తప్పుడు వార్తలపై ఫేస్‌బుక్ కొరడా ఝుళిపిస్తోంది. తప్పుడు వార్తల వ్యాప్తిని తీవ్రంగా పరిగణిస్తోంది. సింగపూర్ ప్రభుత్వం తప్పుడు వార్తల విషయంలో కఠిన చట్టం తీసుకురావడంతో స్పందించిన ఫేస్‌బుక్ మొట్టమొదటిసారిగా ఒక తప్పుడు పోస్టుకు సవరణ నోటీసు జారీ చేసింది.
వాక్ స్వాతంత్ర్యాన్ని కాపాడేందుకు సింగపూర్ ప్రభుత్వం తాజాగా ఒక చట్టాన్ని తీసుకొచ్చింది. ఓ తప్పుడు వార్తకు సంబంధించి ఫేస్‌బుక్‌కు తెలియజేయడంతో ఫేస్‌బుక్ స్పందించి ఆ మేరకు ఆ తప్పుడు పోస్టును ప్రచురించిన యూజర్‌కు నోటీసు జారీ చేసింది. అయితే ఇది సదరు ఫేస్‌బుక్ ఖాతాదారునికే తప్ప.. సింగపూర్‌లోగాని, సింగపూర్ బయటగాని ఇతర ఫేస్‌బుక్ ఖాతాదారులకు కనిపించదు.

'' ఈ పోస్టులో అసత్య సమాచారం ఉన్నట్లు సింగపూర్ ప్రభుత్వం పేర్కొంటోంది. కాబట్టి తప్పు జరిగినట్లు మీకు చెప్పాల్సిన బాధ్యత చట్టపరంగా ఫేస్‌బుక్‌ది..'' అంటూ ఆ నోటీసులో యూజర్‌ని ఉద్దేశించి పేర్కొంది. సదరు పోస్టు కిందే ఎంబెడ్ చేసిన ఈ నోటీసు సింగపూర్‌లోని కొంతమంది ఫేస్‌బుక్ ఖాతాదారులకు అందింది.
ఈ విషయమై సింగపూర్ ప్రభుత్వ ప్రతినిధి కూడా స్పందించారు. దీనిపై మాట్లాడుతూ ''కొత్త చట్టం ఇప్పుడే అమలులోకి వచ్చింది. ఈ చట్టం కారణంగా భావ ప్రకటనా స్వేచ్ఛకు ఎలాంటి ఇబ్బందీ రానీయం.. అయితే సింగపూర్ కొత్త చట్టం ప్రకారం ఆయా తప్పుడు పోస్టుల కింద ఫేస్‌బుక్ ఈ రకమైన నోటీసును అనుసంధానం చేయాల్సి ఉంటుంది. ఆయా తప్పుడు పోస్టులలోని విషయాలు అసత్యాలని సింగపూర్ ప్రభుత్వం పేర్కొంటున్నట్లుగా ఆ నోటీసుల్లో ఫేస్‌బుక్ పేర్కొనాల్సి ఉంటుందని చెప్పారు.
More From GoodReturns

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!



Click it and Unblock the Notifications