజ్.. ఓపెన్ చేస్తే.. మీ బ్యాంక్ ఖాతాను ఖాళీ అవ్వొచ్చు. ఈ స్కామ్ నుంచి ఎలా బయటపడాలంటే..
ఈ స్కామ్ ఎలా జరుగుతుంది?
నేరగాళ్లు ప్రభుత్వ అధికారిక చలాన్ నోటీసును పోలిన మెసేజ్‌ను మీ మొబైల్‌కు పంపిస్తారు. అందులో మీరు సిగ్నల్ జంప్ చేశారని లేదా ఓవర్ స్పీడ్‌తో వెళ్లారని, వెంటనే చలాన్ కట్టాలని రాసి ఉంటుంది. ఆ మెసేజ్‌తో పాటు ఒక లింక్ లేదా 'APK' ఫైల్‌ను జత చేస్తారు. "త్వరగా కట్టకపోతే భారీ జరిమానా పడుతుంది" అని భయపెట్టడం వల్ల జనం కంగారులో ఆ లింక్‌ను క్లిక్ చేస్తారు. చలాన్ వివరాల కోసం ఆ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేయగానే.. మీ ఫోన్ రిమోట్ కంట్రోల్ సైబర్ నేరగాళ్ల చేతికి వెళ్లిపోతుంది.

APK ఫైల్ ఇన్‌స్టాల్ చేయొద్దు!
సైబర్ పోలీసుల దర్యాప్తులో తేలిందేమిటంటే.. నిందితులు వాట్సాప్‌లో 'RTO Traffic Challan' పేరుతో మాల్వేర్ ఫైళ్లను పంపిస్తున్నారు. మీరు ఆ ఫైల్‌ను ఇన్‌స్టాల్ చేయగానే, మీ ఫోన్‌లోని కాంటాక్ట్స్, మెసేజ్‌లు, బ్యాంక్ యాప్స్, మీ గ్యాలరీ సమాచారం హ్యాకర్లకు చేరుతుంది. నేరగాళ్లు మీ బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు విత్ డ్రా చేసినప్పుడు వచ్చే OTPని మీకే తెలియకుండా వారు చదువుతారు. ఫలితంగా నిమిషాల్లో లక్షల రూపాయలు మాయమవుతాయి.
వారాంతాల్లోనే దాడులు ఎందుకు?
సైబర్ నేరగాళ్లు చాలా తెలివైనవారు. వారు తరచుగా శుక్రవారం సాయంత్రం లేదా బ్యాంకులకు సెలవు ఉన్న రోజుల్లోనే ఇలాంటి మెసేజ్‌లు పంపిస్తారు. ఎందుకంటే ఆ సమయంలో బ్యాంక్ హెల్ప్‌లైన్ లేదా పోలీసుల నుండి తక్షణ సహాయం పొందడం కష్టమవుతుందని వారి ప్లాన్. పూణేలో ఒక వ్యక్తికి రూ. 5 లక్షలు, చించ్వాడ్‌లో మరో వ్యక్తికి రూ. 2.49 లక్షలు ఇలాగే మాయమయ్యాయి.
జాగ్రత్తలు ఇలా..
మీరు వాహనదారులైతే కచ్చితంగా ఈ కింది జాగ్రత్తలు తీసుకోవాలి..
- అధికారిక వెబ్‌సైట్ మాత్రమే: ప్రభుత్వం ఎప్పుడూ వాట్సాప్‌లో .APK ఫైళ్లను పంపదు. మీ చలాన్ స్థితిని తెలుసుకోవడానికి అధికారిక 'పరివాహన్' (Parivahan) వెబ్‌సైట్ లేదా మీ రాష్ట్ర ట్రాఫిక్ పోలీస్ అధికారిక యాప్‌ను మాత్రమే వాడండి.
- అపరిచిత లింకులు: తెలియని నంబర్ల నుండి వచ్చే లింకులను అస్సలు క్లిక్ చేయకండి. ముఖ్యంగా ఫైల్ డౌన్‌లోడ్ చేయమని కోరితే వెంటనే జాగ్రత్త పడండి.
- వెంటనే ఇంటర్నెట్ ఆపండి: ఒకవేళ పొరపాటున ఏదైనా అనుమానాస్పద యాప్ డౌన్‌లోడ్ అయితే వెంటనే ఇంటర్నెట్ ఆపివేసి, ఆ యాప్‌ను డిలీట్ చేయండి. అవసరమైతే మీ ఫోన్‌ను ఫ్యాక్టరీ రీసెట్ చేయడం ఉత్తమం.
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా ఉండాలంటే అవగాహనే శ్రీరామరక్ష. మీకు ఇలాంటి మెసేజ్ వస్తే వెంటనే 1930 హెల్ప్‌లైన్ నంబర్‌కు లేదా సైబర్ క్రైమ్ వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయండి. మీరు ఎంత అప్రమత్తంగా ఉంటే అంత సేఫ్ గా ఉంటారు.
More From GoodReturns

విజయవాడ - హైదరాబాద్ హైవే అప్డేట్.. పనులు ఎక్కడి దాకా వచ్చాయంటే..

Hyderabad: సిటీలో అతిపెద్ద డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్.. ఇక ఆ రూట్లో ట్రాఫిక్ కష్టాలుండవ్!

హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ కొరత.. క్లారిటీ ఇచ్చిన పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్..

Hyderabad: హైదరాబాద్‌లో పెట్రోల్ కష్టాలు.. బంకుల దగ్గర భారీ క్యూలు.. అసలు కారణం ఇదే!

రాజమండ్రి-హైదరాబాద్ విమాన ప్రయాణం..మరో 3 కొత్త సర్వీసులు అందుబాటులోకి..

బంగారంతో కొత్త గేమ్ మొదలుపెట్టిన రష్యా.. ఇరాన్ యుద్ధం వేళ భారీగా డబ్బులు పోగేసుకోవడానికి..

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?



Click it and Unblock the Notifications