ముంబై: గత కొద్దిరోజులుగా రిలయన్స్ ఇండస్ట్రీస్ డిజిటల్ విభాగం జియో ప్లాట్‌ఫాం పెద్ద ఎత్తున పెట్టుబడులు వచ్చాయి. రైట్స్ ఇష్యూ ద్వారా నిధులు సమీకరించారు. ఈ ప్రయత్నాలతో రిలయన్స్ రుణరహిత కంపెనీగా నిలిచింది. దీంతో గత కొద్ది రోజులుగా ఈ షేర్ ధర పైపైకి ఎగిరింది. అయితే నేటి ఫలితాలకు (గురువారం, 30) ముందు షేర్ ధర పడిపోయింది. నిన్న షేర్ 3.94 శాతం పడిపోయి రూ.2092 వద్ద ముగిసింది. మే 14వ తర్వాత భారీగా నష్టపోయింది. ఈ రోజు ఉదయం ప్రారంభంలో 0.46 శాతం తగ్గి రూ.2,087కి పడిపోయింది.

షేర్ ఢమాల్.. లాభాలు తగ్గుతాయి.. ఎందుకంటే
జూలై 27వ తేదీన రిలయన్స్ షేర్ ఆల్ టైమ్ గరిష్టం రూ.2,198.70కి చేరుకుంది. కేవలం నాలుగు నెలల్లోనే స్టాక్స్ 153 రెట్లు ఎగిసింది. రిలయన్స్ మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.14 లక్షల కోట్లు దాటింది. రిలయన్స్ క్వార్టర్ నికర లాభం తగ్గవచ్చునని బ్రోకరేజీ సంస్థలు అంచనా వేస్తున్నాయి. కరోనా నేపథ్యంలో సంస్థ ఆర్థిక కార్యకలాపాలలో ముఖ్యమైన ఇంధన రిఫైనరీలు, పెట్రో రసాయన ప్లాంట్స్, రిటైల్ వ్యాపారంలో ఎదురైన ఆటంకాలు ఇందుకు కారణమని చెబుతున్నారు. పన్నెండు బ్రోకరేజీ సంస్థల అంచనా ప్రకారం రిలయన్స్ నికర లాభాలు రూ.4,600 కోట్ల నుండి రూ.8,000 కోట్ల మధ్య తగ్గవచ్చు. సగటున దాదాపు రూ.7వేల కోట్లు. 2019 జూన్ క్వార్టర్ లాభం రూ.10,104 కోట్లతో పోలిస్తే 30.8 శాతం తక్కువ. రిఫైనింగ్ మార్జిన్ బ్యారెల్‌కు 8.9 డాలర్ల నుండి 6 డాలర్లకు తగ్గవచ్చు. ప్రధానంగా ఇంధన రంగం దెబ్బకొడుతుందంటున్నారు.

జియో లాభాలు మెరుగ్గా
రిలయన్స్ ఎబిటా 22 శాతం తగ్గే అవకాశముందని, రిఫైనింగ్, పెట్రో కెమికల్స్, రిటైల్ బలహీనంగా ఉన్నా జియో లాభాలు మెరుగ్గా ఉండవచ్చునని అంచనా వేస్తున్నాయి. సింగపూర్, దుబాయ్‌లలో బ్యారెల్ మార్జిన్ 1 డాలర్ ప్రతికూలంగా ఉండవచ్చునని అంచనా. రిఫైనింగ్ మార్జిన్ పడిపోయినప్పటికీ జియో కొంతలో కొంత గట్టెక్కిస్తుందని భావిస్తున్నారు.

ఖతార్ పెట్టుబడులు
జియో ఫైబర్ వాటాల విక్రయం ద్వారా మరిన్ని నిధులు సమీకరించాలని రిలయన్స్ భావిస్తోంది. జియో డిజిటల్ ఫైబర్ ప్రయివేట్ లిమిటెడ్‌లో ఖతార్ ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ 150 కోట్ల డాలర్లు ఇన్వెస్ట్ చేసేందుకు చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది. అంటే రూ.11,200 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టేందుకు ఖతార్ ఆసక్తి చూపిస్తోంది. రిలయన్స్ 5G సేవలకి సిద్ధమవుతోంది. ఈ సమయంలో వ్యయాల నియంత్రణ కోసం జియోను అసెట్ లైట్ డిజిటల్ కంపెనీగా మార్చాలని రిలయన్స్ భావిస్తోంది. ఇందులో భాగంగా జియో ఫైబర్ ఆస్తుల్లో వాటాలు విక్రయించనుంది.

2020 నాటికి 220 బిలియన్ డాలర్లు
ఫలితాలకు ముందు రిలయన్స్ ఇండస్ట్రీస్‌కు డౌన్ గ్రేడ్‌తో షాకిచ్చాయి CLSA, ఎడెల్విస్ బ్రోకరేజీ సంస్థలు. అయితే మార్చి 2022 నాటికి రిలయన్స్ మార్కెట్ క్యాప్ 220 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేసింది CLSA. కరోనా కారణంగా నాలుగు నెలల క్రితం రిలయన్స్ షేర్ రూ.867.82కు పడిపోయింది. ఈ కొద్ది కాలంలోనే ఏకంగా రూ.2,000 దాటింది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications