Investment: వామ్మో.. ఎక్కువ మంది ఇన్వెస్ట్ చేస్తోంది అక్కడే, మరి మీరు..?
Equity Investments: భారతదేశంలో ప్రజల్లో ఇటీవలి కాలంలో ఆర్థిక అక్షరాస్యత పెరుగుతోంది. డబ్బు సంపాదించటం ఎంత ముఖ్యమో దానిని జాగ్రత్తగా పెంచటం, సేఫ్ పెట్టుబడులు చేయటం, మంచి రాబడులను అందించే మార్గాల్లో ఉంచటం చాలా కీలకమైనది. భారతీయులు ప్రస్తుతం ఎక్కడెక్కడ తమ డబ్బును ఇన్వెస్ట్ చేస్తున్నారనే విషయాలు అందరికీ ఆసక్తిని కలిగిస్తున్నాయి.
ప్రస్తుతం దేశంలోని ప్రజలు తమ డబ్బులో దాదాపు సగం స్థిరాస్తుల్లోనే ఉన్నాయని తేలింది. భారతీయులు తమ మెుత్తం సంపాదనలో దాదాపు 51.3 శాతం ప్రాపర్టీల్లో పెట్టుబడిగా పెట్టారు. అంటే ఇళ్లు, స్థలాలు, పొలాలు వంటి రియల్ ఎస్టేట్ ప్రాపర్టీల్లోనే సంపదను కలిగి ఉన్నారని ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ జెరోధా వెల్లడించింది. దీని తర్వాత ప్రజలు రెండవ స్థానాన్ని బంగారానికి ఇచ్చారు. అవును తమ సంపాదనలో దాదాపు 15.2 శాతాన్ని ప్రజలు పసిడి, బంగారు ఆభరణాల్లో ఇన్వెస్ట్ చేసినట్లు తేలింది.

భారతీయులు బ్యాంక్ డిపాజిట్లకు(13.3%) మూడవ స్థానాన్ని ఇవ్వగా ఈక్విటీ పెట్టుబడులకు(5.8%) ప్రస్తుతం నాల్గవ స్థానానికి పరిమితం చేశారు. దీని తర్వాత ఇన్సూరెన్స్(5.7%), ప్రావిడెంట్ ఫండ్(5.7%)తో పాటు చివరిగా డబ్బు రూపంలో(3%) తమ సంపదను కలిగి ఉన్నట్లు తేలింది. దీని ప్రకారం ప్రస్తుతం భారతీయులు ప్రైవేట్ ఆస్తుల్లో ఎక్కువగా తమ సంపదను కలిగి ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే ఖరీదైన లోహాలు, బ్యాంకు డిపాజిట్ల వంటి మార్గాలకు తర్వాతి స్థానాన్ని కేటాయించటంతో దాదాపు 80 శాతం వరకు ఆస్తులను ఈ మూడు ప్రధాన కేటగిరీల్లోనే హోల్డ్ చేస్తున్నారు.
అయితే రానున్న 10 ఏళ్ల కాలంలో ఇది పూర్తిగా మారిపోనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. అవును అనలిస్టుల అంచనాల ప్రకారం భారతీయులు ఈక్విటీ పెట్టుబడులను పెంచుతారని రియల్ ఎస్టేట్ ఆస్తులు, గోల్డ్ తర్వాత మూడవ స్థానాన్ని ఈక్విటీలకు ఇండియాలో ఇస్తారని చెబుతున్నారు. ఇప్పటికే బ్యాంకులు అందిస్తున్న వడ్డీ రేట్లు ద్రవ్యోల్బణం బీట్ చేసేందుకు సరిపోవటం లేదు. అందుకే ప్రజలు ఇప్పుడు మెల్లగా ఈ సాధనం నుంచి తమ డబ్బును మ్యూచువల్ ఫండ్లకు మళ్లిస్తున్న సంగతి తెలిసిందే.
అలాగే రానున్న 20 ఏళ్లలో ప్రజల సంపద విషయంలో అనేక మార్పులు వస్తాయని తెలుస్తోంది. అప్పటికీ రియల్టీ రంగం తన అగ్రస్థానాన్ని కొనసాగిస్తుందని, రెండవ స్థానానికి ఈక్విటీ పెట్టుబడులు వస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. అంటే ప్రజలకు క్యాపిటల్ మార్కెట్లపై అవగాహన పెరుగుదల భవిష్యత్తులో ఆ మేరకు రిటైల్ పెట్టుబడిదారుల పార్టిసిపేషన్ పెరుగుతుందని వారు చెబుతున్నారు.


Click it and Unblock the Notifications