మీరు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ లేదా ED పేరు వినే ఉంటారు..దేశంలో ఎక్కడ నల్లధనం ఉన్నా రైడ్ చేసి నేరస్తులను పట్టుకునే ఓ పవర్ పుల్ వ్యవస్థ.. అయితే తాజాగా భారతదేశంలో నేరస్థులు, రాజకీయ నాయకులు నల్లధనాన్ని తెల్లధనంగా ఎలా మారుస్తున్నారనే అంశంపై మాజీ ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టర్ (ED) కర్నాల్ సింగ్ కీలక వివరాలను వెల్లడించారు. సక్సెస్ అయిన వ్యాపారాల వెనక, రాజకీయ నేతల కోణంలోనూ, కుంభకోణాల బాటలోనూ నల్లధనం వైట్ మనీగా ఎలా జరుగుతుందో రాజ్ షమానీతో జరిగిన పాడ్‌కాస్ట్‌లో కర్నాల్ సింగ్ వివరించారు.
ఈ ఇంటర్యూలో జైలుకు వెళ్లిన తర్వాత కూడా కొంతమంది నేరస్తులు మంత్రులుగా ఎలా మారుతారో కూడా ఆయన క్లుప్తంగా వివరించారు. నల్లధనం అంటే ఆదాయపు పన్ను శాఖ ముందు ప్రకటించని డబ్బు. ప్రభుత్వానికి ఆ డబ్బు గురించి ఎటువంటి సమాచారం ఉండదు. నేరస్తులు ఈ నల్లధనాన్ని తెల్లగా మార్చడానికి అత్యంత సాధారణ మార్గం బ్యాంకింగ్ రంగం అని అన్నారు.
ఆయన మాట్లాడుతూ...ఒక వ్యక్తి దగ్గర నేరం ద్వారా సంపాదించిన డబ్బు (నల్లధనం) ఉందనుకుందాం. వారు బ్యాంకు నుండి రుణం తీసుకొని.. వ్యాపారాన్ని ప్రారంభించి..నకిలీ బిల్లుల ద్వారా ఈ నల్లధనాన్ని అందులో పెడతారు. వ్యాపారం సరిగా నడవకపోయినా..వారు మాత్రం కోట్లు సంపాదిస్తున్నట్లు చూపిస్తారు. ఈ విధంగా డబ్బు చట్టబద్ధంగా కనిపించడం ప్రారంభమవుతుందని ఆయన అన్నారు.

సాధారణంగా వారు తామ అక్రమంగా సంపాదించిన డబ్బును దాచడానికి బ్యాంకులను ఉపయోగిస్తారు. వీరు రియల్ ఎస్టేట్‌లో డబ్బును పెట్టుబడి పెట్టడం లేదా హవాలా ద్వారా విదేశాలకు పంపడం జరుగుతుందని సింగ్ వివరించారు. హవాలా అనేది బ్యాంకు లేకుండా డబ్బును బదిలీ చేసే పద్ధతి. దీంతో పాటు మనీలాండరింగ్ వాణిజ్యం ద్వారా కూడా జరుగుతుంది. ఇందులో వస్తువుల ధరను ఓవర్-ఇన్వాయిస్ లేదా అండర్-ఇన్వాయిస్‌గా చూపిస్తారు. తద్వారా డబ్బు దేశం నుండి బయటకు వెళుతుంది. ఇంక కొందరు బినామీ ఆస్తులను కొనుగోలు చేస్తారు లేదా వేరొకరి పేరుతో కంపెనీలను తెరుస్తారు.ఇది కూడా నల్లధనం వైట్ మనీగా మార్చే ప్రక్రియ అని చెప్పుకొచ్చారు.
అవినీతి సొమ్మును తెల్లగా మార్చేందుకు 300-400 షెల్ కంపెనీల నెట్‌వర్క్‌ను నడిపిన మహారాష్ట్ర రాజకీయ నాయకుడి ఉదాహరణను ఆయన ప్రస్తావించారు.షెల్ కంపెనీలు అంటే కాగితంపై మాత్రమే ఉండి.. నిజమైన వ్యాపారం లేని కంపెనీలు అని అర్థం. ఓ రాజకీయ నాయకుడు ఈ షెల్ కంపెనీలకు రూ. 45 వేలు వాయిదాలలో డబ్బు పంపేవారు.
రూ. 50 వేలు కంటే ఎక్కువ లావాదేవీలు ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ (FIU)కి నివేదించబడతాయి కాబట్టి ఆ మొత్తం రూ. 50 వేలు కంటే తక్కువగా ఉండేలా చూసుకునేవాడని సింగ్ అన్నారు. FIU అనేది ఆర్థిక నేరాలను పర్యవేక్షించే ప్రభుత్వ సంస్థ. ఆ డబ్బును అనేక బ్యాంకు ఖాతాల ద్వారా మళ్లించి, ఆపై అదే రాజకీయ నాయకుడి కంపెనీలో తిరిగి వారు పెట్టుబడి పెట్టారని ఆయన అన్నారు. అతను రూ. 10 విలువైన షేర్లను రూ. 25 వేలుకి అమ్మి.. తర్వాత వాటిని రూ. 2కి తిరిగి కొనుగోలు చేసేవాడు. దీంతో నల్లడబ్బు తెల్లడబ్బుగా తిరిగి వస్తుంది. షేర్లు కూడా అలాగే ఉంటాయని తెలిపారు.
