ముంబై: స్టాక్ మార్కెట్లు బుధవారం (డిసెంబర్ 9) భారీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 46,000 మార్కును క్రాస్ చేయగా, నిఫ్టీ 13,500 దాటి కొత్త శిఖరాలను తాకింది. బ్యాంకింగ్, ఐటీ, ఎనర్జీ స్టాక్స్ భారీగా లాభపడ్డాయి. దీంతో సూచీలు ఎగిసిపడ్డాయి. అధిక వెయిటేజీ కలిగిన రిలయన్స్ ఇండస్ట్రీస్ స్టాక్ నేడు 1.62 శాతం లాభపడింది. ఇటీవలి వరకు రూ.2000కు దిగువనే ఉన్న స్టాక్ నేడు మొదటిసారి ఈ మార్కు దాటి రూ.2,026 వద్ద ముగిసింది. మార్కెట్ క్యాప్ పరంగా రెండో అతిపెద్ద కంపెనీ టీసీఎస్ స్టాక్ కూడా 0.53 శాతం లాభపడి రూ.2,812 వద్ద క్లోజ్అయింది. నేడు ఇన్వెస్టర్లు భారీగా లాభపడ్డారు.

రూ.1 లక్ష కోట్లకు పైగా పెరిగిన సంపద
నేడు ప్రధానంగా ఫార్మా, ఐటీ స్టాక్స్ కొనుగోళ్లకు ఇన్వెస్టర్లు ఎగబడ్డారు. దీంతో సెన్సెక్స్ 495 పాయింట్లు ఎగిసి 46,103.50 వద్ద, నిఫ్టీ 136 పాయింట్లు ఎగిసి 13,529.10 పాయింట్ల వద్ద క్లోజ్ అయింది. నేడు మార్కెట్లు సరికొత్త శిఖరాలను తాకడంతో ఇన్వెస్టర్లు భారీ లాభాలు ఆర్జించారు. ఈ ఒక్కరోజే రూ.1.29 లక్షల కోట్ల ఆదాయం పెరిగింది. దీంతో బీఎస్ఈ లిస్టెడ్ కంపెనీల మార్కెట్ క్యాపిటలైజేషన్ నేడు రూ.182.91 కోట్లకు పెరిగింది. మంగళవారం ఇది రూ.181.62 కోట్లుగా ఉంది.

ఈ స్టాక్స్ జంప్
యూపీఎల్ టాప్ గెయినర్‌గా నిలిచింది. ఏషియన్ పేయింట్స్, ఐవోసీ వరుసగా 3.42 శాతం, 3.19 శాతం చొప్పున పెరిగాయి. కొటక్ మహీంద్రా, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్, యాక్సిస్, రిలయన్స్, హెచ్‌యూఎల్, ఐటీసీ, బజాజ్ ఫైనాన్స్, ఇండస్ఇండ్ బ్యాంకు, ఎల్ అండ్ టీ, దివిస్ ల్యాబ్స్, హెచ్‌సీఎల్ టెక్, హీరో మోటో కార్ప్, డాక్టర్ రెడ్డీస్, టీసీఎస్, ఓఎన్జీసీ, టాటా మోటార్స్ మంచి లాభాల్లో ముగిశాయి. ఇవీ 0.52 శాతం నుండి 2.66 శాతం మధ్య ఎగిశాయి. ప్రధానంగా ఐటీ, బ్యాంకింగ్, స్టాక్స్ మంచి లాభాలు నమోదు చేయడంతో సూచీలు పైకి కదలాయి.

అందుకే మార్కెట్లు ఎగిసిపడ్డాయి
సూచీలు వరుసగా రికార్డులు నమోదు చేస్తున్నాయి. ఇందుకు వివిధ కారణాలు ఉన్నాయి. ఫైజర్ ఇంక్ వ్యాక్సీన్‌కు అమెరికా ఆమోదం తెలిపింది. ఇది త్వరలో వచ్చే అవకాశముంది. ఈ వ్యాక్సీన్ సేఫ్టీ, ఎఫిషియెన్సీపై మరో ఇతర ఇష్యూలు లేవని యునైటెడ్ స్టేట్స్ డ్రగ్ తెలిపింది. ఇది ఈక్విటీ మార్కెట్లు పుంజుకునేలా చేసింది.
అమెరికాలో ఆర్థిక ప్యాకేజీ పట్టాలెక్కే అవకాశాలు కనిపిస్తోంది. మన దేశంలో కరోనా కేసులు వేగంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఆర్థిక కార్యకలాపాలు పుంజుకుంటున్నాయి. ఇలా వివిధ కారణాలతో మార్కెట్లు ఎగిసిపడ్డాయి.
More From GoodReturns

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Reliance Share: రిలయన్స్ షేర్లు ఎందుకు పడిపోతున్నాయి? ఇన్వెస్టర్లు ఇప్పుడేం చేయాలి?

Stock market: యుద్ధ భయాల్లోనూ దూసుకుపోతున్న షేర్లు.. ఇన్వెస్టర్లకు బంపర్ రిటర్న్స్ ఇచ్చిన పెన్నీ స్టాక్స్!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

Stock market: ఇన్వెస్టర్లకు అగ్నిపరీక్ష..! వచ్చే వారం RBI నిర్ణయంపైనే అందరి కళ్లు!

పెట్టుబడిదారుల కొంపలు ముంచుతున్న ట్రంప్.. కుప్పకూలిన స్టాక్ మార్కెట్.. ఎంతలా అంటే..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

బంగారం ధర పెరిగింది.. ఈ రోజు పెరుగుదలతో పసిడి రేటు ఎలా ఉందంటే.. ఏప్రిల్ 4, శనివారం ధరలు ఇవే..

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications