Ambani News: వారెవ్వా అంబానీ కలల సౌథంలో ఎన్ని ప్రత్యేకతలో.. డిజైన్ నుంచి జీతాల వరకు..
Ambani House: రిలయన్స్ ఇండస్ట్రీస్ ఛైర్మన్ ముఖేష్ అంబానీ దేశంలో ప్రముఖ వ్యాపారవేత్తగా, ఆసియాలో అత్యంత సంపన్నుడిగా కొనసాగుతున్నారు. ఆయన ఏ పని చేసినా ఓ సంచలనంగా మారుతూ ఉంటుంది. ఆయన కట్టుకున్న ఇల్లు దగ్గర నుంచి అందులో పనిచేసే వారి జీతభత్యాల వరకు ప్రతి ఒక్క వార్త ప్రత్యేకమనే చెప్పాలి.
ప్రపంచం వ్యాప్తంగా పలువురు ప్రముఖులు అత్యంత ఖరీదైన ఇళ్లను కలిగి ఉన్నారు. వారిలో ముఖేష్ అంబానీ కూడా ఒకరు. ఆయన కలల సౌధం పేరు ఆంటిలియా. చికాగోకు చెందిన సెలబ్రిటీ ఆర్కిటెక్ట్ పార్కిన్స్ డిజైన్ చేయగా ఆస్ట్రేలియాకు చెందిన లాంగ్టన్ హోల్డింగ్ దీన్ని నిర్మించింది. దాదాపు 15 వేల కోట్ల విలువైన ఆంటిలియీ.. 4 వేల 500కు పైగా చదరపు మీటర్లలో విస్తరించి ఉంది.

లండన్‌లోని బకింగ్‌హామ్ ప్యాలెస్ తర్వాత ప్రపంచంలోనే రెండో అత్యంత విలువైన భవనంగా ఆంటిలియాకు పేరుంది. ముంబైలో ఉన్న 27-అంతస్తుల ఈ సౌధాన్ని తీవ్ర భూకంపం వచ్చినా తట్టుకునేలా నిర్మించారు. ౩ హెలీప్యాడ్స్, 168 కార్లు పార్క్ చేసేందుకు వీలుగా 6 అంతస్తులు, 50 మందికి సరిపడే సినిమా థియేటర్ సహా పలు సౌకర్యాలు ఉన్నాయి.
ఈ భవంతిలో దాదాపు 600 మంది పనిచేస్తుంటారు. వారి జీతభత్యాలు భారీ స్థాయిలో 2 లక్షల వరకు ఉంటాయని టాక్. అంటే దాదాపు 24 లక్షల ప్యాకేజ్ అన్నమాట. మల్టీనేషనల్ కంపెనీలో పనిచేసే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి కంటే ఆంటిలియాలో పనివారే ఎక్కువ సంపాదిస్తుండటం విశేషం. జీతానికి తోడు అక్కడే వసతి ఏర్పాట్లు, ఇన్స్యూరెన్స్, పిల్లలకు ఫీజులు వంటి అవకాశాలు కూడా ఉన్నట్లు తెలుస్తోంది.


Click it and Unblock the Notifications