Suzlon Energy Shares: సుజ్లాన్ ఎనర్జీ మార్కెట్లో గ్రీన్ ఎనర్జీకి సంబంధించిన స్టాక్. గడచిన కొన్ని త్రైమాసికాలుగా కంపెనీ పనితీరు క్రమంగా మెరుగుపడటంతో పాటు ప్రపంచం రెన్యూవబుల్ ఎనర్జీకి మారటం ఈ కంపనీ ఇన్వెస్టర్లకు కనకవర్షం కురిపిస్తోంది. ఒకప్పుడు అత్యల్ప ధరల వద్ద అందుబాటులో ఉన్న ఈ పెన్నీ స్టాక్ మార్కెట్లో పనితీరుతో వార్తల్లో తరచుగా వినిపిస్తోంది.
ఇదంతా బాగానే ఉన్నప్పటికీ మార్కెట్లు నేడు భారీగా నష్టాల్లో కూరుకుపోవటంతో దాదాపు 1400 పాయింట్లను సెన్సెక్స్ కోల్పోయింది. ఇలాంటి పరిస్థితుల్లో రెన్యూవబుల్ పెన్నీ స్టాక్ ధర కూడా ప్రభావితం అవుతోంది. వరుసగా రెండు ట్రేడింగ్ సెషన్లలో కంపెనీ షేర్లు దాదాపు 9 శాతం పతనం అయ్యాయి. ఈ క్రమంలోనే కంపెనీ చాలా కాలంగా హోల్డ్ చేస్తున్న కీలక సపోర్ట్ జోన్ ధర అయిన రూ.50 మార్కు కిందకు తాజాగా జారిపోయింది. నేడు ఇంట్రాడేలో స్టాక్ 5 శాతానికి పైగా కరెక్షన్ కి గురికావటంతో ధర రూ.49.50 కంటే కిందకు జారుకుంది.

2020-21, 2021-22, 2022-23 ఆర్థిక సంవత్సరాల్లో GST రిటర్న్‌లలో అదనపు ఇన్‌పుట్ క్రెడిట్ పొందారనే ఉందని ఆరోపిస్తూ సెంట్రల్ ఎక్సైజ్ కమిషనర్ కార్యాలయం చెన్నై నార్త్ కమిషనరేట్ కంపెనీపై దాదాపు రూ.1.18 కోట్ల జరిమానా విధించిందని కంపెనీ నేడు స్టాక్ మార్కెట్లకు కంపెనీ వెల్లడించింది. ఇది కూడా ప్రతికూల మార్కెట్లలో స్టాక్ పతనానికి ఒక కారణంగా నిలిచింది. ఈ చర్య కంపెనీ కార్యకలాపాలపై ఎలాంటి గణనీయమైన ప్రభావాన్ని చూపబోదని స్పష్టం చేసింది. దీంతో నేడు కంపెనీ మార్కెట్ క్యాప్ దాదాపు రూ.67 వేల కోట్ల వద్ద కొనసాగుతోంది.
కంపెనీ షేర్లపై మార్కెట్ నిపుణులు మాట్లాడుతూ ఈ స్టాక్ ప్రస్తుతం హై రిస్క్ తీసుకునే పెట్టుబడిదారులకు మాత్రమే పెట్టుబడి ఎంపికగా సరిపోతుందని వారు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రస్తుతం కొత్తగా కొనుగోళ్లకు ఎలాంటి ప్రయత్నాలు చేయవద్దని క్రాంతి బతిని, వెల్త్‌మిల్స్ సెక్యూరిటీస్‌లో ఈక్విటీ స్ట్రాటజీ డైరెక్టర్ సూచించారు. ఈ క్రమంలో స్టాక్ 47-49 మధ్య స్థాయిలో సపోర్ట్ జోన్ కింద పరిగణించవచ్చని నిపుణుల సూచిస్తున్నారు. అలాగే రెసిస్టెన్స్ ధరను రూ.54గా పేర్కొంటున్నారు.
ఇదే క్రమంలో ఏంజెల్ వన్‌లో సీనియర్ రీసెర్చ్ అనలిస్ట్, టెక్నికల్ & డెరివేటివ్స్ ఓషో క్రిషన్ సుజ్లాన్ కదలిక పరిమితం చేయబడిందని పేర్కొన్నారు. గత రెండు సెషన్లలో దిద్దుబాటు కనిపించిందని పేర్కొన్నారు. ఈ క్రమంలో స్టాక్ రూ.48-47-సబ్‌జోన్ కనిష్ట స్థాయి చుట్టూ మద్దతు కనిపించడంతో నిర్మాణం బలహీనంగా కనిపిస్తోందని పేర్కొన్నారు. సెబీ-రిజిస్టర్డ్ పరిశోధన విశ్లేషకుడు AR రామచంద్రన్ మాట్లాడుతూ ఈ సపోర్ట్ జోన్ మిస్ అయితే సమీపంలో స్టాక్ ధర ఒక్కోటి రూ.45.5కి పడిపోవచ్చని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీలో ప్రమోటర్ల వాటా 13.25 శాతంగా ఉందని తెలుస్తోంది. మెుత్తానికి నిపుణులు సైతం ఈ షేర్లకు ప్రస్తుతం దూరంగా ఉండాలనే సూచనలు తమ రీడింగ్ ద్వారా చెబుతున్నారు.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Hyderabad: హైదరాబాద్‌లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications