Market Next Week: ఇన్వెస్టర్లకు ఈవారం కీలకం.. ఆ అంశాలపైనే పెట్టుబడుదారుల చూపు..
Stock Market: గతవారం దేశీయ స్టాక్ మార్కెట్లు భారీ కుదుపులకు లోనయ్యాయి. మార్కెట్లలో ప్రధానంగా స్మాల్ అండ్ మిడ్ క్యాప్ కేటగిరీ షేర్లలో నమోదైన కరెక్షన్ పెట్టుబడిదారులకు సంబంధించిన సంపదను లక్షల కోట్ల మేర కోల్పోయారు.
గతవారం భారత స్టాక్ మార్కెట్లు ప్రధానంగా అధిక యూఎస్ ద్రవ్యోల్బణం నంబర్లు, మందగించిన డొమెస్టిక్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ వంటి కారణాలతో నష్టాలను చవిచూశాయి. ఈ క్రమంలో నిఫ్టీ సూచీ 2 శాతం మేర క్షీణతకు గురైంది. అయితే ఇప్పుడు అందరి చూపు వచ్చేవారం సెన్సెక్స్-నిఫ్టీ పనితీరుపైనే ఉంది. ఈవారం పెట్టుబడిదారులు ప్రధానంగా ఇండియన్ బ్యాంక్ డిపాజిట్ అండ్ లోన్ గ్రోత్ డేటాపై ఉంది. అలాగే సర్వీస్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ పీఎంఐ గణాంకాల కోసం పెట్టుబడిదారులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

వాస్తవానికి దేశీయ స్టాక్ మార్కెట్లలోని పెట్టుబడిదారులతో పాటు ప్రపంచ మార్కెట్లు అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్లపై చేయనున్న కీలక ప్రకటన కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అలాగే యూఎస్ ఫెడ్ సమావేశంలో ఎకనమిక్ గ్రోత్ ప్రొజెక్షన్ నంబర్లు మార్కెట్లను ముందుకు నడపనున్నాయని నిపుణులు చెబుతున్నారు. యూఎస్ హోల్‌సేల్ ధరలలో ఊహించిన దాని కంటే పదునైన జంప్ వడ్డీ రేట్ల తగ్గింపు ఆశలను దెబ్బతీసిందని హెచ్‌డీఎఫ్‌సీ సెక్యూరిటీస్ రిటైల్ రీసెర్చ్ హెడ్ దీపక్ జసాని వెల్లడించారు. ఈ ప్రభావం శుక్రవారం యూఎస్ మార్కెట్లలో కనిపించాయని అన్నారు.
టెక్నికల్స్ పరిశీలిస్తే నిఫ్టీ వచ్చేవారం ఒత్తిడిని కొనసాగిస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ టెక్నికల్స్ పరిశీలిస్తే మార్కెట్లో అనిశ్చితిని సూచించే డోజీ క్యాండిల్‌ను ఏర్పరుస్తుందని LKP సెక్యూరిటీస్‌లోని సీనియర్ టెక్నికల్ & డెరివేటివ్ అనలిస్ట్ రూపక్ దే తెలిపారు. మెుత్తానికి రానున్న వారంలో దేశీయ స్టాక్ మార్కెట్లకు అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ నుంచి వచ్చే సమాచారం చాలా కీలకంగా మారనుందని నిపుణులు చెబుతున్నారు. పెట్టుబడిదారులు ఈ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలించి పెట్టుబడి నిర్ణయాలను తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.


Click it and Unblock the Notifications