Gold Price: పసిడి ప్రియులకు అలర్ట్.. భారీగా పెరుగుతున్న బంగారం.. ఎందుకంటే..
Gold Price: వరుసగా నాలుగో సెషన్‌లో బంగారం ధరలు పెరగటం జోరందుకున్నాయి. ఈ రోజు గ్లోబల్ మార్కెట్‌లో బంగారం ధర భారీగా ప్రారంభమైంది.
కమోడిటీ మార్కెట్ ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే బంగారం ధర ఇంట్రాడే గరిష్ఠ స్థాయి రూ.59,308ని చేరుకుంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈరోజు బంగారం ధర ఔన్స్‌కు 1,960 డాలర్ల స్థాయికి చేరుకుంది. యూఎస్ ద్రవ్యోల్బణంలో సౌలభ్యం కారణంగా బంగారం ధరలు నిరంతరం పెరుగుతున్నాయని మోతీలాల్ ఓస్వాల్ వైస్ ప్రెసిడెంట్ అమిత్ సజేజా అభిప్రాయపడ్డారు. దీంతో యూఎస్ డాలర్ 15 నెలల కనిష్ఠానికి చేరుకుంది.

సమీప కాలంలో గోల్డ్ ప్రైస్ అప్‌ట్రెండ్‌లో కొనసాగుతుందని బ్రోకరేజ్ అంచనా వేసింది. ఒకవేళ ఏదానా డిప్ వస్తే దానిని బులియన్ ఇన్వెస్టర్లు కొనుగోలు చేసే అవకాశంగా చూడొచ్చని అన్నారు. రానున్న కాలంలో గోల్డ్ ధర 1985-2000 డాలర్ల మధ్య పెరగవచ్చని సిటీ ఇండెక్స్‌లోని సీనియర్ మార్కెట్ విశ్లేషకుడు మాట్ సింప్సన్ అభిప్రాయపడ్డారు. ఇదే క్రమంలో నిరుద్యోగిత కోసం దరఖాస్తుదారుల సంఖ్య కూడా తగ్గిందని యూఎస్ డేటా వెల్లడించింది.
ప్రస్తుతం దేశంలో బంగారం ధరలు స్థిరంగా నిన్నటి రేట్ల వద్ద కొనసాగుతున్నాయి. 22 క్యారెట్ల పసిడి తాజా ధరలను దేశవ్యాప్తంగా వివిధ నగరాల్లో రిటైల్ విక్రయ ధరలను పరిశీలిస్తే.. చెన్నైలో రూ.55,370, ముంబైలో రూ.55,000, దిల్లీలో రూ.55,150, కలకత్తాలో రూ.55,000, బెంగళూరులో రూ.55,000, పూణేలో రూ.55,000, వడోదరలో రూ.55,050, జైపూర్ లోరూ.55,150, కోయంబత్తూరులో రూ.55,370, పాట్నాలో రూ.55,050, నాశిక్ లో రూ.55,030, కుంభకోణంలో రూ.55,370 వద్ద విక్రయాలు జరుగుతున్నాయి.
పీ, తెలంగాణలోని తాజా ధరలను పరిశీలిస్తే.. విజయవాడ, తిరుపతి, నెల్లూరు, విశాఖపట్నం, కాకినాడల్లో 22 క్యారెట్ల పసిడి ధర రూ.55,000 వద్ద విక్రయాలు జరుగుతుండగా.. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం ధర రూ.60,000 వద్ద కొనసాగుతోంది. తెలంగాణ నగరాల్లో సైతం ఇదే ధర వద్ద విక్రయాలు జరుగుతున్నాయి. వెండి ధరలను పరిశీలిస్తే నిన్నటి కంటే కిలోకు రూ.1500 పెరిగింది. తెలుగు రాష్ట్రాల్లో కిలో వెండి రేటు నేడు రూ.81,300 వద్ద కొనసాగుతోంది.


Click it and Unblock the Notifications