Cashless Payments: గడిచిన దశాబ్ధ కాలంలో భారత్ ఎన్నో విజయాలను సాధించింది. భౌతికంగా కరెన్సీతో చెల్లింపులు చేసే విధానం నుంచి రెప్పపాటులో నగదు రహిత పేమెంట్స్ స్థాయికి ఎదిగింది. అభివృద్ధి చెందిన దేశాలకు సైతం సాధ్యం కాని ఎన్నో మైలురాళ్లను అందుకుంది.
భారతీయుల జీవన విధానంలో వచ్చిన మార్పుల గురించి విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ కీలక వ్యాఖ్యలు చేశారు. మూడు సంవత్సరాలలో అమెరికా చేసే జరిపే నగదు రహిత లావాదేవీల సంఖ్యను, భారత్ కేవలం ఒక్క నెలలోనే నిర్వహిస్తుందన్నారు. నైజీరియాలోని భారతీయ కమ్యూనిటీతో సమావేశం సందర్భంగా ఆయన ఈ విధంగా స్పందించారు.

'ప్రతి భారతీయుడి జీవితం ఇప్పుడు సులభతరంగా మారిపోయింది. టెక్నాలజీ వినియోగంలో లోతైన మార్గాన్ని స్వీకరించడమే ఇందుకు కారణం. పేమెంట్స్ విషయంలో దీన్ని ప్రత్యక్షంగా చూడవచ్చు. అతికొద్ది మంది మాత్రమే ఇవాళ నగదు చెల్లింపులను చేస్తున్నారు, స్వీకరిస్తున్నారు. అగ్రరాజ్యం అమెరికా ప్రజలు మూడేళ్లలో చేసే క్యాష్‌లెస్ ట్రాన్సాక్షన్స్‌ను భారత్‌లో కేవలం నెలరోజుల్లోనే జరుగుతున్నాయి' అని జైశంకర్ తెలిపారు.
ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ భారత్ అని కేంద్ర మంత్రి కొనియాడారు. ఇండియాతో వ్యాపారం చేయాలని పలు దేశాలు ఎదురుచూస్తున్నట్లు చెప్పారు. ఫలితంగా ఎన్నడూ లేని స్థాయిలో దేశంలోకి పెట్టుబడుల ప్రవాహం వచ్చి చేరుతుందన్నారు. సవాళ్లను ఎదుర్కొంటూనే బలమైన ఆర్థిక పనితీరును ప్రదర్శిస్తున్నట్లు వెల్లడించారు.
కొవిడ్-19 కట్టడి విషయంలో భారత్ వ్యవహరించిన విధానాన్ని జైశంకర్ ప్రశంసించారు. 2020లో జరిగిన ఓ వర్చవల్ సమావేశంలో కరోనా ధాటికి ఇండియా విలవిల్లాడటం ఖాయమని పలు దేశాలు బాహాటంగానే కామెంట్స్ చేసినట్లు చెప్పారు. అయితే ఎవరూ ఊహించని రీతిలో తట్టుకుని నిలబడటమే కాకుండా ప్రపంచ దేశాలకు టీకాలను అందించి ఆదుకున్నట్లు గుర్తుచేశారు.


Click it and Unblock the Notifications