Fake News: ఈ మధ్య అసత్యాలు ప్రచార చేయడం ఓ హాబీగా మారిపోయింది. పెరుగుతున్న సాంకేతికను అందిపుచ్చుకొని లేనిదాన్ని ఉన్నట్లుగా సృష్టించడం, ప్రజలను ప్రభుత్వాన్ని తప్పుదోవ పట్టించడం అలవాటైపోయింది. అసలు నిజం ఏంటో తెలియక సగటు పౌరులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తాజాగా గూగుల్ కి సంబంధించి ఇటువంటి వార్తలే నెట్టింట వైరల్ గా మారాయి.
ఆగస్టు 1 నుంచి టెక్ దిగ్గజం గూగుల్ తన జీమెయిల్ సర్వీసును నిలిపివేస్తున్నట్లు ఉన్న ఒక ఈమెయిల్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. జీమెయిల్ వినియోగిస్తున్న 2 బిలియన్ యూజర్లకు చేదు వార్త అని X పోస్టులో దర్శనం ఇచ్చింది. ఆ తేదీ నుంచి జీమెయిల్ ద్వారా మెయిల్స్ పంపడం లేదా స్వీకరించడం చేయలేమని అందులో రాసి ఉంది. ఆ ముందు రోజు వరకే మెయిల్ యాక్సెస్ తో పాటు డౌన్లోడ్ చేసుకోవచ్చని ప్రచారం జరుగుతోంది.

అయితే చాలామంది దీనిని నిజమేనని భావిస్తున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే.. గూగుల్ గత కొన్ని నెలలుగా పాత మరియు వినియోగంలోలేని జీమెయిల్ ఖాతాలను తొలగించడం ప్రారంభించింది. దీనిని అదనంగా తీసుకుని పలు ఫేక్ న్యూస్‌లను కొందరు పనికట్టుకుని సోషల్ మీడియాలో వ్యాపింప చేస్తున్నారు. టెక్నాలజీని ఉపయోగించుకుని ఆ మెయిల్ మార్కింగ్ చేసి వాడుకలో లేనివే కాకండా అన్ని ఖాతాలపై ఈ ప్రభావం ఉంటుంది అన్నట్లు సృష్టించారు.
మరో పోస్ట్ లో గూగుల్ తన పేమెంట్ సర్వీసెస్ 'గూగుల్ పే'ను జూన్ 4 నుంచి నిలిపివేయనునట్లు వార్తలు వైరల్ అయ్యాయి. అయితే వీటిపై గూగుల్ స్పందించింది. ఇవన్నీ ఫేక్ అని తేల్చేసింది. భారత్ లో గూగుల్ పే వాడటానికి ఎటువంటి ఇబ్బంది లేదని పేర్కొంది. అమెరికాలో మాత్రమే కొన్ని వెర్షన్స్‌లో మార్పులు చేసినట్లు ప్రకటించింది. జూన్ 4 తర్వాత కూడా భారతీయులు ఎటువంటి ఇబ్బందులు లేకుండా నగదు బదిలీ సహా బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చని స్పష్టం చేసింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications