Gold News: పసిడి ప్రియులకు షాకింగ్ న్యూస్.. ఇది తెలుసుకోకపోతే భారీ మూల్యం తప్పదు..!!
Gold Price Today: ఆగస్టులో శుభకార్యాలు ముగియటంతో బంగారానికి డిమాండ్ చాలా వరకు తగ్గిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో సెప్టెంబరు నెల ప్రారంభం నుంచి గరిష్ఠాలకు చేరిన పసిడి ధరలు స్తబ్ధుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
అయితే ప్రస్తుతం మందకొడిగా ఉన్న గోల్డ్ రేట్లు భారీ ర్యాలీకి సిద్ధం అవుతున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో సమీప భవిష్యత్తులో గోల్డ్ రేట్లు మరోమారు సామాన్యులకు దూరంగా గగన ప్రయాణానికి వెళ్లనుందని వారు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ వార్త ప్రస్తుతం పసిడి ఆభరణాలు కొనుగోలు చేయాలనుకుంటున్న చాలా మందిని గందరగోళంలోకి నెట్టేస్తోంది. ఈ క్రమంలో దేశీయంగా గోల్డ్ రేట్లు ఎలాంటి మార్పులు లేకుండా నేడు స్థిరంగా కొనసాగుతున్నాయి. గ్రాము 24 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.7276 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.6669 వద్ద స్థిరంగా ఉన్నాయి.

నిన్న అంతర్జాతీయ మార్కెట్‌లో 24 క్యారెట్ల బంగారం ధర ఔన్స్‌కు 2,471 డాలర్లకు తగ్గగా.. నేడు ఆసియా మార్కెట్ ట్రేడింగ్‌లో బంగారం ధర 2,500 డాలర్లకు పైకి చేరుకుంది. దీనికి ప్రధాన కారణం చైనా సెంట్రల్ బ్యాంక్ వడ్డీ రేట్ల తగ్గింపు ప్రకటనగా ఉంది. నేడు రిటైల్ మార్కెట్లలో గోల్డ్ రేట్లు స్థిరంగా కొనసాగుతున్నప్పటికీ.. ఇవాళ ఎంసీఎక్స్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు నమోదు చేసిన పెరుగుదల ప్రభావం రేపు రిటైల్ మార్కెట్లలో ప్రతిబింబించవచ్చు. ఇదే క్రమంలో గడచిన కొన్ని త్రైమాసికాలుగా భారతీయ సెంట్రల్ బ్యాంక్ గతంలో ఎన్నడూ చూడని రీతిలో కొత్త కొనుగోళ్లను చేస్తోంది. దీంతో టన్నులో పసిడి నిల్వలు పెరుగుతున్నాయి.
బంగారం ధర పెరుగుతుందని చెప్పడానికి నిపుణులు చెబుతున్న రెండు కారణాలను పరిశీలిస్తే.. ముందుగా యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్ల తగ్గింపు ఊహాగానాలు కాగా రెండవది భారతదేశంలో పండుగల సీజన్ దగ్గర పడటం. నవంబరులో అందరు ఇష్టంగా జరుపుకునే దీపావళి, పెళ్లిళ్ల సీజన్ కారణంగా కొనుగోళ్లకు డిమాండ్ పెరుగుతోంది.


Click it and Unblock the Notifications