Metals: బంగారం, వెండి తర్వాత ఆ లోహానిదే హవా.. ఇప్పుడే కొనుగోలు చేయాలా..!
బంగారం, వెండి ధరలు దూసుకెళ్తున్నాయి. బంగారం, వెండితో పాటు మరో లోహం కూడా పెరుగుతోంది. అదే రాగి (copper) రాగి ధరలు వేగంగా పెరిగి, చాలా ప్రాథమిక లోహాలను అధిగమించడంతో పాటు బంగారం, వెండి తర్వాత పెట్టుబడిదారులకు అత్యంత ఇష్టమైన వస్తువుగా ఇది వేగంగా ఎదుగుతోంది. మౌలిక సదుపాయాలు, ఎలక్ట్రిక్ వాహనాల తయారీలో రాగి వాడకం పెరుగుతోంది. దీంతో రాగికి డిమాండ్ ఏర్పడింది. రాగి తయారు చేసే కంపెనీలు గత సంవత్సర కాలంగా మంచి లాభాలను అందిస్తున్నాయి. హిందుస్థాన్ కాపర్, హిందుల్కో ఇండస్ట్రీస్ కంపెనీలు సంవత్సర కాలంగా రాణిస్తున్నాయి. బంగారం వెండి తర్వాత పెట్టుబడిదారులు రాగిపై పెట్టుబడి పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నారు.
అయితే ఇండియాలో కాప్ ఈటీఎఫ్ లు లేవు. పెట్టుబడి పెడితే డైరెక్ట్ గా స్టాక్స్ లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. కాగా.. ఇండియాలో సంవత్సరం కాలంగా రాగి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. ఆగస్టులో రాగి కిలోగ్రాముకు 1400కి చేరుకున్నాయి. రాగి సరఫరా పరిమితం ఉండటం, ప్రపంచవ్యాప్తంగా ఈ లోహనికి డిమాండ్ పెరగడంతో ధరలు పెరుగుతున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎలక్ట్రిక్ వెహికల్స్, ఏఐ డేటా సెంటర్లు, పవర్ గ్రిడ్లు, పునరుత్పాదక ఇంధనం వంటి రంగాల్లో రాగిని ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీంతో రాగికి డిమాండ్ పెరుగుతున్నట్లు చెబుతున్నారు. అంతే కాకుండా పాత గనుల్లో రాగి నాణ్యత క్షీణించడం వల్ల నాణ్యమైన రాగికి ఎక్కువ ధర పలుకుతున్నట్లు వివరిస్తున్నారు.

కొత్త గనుల ప్రారంభానికి మరింత సమయం పట్టే అవకాశం ఉండటంతో సరఫరా అంతరాయం ఏర్పడే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఇది జరిగితే కాపర్ ధర భారీగా పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఆగస్ట్ 17న మల్టీ కమోడిటీ ఎక్సేంజ్‌లో రాగి కాంట్రాక్టులు భారీ ర్యాలీ కనబరిచాయి. తక్షణ సరఫరాను దక్కించుకునేందుకు ప్రీమియం కూడా కొనుగోలుదారులు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక లండన్ మెటల్ ఎక్సేంజ్‌లో రాగి ధరలు రికార్డ్ స్థాయికి చేరుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. 2040 నాటికి రాగికి డిమాండ్ 50 శాతం పెరగవచ్చనే అంచనా వేస్తున్నారు. వరల్డ్ రాగి డిమాండ్ 2025లో దాదాపు 28 మిలియన్ టన్నులగా కొనసాగుతుండగా.. 2040 నాటికి 42 మిలియన్ టన్నులకు పెరిగే అవకాశముంది భావిస్తున్నారు.
దీంతో డిమాండ్ 50 శాతం పెరగవచ్చన అంచనా వేస్తున్నారు. విద్యుదీకరణ, పునరుత్పాదక శక్తి, ఎలక్ట్రిక్ వాహనాలు, ఏఐ డేటా సెంటర్లు రాగి డిమాండ్‌ను పెంచుతున్నాయి. ఈ రంగాలన్నింటికీ విద్యుత్ ఉత్పత్తి, ప్రసారం, వినియోగం కోసం రాగిని ఉపయోగిస్తున్నారు. అయితే రాగి తయారు చేసే కంపెనీల్లో ఒకేసారి పెట్టుబడి పెట్టడం కంటే.. క్రమ క్రమంగా పెట్టుబడి పెట్టడం మంచిదని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. ఇప్పటికే కాపర్ స్టాక్ భారీగా పెరిగినట్లు గుర్తు చేస్తున్నారు. ప్రముఖ ఆర్థిక నిపుణుడు, రిచ్ డాడ్ పూర్ డాడ్ పుస్తక రచయిత రాబర్ట్ కియోసాకి కూడా భవిష్యత్తులో రాగి ధర పెరిగే అవకాశం ఉందని అంచనా వేశారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications