Gold Price: గుడ్ న్యూస్.. బంగారం ఆ ధర వద్దకు రాగానే కొనుగోలు చేయండి..!

బంగారం ధరలు అత్యధిక స్థాయిని భారీగా తగ్గాయి. ఈ ఏడాది జనవరిలో భారీగా పెరిగిన బంగారం ధరలు ఆ తర్వాత క్రమంగా తగ్గాయి. అయితే ఆగస్ట్ ధరలు కాస్త పెరిగాయి. ఆ తర్వాత అక్టోబర్ లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. అయితే నవంబర్ లో ఇప్పటి వరకు పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయి. ఇక నుంచి బంగారం ధరలు పెరుగుతాయా లేకా తగ్గుతాయా అని చాలా మంది సందిగ్ధంలో ఉన్నారు. అయితే స్వల్ప కాలంలో పుత్తడి ధర తగ్గే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అయితే దీర్ఘకాలంలో పసిడి మంచి రాబడి ఇచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. బంగారం ధరలు నవంబర్ 2, 3 తేదీల్లో వరుసగా పెరుగుతూ వచ్చాయి.

అంతర్జాతీయ పరిస్థితులు, అమెరికా ఫెడ్ రేట్లు పెంచుతుందనే అంచనా, చైనా భారీగా బంగారం విక్రయాల వల్ల పసిడి ధరలు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. అయితే దేశీయంగా బంగారానికి డిమాండ్ ఉండడం వల్ల బంగారం ధరలు ఓ రోజు పెరుగుతూ మరో రోజు తగ్గుతున్నాయి. నవంబర్, డిసెంబర్, జనవరి నెలల్లో పుత్తడి ధరలు తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కొనసాగితేనే ఇది సాధ్యమని పేర్కొంటున్నారు. పెరుగుతున్న ముడి చమురు ధరలతో కూడా బంగారం ధరలు ప్రభావితం చేస్తోంది. ముడి చమురు పెరగడం వల్ల చాలా దేశాల్లో ద్రవ్యోల్బణం పెరుగుతుంది. దీంతో ఆయా దేశాల సెంట్రల్ బ్యాంకులు ద్రవ్యల్బోణాన్ని తగ్గించడానికి వడ్డి రేట్లు పెంచుతాయి.

Gold Price

ఇది బంగారం ధరలు ఒత్తిడి పెంచే అవకాశం ఉంటుంది. వడ్డీ రేట్ల పెంపుపై అమెరికా ఫెడ్ అధికారులు త్వరలో నిర్ణయాలు తీసుకోనున్న తరుణంలో వడ్డీ ఆదాయం ఇవ్వలేని బంగారంపై ఇన్వెస్టర్లు వెనకడుగు వేసే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. డిసెంబర్‌లో మరోసారి వడ్డీ రేట్లు పెరిగే అవకాశం ఉండటంతో పసిడి ధరలు తగ్గే అవకాశం ఉందని గోల్డ్ మాన్ సాచ్స్ పేర్కొంది. వచ్చే ఆరు నెలల్లో ఔన్సు బంగారం సగటున 4,200 డాలర్ల వద్ద కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తోంది. బంగారం పెట్టుబడి పెట్టే వారు క్రమక్రమంగా పెట్టుబడి పెడితే మంచిదని నిపుణులు చెబుతున్నారు. వచ్చే ఆరు నెలల్లో పసిడి ధరలు తగ్గుతాయని కచ్చితంగా అంచనా వేయలేం.

ఈ నేపథ్యంలో రూ.లక్ష పెట్టుబడి పెట్టాలనుకునే వారు నెలకు రూ.5 వేల నుంచి రూ.15 పెట్టుబడి పెడితే బెటరని చూస్తున్నారు. ఇక దేశీయంగా బంగారానికి డిమాండ్ కొనసాగుతూనే ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు దీపావళి, మరో కొద్ది రోజుల్లో కార్తీక మాసం పెళ్లిళ్ల సీజన్ లో కూడా పసిడి డిమాండ్ ఉండనుంది. ఆ తర్వాత బంగారం ధర తగ్గే అవకాశం ఉందని భావిస్తున్నారు. భారతీయులు అనవసరంగా బంగారం కొనగోలు ఆపాలని కేంద్రం సూచిస్తోంది. బంగారం అధికంగా కొనుగోలు చేయడం వల్ల భారత్ వద్ద ఉన్న డాలర్లు పడిపోయే అవకాశం ఉంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం దాదాపు రూ.1,30,000 నుంచి రూ.1,40, 000 మధ్య కొనసాగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+