AI News: ఇండియాకు వరంగా మారనున్న ఏఐ.. మెగా కానుకే..!!
Generative AI: ఓ వైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వృద్ధి ఉద్యోగుల్లో గుబులు రేపుతోంది. అయితే మరోపక్క దీనిని పెద్ద ఎత్తువ స్వాగతిస్తున్న వారు సైతం ఉన్నారు.
ముఖ్యంగా కంపెనీలు తమ ఖర్చులను తగ్గించుకునేందుకు ఏఐ టూల్స్ వినియోగించాలని భావిస్తున్నాయి. అన్ని రంగాల్లో ఏఐ ఆధిపత్యం పెరుగుతున్న తరుణంలో రానున్న ఏడేళ్లలో ఇది భారత జీడీపీకి 1.2-1.5 ట్రిలియన్ డాలర్లను జోడిస్తుందని EY నివేదిక పేర్కొంది. దీనిపై 'The AIdea of India: Generative AI's potential to Accelerate India's Digital Transformation' పేరుతో నివేదికను విడుదల చేసింది.

జనరేటివ్ ఏఐ 2029-30 ఆర్థిక సంవత్సరంలోనే భారత ఆర్థిక వ్యవస్థకు దాదాపు 359-438 బిలియన్ డాలర్ల విలువైన GDPని జోడించడానికి భారత్ ఈ సాంకేతికతను విరివిగా వినియోగిస్తుందని పేర్కొంది. అన్ని రంగాల్లో AI ఆధారిత ఉద్యోగాలకు అవకాశాలు పెరుగుతాయని అంచనాలు చెబుతున్నాయి. అలాగే రానున్న కాలంలో ప్రజలకు అందుబాటులో ఉన్న సేవలు, ప్రయోజనాలు పెరుగుతాయి. రానున్న కాలంలో విద్య నుంచి వైద్యం వరకు, టాయిలెట్ల నుంచి విమానాల వరకు ఏఐ వినియోగంలోకి వస్తుంది.
దేశంలో AI ద్వారా 1.5 బిలియన్ డాలర్ల జీడీపీ వృద్ధిలో 69 శాతం వ్యాపార సేవలు, ఆర్థిక సేవలు, విద్య, రిటైల్, ఆరోగ్య సంరక్షణ వంటి సేవల రంగాల్లో AI వినియోగం ద్వారా నడపబడుతుందని నివేదిక పేర్కొంది. దీనిపై ఈవై చేసిన సర్వేలో 75 శాతం కంపెనీలు జనరేటివ్ ఏఐ తమ వ్యాపారాలకు అవసరమని భావిస్తున్నట్లు వెల్లడైంది.
ఏఐ పనితీరును మెరుగుపరుస్తుందని భావిస్తున్నందున.. గూగుల్, మైక్రోసాఫ్ట్, అమెజాన్, IBM వంటి సాంకేతిక సామ్రాజ్యాలు అత్యంత అధునాతన ఎంటర్‌ప్రైజ్ ఉత్పాదక AI పరిష్కారాలు, టూల్స్ అభివృద్ధి చేస్తున్నాయి. ఈ నెల ప్రారంభంలో గూగుల్ తన అత్యంత శక్తివంతమైన AI మోడల్ అయిన జెమినిని ప్రవేశపెట్టింది. ఇది OpenAI GPT-4, Meta's Llama 2లను ఓడించగలదని కంపెనీ చెబుతోంది.


Click it and Unblock the Notifications