Yes Bank Shares: గడచిన వారం చివరిలో దేశీయ ప్రైవేటు బ్యాంకింగ్ సంస్థ యెస్ బ్యాంక్ తన మార్చి త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. ఈ క్రమంలో కంపెనీ నికర లాభం అంతకు ముందు ఏడాది కంటే 100 శాతానికి పైగా పెరుగులను నమోదు చేసింది. దీంతో సోమవారం మార్కెట్లు తెరుచుకోగానే స్టాక్ మంచి ర్యాలీని కొనసాగిస్తోంది.
మెరుగైన ఆర్థిక ఫలితాలను ప్రకటించిన క్రమంలోనే పెట్టుబడిదారుల దృష్టి ప్రస్తుతం యెస్ బ్యాంక్ షేర్లపై పడింది. రానున్న రోజుల్లో యెస్ బ్యాంక్ షేర్లు రూ.32కి చేరుకోవచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. శనివారం బ్యాంక్ తన నాలుగో త్రైమాసిక అద్భుత ఫలితాల ప్రకటన తర్వాత సోమవారం ఉదయం జరిగిన డీల్స్‌లో యెస్ బ్యాంక్ షేర్లు రూ.27.50 వద్ద ప్రారంభమయ్యాయి. ఈ క్రమంలో కొన్ని నిమిషాల్లోనే స్టాక్ 8 శాతం పెరిగి ఇంట్రాడే గరిష్ఠ స్థాయి రూ.28.55కు చేరుకుంది.

ఇదే క్రమంలో స్టాక్ గత పనితీరును గమనిస్తే.. గత నెలలో 13 శాతానికి పైగా పెరిగిన స్టాక్ గడచిన ఆరు నెలల కాలంలో 73 శాతానికి పైగా ర్యాలీని నమోదు చేసింది. ఇక 2024లో స్టాక్ తన పెట్టుబడిదారులకు 22 శాతం రాబడిని అందించింది. మార్కెట్ నిపుణుల ప్రకారం మెరుగైన త్రైమాసిక ఫలితాలే నేడు స్టాక్ ర్యాలీకి కారణమయ్యాయని తెలుస్తోంది. అయితే వీరి అంచనా ప్రకారం స్టాక్ ధర రూ.30- రూ.32 వరకు చేరుకోవచ్చని వారు చెబుతున్నారు. ఆ స్థాయి వద్ద స్టాక్ రెసిస్టెన్స్ జోన్‌ను ఎదుర్కొంటోందని, దానిని అధిగమిస్తే షేర్ల ధరలో బలమైన ర్యాలీ ఉంటుందని వారు చెబుతున్నారు. ఇదే క్రమంలో ఇన్వెస్టర్లు షేరుకు రూ.24 ధరను స్టాప్‌లాస్ కింద పరిగణించాలని చెబుతున్నారు.
నేడు ఇంట్రాడేలో ఉదయం 11.15 గంటల సమయంలో 5 శాతానికి పైగా లాభంతో రూ.27.55 వద్ద కొనసాగుతోంది. ఇక బ్యాంక్ నాలుగో త్రైమాసిక ఫలితాల గురించి మాట్లాడుకున్నట్లయితే.. మార్చితో ముగిసిన మూడు నెలల కాలంలో బ్యాంక్ నికర లాభం రూ.451 కోట్లుగా ఉన్నట్లు ప్రకటించింది. ఇది అంతకు ముందు ఏడాది నమోదైన రూ.202 కోట్ల కంటే 123 శాతం అధికం. ఇదే క్రమంలో బ్యాంక్ స్థూల నిరర్థక ఆస్తులు 0.5 శాతం తగ్గి 1.7 శాతం వద్దకు చేరుకున్నాయి.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications