Gold Rate in 2025: 2024లో పసిడి ధరలు అనూహ్యంగా పెరుగుదలను చూశాయి. పెట్టుబడులు పెట్టిన గోల్డ్ లవర్స్ మంచి రాబడులను అందుకున్నప్పటికీ.. సామాన్య ప్రజలు మాత్రం తమ అవసరాల కోసం కొనుగోలు చేసేందుకు పెరిగిన రేట్లతో ఆందోళనకు గురయ్యారు. అయితే కొత్త ఏడాదిలో పరిస్థితులపై చాలా మంది గందరగోళంలో ఉన్నారు. రేట్లు పెరుగుతాయా లేక తగ్గుతాయో తెలియక అయోమయంలో ఉన్నారు.
పసిడిని చాలా మంది సేఫ్ హెవెన్ కింద కష్టకాలంలో తమ సంపద విలువను కాపాడుకోవటం కోసం వినియోగించుకుంటుంటారు.రానున్న ఏడాది 10 గ్రాముల పసిడి ధర రూ.85,000 స్థాయికి చేరుకోవచ్చని తెలుస్తోంది. అయితే ఒకానొక దశలో రేట్లు రూ.90,000లకు చేరుకుంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా పరిస్థితుల అనిశ్చితి కొనసాగితే ధరలు మండిపోతాయని చెప్పారు. సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లతో పాటు ద్రవ్యపరపతి సమావేశాల్లో వడ్డీ రేట్ల తగ్గింపులు నెమ్మదించటం గోల్డ్ రేట్లను పెంచటంలో దోహదపడుతున్నట్లు వారు చెబుతున్నారు. రూపాయి విలువ పతనంతో గోల్డ్ రేట్లు తగ్గుతాయనే విషయాన్ని చెబుతున్నారు. ప్రస్తుతం మల్టీ కమోడిటీ ఎక్స్చేంజీలో 10 గ్రాముల పసిడి స్పాట్ ధర రూ.79,350 వద్ద కొనసాగుతున్నాయి.

గడచిన 2024లో పసిడి దేశీయంగా పెట్టుబడిదారులకు దాదాపు 23 శాతం రాబడిని అందించిన సంగతి తెలిసిందే. ఈక్రమంలో అక్టోబర్ 30, 2024న 10 గ్రాముల ధర రూ.82,400 స్థాయిని చేరుకుని సరికొత్త రికార్డు గరిష్ఠాలను తాకింది. ఇదే క్రమంలో వెండి 2024లో 30 శాతం రాబడిని అందించి కేజీ ధర ఏకంగా రూ.లక్ష మార్కును దాటేసింది. నిపుణులు 2025లో కూడా గోల్డ్, సిల్వర్ వంటి ఖరీదైన లోహాలు తమ అత్యుత్తమ పనితీరును రానున్న ఏడాదిలో కూడా కొనసాగించవచ్చని చెబుతున్నారు.
ప్రధానంగా అమెరికా సెంట్రల్ బ్యాంక్ ఫెడరల్ రిజర్వు వడ్డీ రేట్ల ప్రకటనలు కూడా గోల్డ్ ధరలను ప్రభావితం చేయవచ్చని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2024లో డిమాండ్ సప్లై డైనమిక్స్ గోల్డ్ రేట్లను ప్రభావితం చేశాయి. ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధ వాతావరణ పరిస్థితులు కూడా పసిడికి ప్రజల నుంచి డిమాండ్ పెంచింది. హటాత్తుగా పెరిగిన డిమాండ్ ధరల పెరుగుదలకు కారణంగా మారిందని నిపుణులు చెప్పారు. అలాగే జనవరి 20న బాధ్యతలు చేపట్టనున్న అమెరికా కొత్త అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలో వివిధ దేశాలపై భారీగా సుంకాల పెంపు నిర్ణయాలు, నిర్ణయాలు, వాటి భవిష్యత్తు ప్రభావం వంటివి కూడా గోల్డ్ రేట్లను ప్రభావితం చేస్తుందని నిపుణులు స్పష్టంగా చెబుతున్నారు.
Disclaimer: The recommendations made above are by market analysts and are not advised by either the author, nor Greynium Information Technologies or GoodReturns. The author, nor the brokerage firm nor GoodReturns would be liable for any losses caused as a result of decisions based on this write-up. Goodreturns.in advises users to consult with certified experts before making any investment decision.
More From GoodReturns

కొంపలు ముంచుతున్న ఇరాన్ యుద్ధం.. కొనేవారు లేక దుబాయ్లో కుప్పలు కుప్పలుగా పడిన బంగారం ..

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

బంగారం ధరలు ఈ స్థాయికి వస్తేనే కొనడానికి వెళ్లండి.. పసిడి ధరలపై ఆర్థిక నిపుణులు కీలక సూచన..

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications