దేశంలో చక్కెర ధరలు పెరుగుతున్నాయి. మరోవైపు చాలా జిల్లాల్లో కరువు వచ్చే అవకాశం ఉంది. దీంతో చక్కెర ధరలు మరింతగా ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. వర్షాల లేకపోవడం వల్ల ఉత్పత్తి తగ్గిపోతుందనే ఆందోళనలతో ప్రపంచ చక్కెర మార్కెట్ వారాల తరబడి గందరగోళంగా ఉంది. చక్కెర ధరలు మరింత పెరగకుండా కేంద్ర చర్యలు తీసుకునే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో చక్కెర ఎగుమతులపై నిషేధం విధించే అవకాశం ఉంది.
భారతదేశంలో రుతుపవనాలు జూన్ నుండి సెప్టెంబరు చివరి వరకు కొనసాగుతాయి. మహారాష్ట్ర, కర్ణాటకలోని ప్రధాన చక్కెర సాగు ప్రాంతాల్లో ఈ సీజన్‌లో తక్కువ వర్షపాతం నమోదయ్యాయి. భారత్ బ్రెజిల్.. తర్వాత ప్రపంచంలో రెండవ అతిపెద్ద చక్కెర ఉత్పత్తిదారుగా ఉంది. ఒకవేళ చక్కెర ఎగుమతిపై నిషేధం విధిస్తే.. ప్రపంచంపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఇప్పటికే కేంద్రం బియ్యం, గోధుమ ధరలను నియంత్రించడానికి ప్రయత్నాలు చేస్తోంది.

భారత్ ఇప్పటికే బాస్మతీయేతర బియ్యం ఎగుమతి నిషేధం విధించింది. భారతీయ రైతులు సంవత్సరానికి రెండుసార్లు వరి సాగు చేస్తారు. పశ్చిమ బెంగాల్, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్, పంజాబ్, ఒడిశా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ దేశంలో వరి ఉత్పత్తిలో అగ్రభాగంలో ఉన్నాయి.
పారాబాయిల్డ్ రకం బియ్యంపై ఎగుమతులపై కూడా 20 శాతం సుంకాన్ని విధించింది. భారత్ 2022లో 7.4 మిలియన్ టన్నుల బాయిల్డ్ బియ్యం ఎగుమతి చేసింది.
రుతుపవన వర్షపాతం సెప్టెంబర్ 28 నాటికి సాధారణం కంటే 6 శాతం తక్కువగా నమోదు అయింది. అయితే కొన్ని ప్రాంతాలలో ఈ లోటు మరింత ఎక్కువగా ఉంది. మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాల్లో 14 శాతం తక్కువ వర్షపాతం నమోదు కాగా, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాల్లో 27 శాతం తక్కువగా నమోదైంది. మరోవైపు ఉల్లి ధరలు కూడా పెరగడంతో కేంద్రం చర్యలు తీసుకుంది. బఫర్ స్టాక్ ను విడుదల చేస్తోంది.


Click it and Unblock the Notifications