For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

సెల్‌ఫోన్‌కు ధీటుగా ఆండ్రాయిడ్ బేస్డ్ స్మార్ట్ వాచ్: ఫేస్‌బుక్ వర్కవుట్

|

న్యూఢిల్లీ: ప్రముఖ సోషల్ మీడియా దిగ్గజం ఫేస్‌బుక్.. ఓ సరికొత్త ప్రాజెక్ట్‌ను టేకప్ చేసింది. ఓ స్మార్ట్‌వాచ్‌ను తయారు చేసే పనిలో పడింది. సెల్‌ఫోన్ తరహాలో ఆండ్రాయిడ్ ఆధారంగా పనిచేసే స్మార్ట్‌వాచ్ ఇది. ప్రస్తుతం ఫేస్‌బుక్ ఈ ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టిందని, అనుకున్నది అనుకున్నట్లుగా సాగితే.. వచ్చే ఏడాది ఇది మార్కెట్‌లోకి అందుబాటులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. హెల్త్, ఫిట్‌నెస్ ఫీచర్లను కలిగి ఉండేలా దీన్ని డెవలప్‌ చేస్తోంది. ఆరోగ్యం, ఫిట్‌నెస్‌కు సంబంధించిన పూర్తి వివరాలను ఎప్పటికప్పుడు తెలియజేసేలా దీన్ని అభివృద్ధి చేస్తున్నట్లు సమాచారం.

రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త అడ్వెంచర్ బైక్: పేరుకు తగ్గట్టే ఫీచర్లు: రేటెంతో తెలుసా?రాయల్ ఎన్‌ఫీల్డ్ కొత్త అడ్వెంచర్ బైక్: పేరుకు తగ్గట్టే ఫీచర్లు: రేటెంతో తెలుసా?

ఏ స్మార్ట్‌వాచ్‌లోనూ లేని సౌకర్యాలు..

ఏ స్మార్ట్‌వాచ్‌లోనూ లేని సౌకర్యాలు..

స్మార్ట్‌ఫోన్లలో వినియోగించే ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్ మీదే ఈ వాచ్‌ను కూడా అభివృద్ధి చేస్తోండటం వల్ల ఒకేరకమైన ఫీచర్లు కలిగి ఉండేలా జాగ్రత్తలను తీసుకుంటోందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తోన్నాయి. స్మార్ట్ వాచ్ నుంచి సెల్‌ఫోన్‌కు మెసేజీని పంపించే వెసలుబాటును తీసుకుని రావచ్చని చెబుతున్నారు. హెల్త్, ఫిట్‌నెస్‌కు సంబంధించిన వివరాలను ఈ మెసేజీల ద్వారానే వినియోగదారులకు చేరవేస్తుందని ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఈ తరహా వ్యవస్థ.. ఇప్పటిదాకా ఏ స్మార్ట్‌‌ఫోన్‌లోనూ లేదు.

 హెల్త్, ఫిట్‌నెస్ మెసేజీలు..

హెల్త్, ఫిట్‌నెస్ మెసేజీలు..

స్మార్ట్‌ ఫోన్ల తరహాలోనే ఓ మోస్తరు స్క్రీన్ ఉండేలా ఈ వాచ్ ఉండొచ్చని చెబుతున్నారు. ఈ వాచ్ స్క్రీన్ పరిమాణం ఏ స్థాయిలో ఉండాలనేది ఇంకా ఖరారు కాలేదని తెలుస్తోంది. స్మార్ట్‌వాచ్ హార్డ్‌వేర్‌కు అనుగుణంగా దాని సైజును నిర్ధారిస్తారని అంటున్నారు. ఇదివరకు ఫేస్‌బుక్ ఒకులస్ వర్చువల్ రియాలిటీ హెడ్‌సెట్, పోర్టల వీడియో ఛాట్ డివైజ్‌లను అభివృద్ధి చేసిన విషయం తెలిసిందే. అదే తరహా టెక్నాలజీని మరింత అభివృద్ధి చేసి, స్మార్ట్‌వాచ్‌గా రూపొందిస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. ఆరోగ్యానికి సంబంధించిన వివరాలను తొలుత- అందులో ఫీడ్ చేయాల్సి ఉంటుంది. అనంతరం మన శరీర తత్వానికి సరిపడేలా, ఎప్పటికప్పుడు మెసేజీల రూపంలో అలర్ట్ చేసేలా స్మార్ట్‌వాచ్ పనితీరు ఉంటుందని చెబుతున్నారు.

ప్రాజెక్ట్ ఏరియా పేరుతో కొత్త ప్రాజెక్ట్..

ప్రాజెక్ట్ ఏరియా పేరుతో కొత్త ప్రాజెక్ట్..

దీనితోపాటు- ప్రాజెక్ట్ ఏరియాతో పేరుతో అగ్‌మెంటెడ్ రియాలిటీ రీసెర్చ్‌ను చేపట్టిందని తెలుస్తోంది. ప్రఖ్యాత ఐగ్లాసెస్ కంపెనీ రేబాన్‌తో కలిసి ఈ ప్రాజెక్ట్‌ను చేపట్టింది. దీనిపై ఇప్పటికే ఆరువేల మంది ఉద్యోగులు పనిచేస్తున్నట్లు విదేశీ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. దీనిపై ఫేస్‌బుక్ యాజమాన్యం ఎలాంటి స్పందనా వ్యక్తం చేయట్లేదు. ఆ వార్తలు, ప్రత్యేక కథనానలు తోసిపుచ్చట్లేదు.. అలాగనీ సమర్థించనూ లేదు. ప్రాజెక్ట్ ఏరియా త్వరలోనే ఓ రూపాన్ని సంతరించుకున్న తరువాత.. దాని వివరాలను అధికారికంగా వెల్లడించే అవకాశం ఉందని అంటున్నారు.

English summary

సెల్‌ఫోన్‌కు ధీటుగా ఆండ్రాయిడ్ బేస్డ్ స్మార్ట్ వాచ్: ఫేస్‌బుక్ వర్కవుట్ | Facebook reportedly developing on a Android-based smartwatch

Facebook now wants to foray into the smartwatch market. The social media giant is now working on a smartwatch that it plans to sell next year. It will be an Android-based smartwatch. It will come loaded with health and fitness features.
Story first published: Saturday, February 13, 2021, 13:31 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X