For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫేస్‌బుక్ ఉద్యోగికి కరోనా వైరస్, కన్‌ఫర్మ్ చేసిన సోషల్ దిగ్గజం

|

అమెరికాలోని ఫేస్‌బుక్ కార్యాలయంలో ఒక ఉద్యోగికి కరోనా వైరస్ సోకింది. ఈ సంస్థకు సంబంధించినంత వరకు ఇది తొలి కేసు అని ఫేస్‌బుక్ తెలిపింది. కరోనా సోకిన ఆ ఉద్యోగి సియాటెల్‌లోని ఫేస్‌బుక్ స్టేడియం ఈస్ట్ కార్యాలయంలో ఫిబ్రవరి 21వ తేదీ వరకు విధులు నిర్వహించారు. ఉద్యోగికి కరోనా నేపథ్యంలో సియాటెల్ కార్యాలయాన్ని మార్చి 9న క్లోజ్ చేయనున్నట్లు ప్రకటించింది.

ఈ నెలాఖరు వరకు ఇంటి నుండి పని చేయాలని ఫేస్‌బుక్ తన ఉద్యోగులను కోరింది. ప్రతి ఒక్కరి ఆరోగ్యం, భద్రతకు హామీ ఇస్తామని తెలిపింది. డాక్టర్లు, ప్రభుత్వాల సూచనలు, సలహాలు పాటిస్తామని తెలిపింది. ఆన్‌లైన్ దిగ్గజాలు గూగుల్, అమెజాన్‌లో ఒక్కో ఉద్యోగికి కరోనా వైరస్ సోకింది.

కరోనా వైరస్ ప్రభావం.. మరిన్ని బిజినెస్ న్యూస్

Facebook confirms that a contractor at its Seattle office tested positive for coronavirus

గూగుల్‌లో జ్యూరిచ్ కార్యాలయంలోని ఉద్యోగికి, సియాటెల్‌లో అమెజాన్ ఉద్యోగికి కరోనా వైరస్ సోకింది. అమెజాన్, గూగుల్, కాయిన్‌బేస్, ట్విట్టర్, మైక్రోసాఫ్ట్ సహా వివిధ టెక్నాలజీ కంపెనీలు తమ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చాయి.

English summary

ఫేస్‌బుక్ ఉద్యోగికి కరోనా వైరస్, కన్‌ఫర్మ్ చేసిన సోషల్ దిగ్గజం | Facebook confirms that a contractor at its Seattle office tested positive for coronavirus

Facebook on Wednesday confirmed that a contractor at its Seattle, Washington, office tested positive for coronavirus.
Story first published: Thursday, March 5, 2020, 14:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X