Gold News: గోల్ట్‌తో లాభాలు కావాలా..? దీపావళికి ముందు పసిడి కొని అప్పటి వరకు ఆగండి..!!
Buying Gold: ప్రస్తుతం దేశంలో గోల్డ్ ధరలు గ్రాముకు రూ.7900 మార్కును క్రాస్ అయ్యాయి. చరిత్రలో ఎన్నడూ చూడని వేగంతో గోల్డ్ గడచిన కొన్ని నెలలుగా పెరుగుతూపోతోంది. దీంతో 8000 మార్కుకు అతిచేరువలో గోల్డ్ రేట్లు ఉండటంతో భారతీయ పసిడి ప్రియులతో పాటు గోల్డ్ ఇన్వెస్టర్లకు దిక్కుతోచటం లేదు. ప్రస్తుత ధరల్లో గోల్డ్ ఇన్వెస్ట్మెంట్స్ సరైనదేనా అని వారు గందరగోళానికి గురవుతున్నారు.
ఇదే క్రమంలో స్పాట్ మార్కెట్లో సైతం బంగారం ధర ఔన్సుకు 3000 డాలర్ల రేటును అందుకునేందుకు పరుగులు పెడుతోంది. నిపుణులు సైతం గోల్డ్ ధర జనవరి వరకు తన పెరుగుదలను కొనసాగిస్తుందని చెబుతున్నారు. అయితే ఈ ర్యాలీ కొనసాగింపుకు గల కారణాలను పరిశీలిస్తే భౌగోళిక రాజకీయ అనిశ్చితి, సంభావ్య తదుపరి వడ్డీ రేట్ల తగ్గింపు, యూఎస్ ప్రెసిడెంట్ ఎన్నికలతో ముందుకు సాగుతోందని కమోడిటీ మార్కెట్లలోని విశ్లేషకులు చెబుతున్నారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు గోల్డ్ రేట్లలో అనిశ్చితి కొనసాగుతుందని వారు చెబుతున్నారు.

అయితే మరో పక్క ఈ నెలాఖరున దీపావళి దగ్గర పడుతున్న వేళ ఇండియా బంగారు ఆభరణాల కొనుగోలుకు డిమాండ్ భారీగా పెరుగుతుందని వారు ఆశిస్తున్నారు. అయితే ఈ క్రమంలో దీపావళికి ముందు బంగారాన్ని కొని అమెరికా ఎన్నికల తర్వాత పసిడి అమ్మటం తెలివైన ప్రణాళికేనా అనే ప్రశ్నలు చాలా మంది గోల్డ్ ఇన్వెస్టర్ల మదిలో మెదులుతున్నాయి. పండుగల సమయంలో సాధారణంగా భారతదేశంలో పసిడి కొనుగోళ్లకు డిమాండ్ పెరగటం ఆనవాయితీగా వస్తున్నదేనని కామ జూలరీ ఎండీ కోలిన్ షా పేర్కొన్నారు. ధనత్రయోదశి సమయంలో వాస్తవానికి గోల్డ్ డిమాండ్ భారీగా ఉంటుందని పేర్కొన్నారు. దీనికి తోడు అమెరికా అధ్యక్ష ఎన్నికలకు కేవలం కొన్ని వారాల గడువు ఉండటం కూడా గోల్డ్ ధరలను భారీగా అనిశ్చితికి గురిచేస్తోందని ఆయన పేర్కొన్నారు.
ప్రస్తుతం పసిడి ధరలను పైపైకి వెళ్లేందుకు దోహదపడుతున్న ప్రధాన కారణాలను పరిశీలిస్తే..
1. ప్రపంచ రాజకీయ అనిశ్చితులతో డిమాండ్ పెరగటం
2. అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించటం
3. అమెరికా అధ్యక్ష ఎన్నికలు సమీపించటం
4. ప్రపంచ వ్యాప్తంగా సెంట్రల్ బ్యాంకులు వడ్డీ రేట్లను తగ్గిస్తూ మానిటరీ పాలసీలను సవరించటం
5. దీపావళి సమీపించటంతో గోల్డ్ ఈటీఎఫ్ లకు డిమాండ్ భారీగా పెరగటం
ఈ క్రమంలో ఆదివారం గోల్డ్, సిల్వర్ షాపింగ్ కోసం వెళుతున్న ప్రజలు తప్పనిసరిగా నేటి రెండు రాష్ట్రాల్లో రిటైల్ విక్రయ ధరలను తప్పక పరిశీలించాల్సిందే. ఈ క్రమంలో 22 క్యారెట్ల గోల్డ్ గ్రాము ధర రూ.7280గా ఉండగా, 24 క్యారెట్ల పసిడి ధర రూ.7942 వద్ద కొనసాగుతోంది. అలాగే 18 క్యారెట్ల గోల్డ్ రేటు రూ.5957 వద్ద స్థిరంగా కొనసాగుతున్నాయి. ఇదే క్రమంలో వెండి ధరలను పరిశీలిస్తే కేజీకి రూ.1,07,000 వద్ద ఉన్నాయి.


Click it and Unblock the Notifications