Meta Layoffs: అమెరికాకు చెందిన టెక్ దిగ్గజం మెటా తన లేఆఫ్ స్పీ కొనసాగిస్తూనే ఉంది. 2022 నుంచి వరుసగా ఐదవసారి టెక్ దిగ్గజం తన తొలగింపులను కొనసాగిస్తోంది. అమెరికాలో ద్రవ్యోల్బణం కుదుటపడటంతో ఇటీవల ఫెడ్ చర్యలు ప్రపంచ వ్యాప్తంగా జాబ్ మార్కెట్లలో కొత్త సంతోషాన్ని నింపాయి. ఈ క్రమంలో రిక్రూట్మెంట్లు సైతం భారీగా పెరిగిన సంగతి తెలిసిందే.
ఫేస్‌బుక్ మాతృసంస్థ మెటా గతంలో సోషల్ మీడియా విభాగంలో వేల సంఖ్యలో ఉద్యోగులను కత్తిరించిన సంగతి తెలిసిందే. తాజాగా కంపెనీ వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్ మరియు రియాలిటీ ల్యాబ్‌లతో సహా వివిధ విభాగాలలో ఉద్యోగులను తొలగించడం మెటా ప్రారంభించింది. ఈ కోతలు నిర్దిష్ట జట్లలో పునర్నిర్మాణానికి సంబంధించినవి. 2023లో మెటాస్ థ్రెడ్స్ టీమ్‌లో చేరడానికి ముందు ప్రకటించని యాప్ ఫీచర్‌లను వెలికితీసేందుకు ప్రసిద్ధి చెందిన జేన్ మంచున్ వాంగ్ వంటి కొంతమంది ఉద్యోగులు తమ తొలగింపుల గురించి బయటకు చెప్పటంతో విషయం బయటకు వచ్చింది.

ప్రస్తుతం కంపెనీ తన దీర్ఘకాలిక లక్ష్యాలకు అనుగుణంగా వనరులను తిరిగి కేటాయిస్తోందని మెటా ప్రతినిధి డేవ్ ఆర్నాల్డ్ వెల్లడించారు. ఇందులో ఉద్యోగులను వేరువేరు పాత్రల్లోకి మార్చటం ఉంటాయన్నారు. లేఆఫ్ వల్ల ఎఫెక్ట్ అయిన ఉద్యోగులకు కంపెనీలో అందుబాటులో ఉన్న ఇతర రోల్స్ ఫిట్ చేసేందుకు ఉన్న అవకాశాలను పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు. కరోనా తర్వాత 2022 నుంచి ఆశించిన స్థాయిలో వృద్ధి లేకపోవటంతో మెటా లేఆఫ్స్ కొనసాగిస్తోంది. ఈ లేఆఫ్ ప్రయాణాన్ని కంపెనీ తొలుత 11,000 మంది ఉద్యోగులను తొలగించనున్నట్లు చేసిన ప్రకటన నుంచి స్టార్ట్ అయ్యింది. అలాగే 2023లో సీఈవో జుకర్ బర్గ్ మరో 10,000 మంది ఉద్యోగుల తొలగింపులను ప్రకటించింది.
ఇదే క్రమంలో కంపెనీ తన లాస్ ఏంజెలెస్ ఆఫీసులో దాదాపు రెండు డజన్ల మంది ఉద్యోగులను తొలగించినట్లు ఫైనాన్షియల్ టైమ్స్ ప్రచురించింది. ఉద్యోగులకు మెటా అందించిన 25 డాలర్ల మీల్ క్రెడిట్లను ఇంటికి అవసరమైన వస్తువులను కొనుగోలు చేసేందుకు వినియోగించినందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడైంది. అయితే ఈ తొలగింపులు కంపెనీలో కొనసాగుతున్న రీస్టక్చరల్ లేఆఫ్స్‌కి సంబంధం లేదని పేర్కొనబడింది. గతంలో జూకర్ బర్గ్ కంపెనీ మరింతగా ముందుకు తీసుకెళ్లే క్రమంలో అవసరమైతే మరిన్ని తొలగింపులు ఉంటాయని పేర్కొనగా, ప్రస్తుత పరిస్థితులు దానికి అనుగుణంగానే జరుగుతున్నట్లు తెలుస్తోంది. జుకర్‌బర్గ్ 2023ని 'సమర్థత సంవత్సరం' అని పిలిచిన ఒక సంవత్సరం తర్వాత తాజా పరిణామాలు కొనసాగుతున్నాయి. ప్రధానంగా ఖర్చులను తగ్గించి లాభదాయకతను పెంచాలని మెటా చూస్తున్నట్లు నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
More From GoodReturns

Layoffs: జీతం కోసం కాదు.. కేవలం ఆ ఒక్క కారణంతో 10 ఏళ్లు ఒకే కంపెనీలో! ఈ టెక్కీ కథ విన్నారా?

14 వేల మందిని ఇంటికి సాగనంపుతున్న అమెజాన్.. టెక్ రంగాన్ని కుదిపేస్తున్న లేఆప్స్..

Gold silver: బంగారం, వెండి కొనాలా? వద్దా? మార్కెట్లో వింత పరిస్థితి.. నిపుణుల సలహా ఇదే!

ప్రపంచం ముప్పు ముంగిట్లో ఉంది.. ఈ మూడు ఆస్తులు తప్ప మిమ్మల్ని ఏవీ కాపాడలేవంటున్న కియోసాకి..

Bengaluru: రెంట్ కంటే EMI మేలా? బెంగళూరు హౌసింగ్ మార్కెట్లో కొత్త వివాదం.. నిపుణులు ఏమంటున్నారు?

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

పరుగులు పెట్టిన స్టాక్ మార్కెట్.. ఇన్వెస్టర్లకు లాభాల పంట.. అయినా గుండెల్లో దడే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బెంగళూరు మెట్రో ప్రయాణిలకు గుడ్ న్యూస్.. మరో రెండు కొత్త రైళ్లు వచ్చేస్తున్నాయి..

6 వేల డాలర్ల మార్క్ దాటబోతున్న బంగారం ధర.. డాలర్ విలువ ఖేల్ ఖతం.. ప్రపంచ రారాజుగా పసిడి..



Click it and Unblock the Notifications