కేవలం రూ.700లకే ఆధార్, రేషన్ కార్డులు.. కేరళలో గుట్టురట్టయిన బంగ్లాదేశీయుల భారీ నెట్‌వర్క్!

భారతదేశ రక్షణ , భద్రతకు సవాల్ విసురుతూ నకిలీ గుర్తింపు కార్డుల మాఫియా దేశవ్యాప్తంగా విరుచుకుపడుతోంది. కేరళలో వలస కార్మికుల ముసుగులో దాదాపు 10,000 మందికి పైగా బంగ్లాదేశ్ పౌరులు అక్రమంగా నివసిస్తున్నట్లు సంచలన నివేదికలు బయటకు వచ్చాయి. కొల్లాం జిల్లాలోని కొట్టారక్కరలో పోలీసులు ఇటీవలే 10 మంది బంగ్లాదేశీయులను అదుపులోకి తీసుకోవడంతో ఈ భారీ రాకెట్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.

అరెస్టయిన వారి వద్ద భారతీయ పౌరులకు ఉండే అసలైన కార్డులను పోలిన నకిలీ ఆధార్ కార్డులు, పాన్ కార్డులు, ఓటర్ ఐడీలు , కేరళ అడ్రస్‌లతో ఉన్న రేషన్ కార్డులు లభించడం అధికారులను సైతం విస్మయానికి గురిచేసింది. కేవలం రూ.700 లకే ఇలాంటి నకిలీ డాక్యుమెంట్లను సృష్టిస్తున్నట్లు ప్రాథమిక విచారణలో తేలింది.

Fake Aadhar and Ration Cards For 700 Rupees Bangladesh Nationals In Kerala Arrested

పశ్చిమ బెంగాల్ కార్మికుల ముసుగులో..

పోలీసుల దర్యాప్తు ప్రకారం.. ఈ చొరబాటుదారులు మొదట బంగ్లాదేశ్ సరిహద్దు గుండా భారతదేశంలోకి ప్రవేశించి, పశ్చిమ బెంగాల్‌లోని ముర్షిదాబాద్ వంటి ప్రాంతాలకు చేరుకుంటారు. అక్కడ స్థానిక ఏజెంట్ల సహాయంతో ప్రాథమిక నకిలీ పత్రాలను సంపాదిస్తారు. ఆ తర్వాత, మంచి ఉపాధి అవకాశాలు ఉండే కేరళ వంటి రాష్ట్రాలకు వలస కార్మికుల లేబుల్‌తో ప్రవేశిస్తారు. ఇక్కడికి వచ్చాక స్థానిక అడ్రస్‌లను వాడుకుంటూ పూర్తిస్థాయి భారతీయ ఐడెంటిటీలను పొందుతున్నారు.

ఈ నకిలీ పత్రాల వెనుక బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న ఒక పెద్ద మాఫియా నెట్‌వర్క్ ఉన్నట్లు పోలీసులకు సమాచారం అందింది. ఈ కార్డులు ఎంత పకడ్బందీగా తయారుచేస్తున్నారంటే, చూసిన వెంటనే అవి నకిలీవని గుర్తించడం చాలా కష్టం. కొట్టారక్కరలో అరెస్టయిన వారు కొన్నేళ్లుగా కేరళలోనే నివసిస్తున్నారు. వారి మొబైల్ ఫోన్లను నిశితంగా పరిశీలించి, అందులో బంగ్లాదేశ్ పాస్‌పోర్టుల కాపీలను కనుగొన్న తర్వాతే వారు పరాయి దేశస్థులని పోలీసులు నిర్ధారించారు.

చైన్ మైగ్రేషన్ కలకలం

ఈ అక్రమ వలసల్లో 'చైన్ మైగ్రేషన్' (ఒకరిని చూసి ఒకరు రావడం) పద్ధతిని వాడుతున్నట్లు అధికారులు గుర్తించారు. దీనికి ఉదాహరణగా ముగల్ ఖాతూన్ అనే బంగ్లాదేశ్ మహిళ ఉదంతాన్ని పేర్కొనవచ్చు. ఈమె 13 ఏళ్ల క్రితం పశ్చిమ బెంగాల్ మీదుగా కేరళకు వచ్చి, ఇక్కడ "మమ్దాస్" అనే పేరుతో Aadhar సహా అన్ని భారతీయ గుర్తింపు కార్డులను సంపాదించింది. ఆ తర్వాత ఆమె తన బంధువులను కూడా కేరళకు రప్పించింది. అయితే, ఈమె అరెస్ట్ కావడానికి రెండు నెలల ముందే ఒక బంగ్లాదేశ్ పాస్‌పోర్టును ఉపయోగించి ఇద్దరు పిల్లలతో కలిసి తిరిగి బంగ్లాదేశ్‌కు ప్రయాణమైనట్లు విచారణలో తేలింది.

రంగంలోకి దిగిన ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు

ఈ వ్యవహారాన్ని సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు , రాష్ట్ర ఇంటెలిజెన్స్ వింగ్ అత్యంత తీవ్రమైన భద్రతా సమస్యగా పరిగణిస్తున్నాయి. క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉన్నవారు లేదా దేశ వ్యతిరేక శక్తులతో సంబంధాలు ఉన్నవారు కూడా ఈ నకిలీ పత్రాలను ఉపయోగించి దేశంలో ఆశ్రయం పొందుతున్నారా అనే కోణంలో దర్యాప్తు ముమ్మరం చేశారు. పశ్చిమ బెంగాల్ కార్మికులకు, బంగ్లాదేశీయులకు మధ్య ఉండే సూక్ష్మమైన భాషా వ్యత్యాసాల (Linguistic differences) ఆధారంగా వీరిని గుర్తించవచ్చని అధికారులు చెబుతున్నారు.

ఈ తనిఖీలు, విచారణ తీవ్రం కావడంతో కేరళ వ్యాప్తంగా ఉన్న బంగ్లాదేశీయులు రాష్ట్రం విడిచి పారిపోవడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పలు ప్రాంతాల్లో వలస కార్మికుల సంఖ్య తగ్గింది. రాబోయే రోజుల్లో కేరళ అంతటా ఉన్న వలస కార్మికుల ఆధార్ (Aadhar) , ఇతర గుర్తింపు కార్డులను క్షుణ్ణంగా వెరిఫై చేసి, అక్రమ చొరబాటుదారులను ఏరివేసేందుకు అధికారులు పటిష్టమైన చర్యలు చేపట్టనున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+