Suzlon Stock: సుజ్లాన్ ఎనర్జీ ఇన్వెస్టర్లకు భారీ హెచ్చరిక..!! మీ పోర్ట్‌ఫోలియోలో ఉన్నాయా?
Suzlon Energy Shares: దేశీయంగా ఇన్వెస్టర్లు చాలా కాలంగా ఎనర్జీ రంగంపై బెట్టింగ్ వేస్తున్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ కూటమి ప్రభుత్వం సైతం క్లీన్ అండ్ గ్రీన్ ఎనర్జీపై దృష్టి సారించటంతో పాటు కర్భన ఉద్ఘారాలను తగ్గించేందుకు చేస్తున్న ప్రయత్నాలు కొన్ని కంపెనీలకు కలిసొస్తోందని నిపుణులు చెబుతున్నారు.
చాలా కాలంగా సుజ్లాన్ ఎనర్జీ కంపెనీ షేర్లు పెట్టుబడిదారులకు స్థిరమైన రాబడులను అందిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో నేడు ఇంట్రాడేలో సుజ్లాన్ ఎనర్జీ షేర్లు 2% కంటే ఎక్కువ పెరిగి ఎన్ఎస్ఈలో గరిష్ఠంగా ఒక్కో షేరు ధర రూ.79.22 స్థాయిని అందుకున్నాయి. దీంతో కంపెనీ షేర్లు తమ 52 వారాల గరిష్ఠ ధర రూ.84.29కి అతిచేరువకు చేరుకున్నాయి. గడచిన ఏడాది కాలంలో ఎనర్జీ స్టాక్ తన పెట్టుబడిదారులకు ఏకంగా 235 శాతం రాబడిని అందించింది. ఈ కాలంలో స్టాక్ ధర రూ.23 నుంచి ప్రస్తుత స్థాయిలకు చేరుకుంది. నేడు మధ్యాహ్నం 3.11 గంటల సమయంలో ఒక్కో షేరు ధర రూ.78.45 వద్ద ట్రేడింగ్ కొనసాగిస్తున్నాయి.

కంపెనీ షేర్ల చాలా కాలంగా ర్యాలీని చూసిన తర్వాత ప్రస్తుతం నిపుణులు పెట్టుబడిదారులను హెచ్చరిస్తున్నారు. నేడు కంపెనీ షేర్లు రూ.70-71 స్థాయి కంటే దిగువన క్లోజ్ అయితే షేర్లను నిష్ర్కమించాలని CNBC ఆవాజ్ కార్యక్రమంలో చార్టిస్ట్ సర్వేంద్ర శ్రీవాస్తవ అభిప్రాయపడ్డారు. ఎక్కువ రాబడిని పొందటం కోసం పెన్నీ షేర్లను కొనుగోలు చేసే ఇన్వెస్టర్లను ఉద్ధేశించి మాట్లాడుతూ ప్రస్తుతానికి సుజ్లాన్‌లో ప్రస్తుతం రూ.71 వద్ద ట్రెయిలింగ్ స్టాప్ లాస్‌తో కొనసాగించాలని సూచించారు. ప్రస్తుతానికి లాభాలను ఆర్జిస్తున్నప్పటికీ పతనం ప్రారంభిస్తే కంపెనీ షేర్లు నిరంతరం లోయర్ సర్క్యూట్లను తాకే ప్రమాదం ఉందని ఇన్వెస్టర్లను హెచ్చరించారు. అలాంటి సందర్భంలో పెట్టుబడిదారులు షేర్లను విక్రయించటం అసంభవంగా మారుతుందని గుర్తు చేశారు.
అయితే కంపెనీ షేర్లపై కొందరు నిపుణులు మాత్రం భారీ టార్గెట్ ధరలతో బులిష్ వ్యూ కలిగి ఉన్నారు. ఈ క్రమంలో ఇటీవల ట్రేడ్‌బుల్స్‌కు చెందిన సచ్చిదానంద్ ఉత్తేకర్ సుజ్లాన్ స్టాక్ అత్యధికంగా రూ.115 స్థాయికి చేరుకోగలని సూచించారు. అలాగే టెక్నికల్ అనలిస్ట్ ప్రకాష్ గబా కూడా సుజ్లాన్‌లో 50% లాభాలను బుక్ చేసుకోవాలని సలహా ఇచ్చారు. సుజ్లాన్ షేర్లు 'ఓవర్‌బాట్' జోన్ కంటే దిగువకు పడిపోయాయి. మూడేళ్ల కింద జూలై 15, 2022లో రూ.38 రేటువద్ద ఉన్న షేర్ ధర 108 శాతం పెరిగి రూ.79 స్థాయికి చేరుకున్నాయి. నిపుణులు హెచ్చరికల మధ్య ఇన్వెస్టర్లు కంపెనీ షేర్లను హోల్డ్ చేయాలా లేక నిష్ర్కమించాలా అనే అంశంపై బేరీజువేసుకుంటున్నారు.


Click it and Unblock the Notifications