మాజీ ఐపీఎస్ అధికారి కర్నాల్ సింగ్ 2015 నుండి 2018 వరకు ED చీఫ్‌గా పనిచేశారు. అన్ని షెల్ కంపెనీలు చట్టవిరుద్ధం కాదని కూడా సింగ్ అన్నారు. భవిష్యత్తులో మీరు ప్రారంభించే వ్యాపారం కోసం ప్రారంభ ఖర్చులను నిర్వహించడానికి మీరు షెల్ కంపెనీని తెరవవచ్చు. కానీ నిజమైన పని జరగనప్పుడు.. డబ్బు లావాదేవీలు మాత్రమే జరుగుతున్నప్పుడు అనుమానం తలెత్తుతుంది. వీరిలో కొందరు పట్టుబడి జైలుకు వెళ్లారు.అయితే వారు ఆ తర్వాత బయటకు వచ్చి మంత్రులు కూడా అయ్యారని సింగ్ తెలిపారు.
1999లో రాజన్ తివారీ అనే కాంట్రాక్ట్ కిల్లర్.. బీహార్ మంత్రిని ఆసుపత్రిలో హత్య చేసిన కేసును సింగ్ గుర్తు చేసుకున్నారు. ఆ సమయంలో నేను క్రైమ్ బ్రాంచ్‌లో ఉన్నాను. మేము అతన్ని పట్టుకున్నాము. సంవత్సరాల తరువాత 2017లో నేను కోర్టులో సాక్ష్యం చెబుతుండగా అతను నా వెనుక కూర్చుని ఉండటం చూశాను. అతను, 'సర్, మీరు నన్ను ఇరికించారు' అని అన్నాడు. ఆ వ్యక్తి అప్పుడు మంత్రి అయ్యాడు.సమస్య ఏమిటంటే.. ఎవరైనా దోషిగా నిర్ధారించబడనంత వరకు.. అలాంటి వ్యక్తులు ఎన్నికల్లో పోటీ చేయవచ్చు. అభ్యర్థి నేరస్థుడా కాదా అని ఓటర్లు ఎల్లప్పుడూ పట్టించుకోరన్నారు.
తాను చూసిన అత్యంత తెలివైన మనీలాండరింగ్ పద్ధతి ఏమిటని రాజ్ షమానీ అడిగినప్పుడు.. సింగ్ బ్యాంక్ ఆఫ్ బరోడా కేసును ప్రస్తావించాడు, అక్కడ దిగుమతులకు ముందస్తు చెల్లింపుగా రూ. 3,600 కోట్లు విదేశాలకు పంపబడ్డాయి, కానీ అది ఎప్పుడూ జరగలేదు. దీని కోసం 13 ఖాతాలను ఉపయోగించారని ఆయన అన్నారు. మేము వాటిని విచారించినప్పుడు వారి డైరెక్టర్లు మురికివాడల నివాసితులు అని మేము కనుగొన్నాము.
వారికి ప్రతి నెలా రూ. 10 వేలు చెల్లించారు. KYC పూర్తయిన తర్వాత కార్యాలయాలు మూసివేయబడ్డాయి. ఎగుమతి కోసం వస్తువుల ధరలు పెంచబడ్డాయి. ఎవరైనా ఒక విదేశీ కంపెనీని తెరిచి అధిక ధర విలువైన వస్తువులను పంపి ఆపై ప్రభుత్వ డ్యూటీ డ్రాబ్యాక్ స్కీమ్ (ప్రభుత్వ పథకం)ను సద్వినియోగం చేసుకుని ఎక్కువ డబ్బును తిరిగి తీసుకువస్తారు. దీని కింద ఎగుమతిదారులు కొంత పన్నులు తిరిగి పొందుతారన్నారు.
ఇక ముంబైకి చెందిన మరో కేసులో వజ్రాలను దిగుమతి చేసుకోవడానికి ఒక కంపెనీ రూ.6 వేల కోట్ల రుణం తీసుకుని, ఆ డబ్బును వేరే చోట ఎలా పెట్టుబడి పెట్టిందో సింగ్ వివరించాడు. "వారు స్థానిక భాగస్వామితో కలిసి దుబాయ్‌లో ఒక కంపెనీని ప్రారంభించారు. కంపెనీ యజమాని పారిపోయి తన సేవకులను భారతదేశంలో డైరెక్టర్లుగా చూపించాడు. తరువాత అతను వేరే దేశ పౌరసత్వం తీసుకున్నాడని తెలిపారు.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications