Silver Rising: ప్రపంచవ్యాప్తంగా గోల్డ్, సిల్వర్ విలువైన లోహాలుగా పరిగణిస్తారు. పైగా ద్రవ్యోల్బణం వంటి పరిస్థితుల్లో సంపద విలువను కాపాడుకునేందుకు లేదా హెడ్జ్ చేసేందుకు బంగారాన్ని దశాబ్ధాలుగా ప్రపంచం వినియోగిస్తోంది.
రానున్న కాలంలో గోల్డ్ ధరల కంటే వెండి మరింత దూకుడును ప్రదర్శించనుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం గ్రాముకు వెండి ధర దాదాపు రూ.95 వద్ద కొనసాగుతోంది. అతి త్వరలోనే వెండి ధర కేజీకి రూ.1 లక్ష మార్కును చేరుకునేందుకు దూకుడుగా కొనసాగుతోంది. గడచిన నెల కిందట వెండి అమాంతం భారతదేశంలో లక్షమార్కును దాటి కొనుగోలుదారుల ఆశలపై నీళ్లు జల్లిన సంగతి తెలిసిందే. అయితే ప్రస్తుతం కొనసాగుతున్న గోల్డ్, వెండి ర్యాలీ మళ్లీ అలాంటి పరిస్థితులను తిరిగి తీసుకురానుందని నిపుణులు చెబుతున్నారు. ఇదే క్రమంలో నేడు గ్రాము 22 క్యారెట్ల పసిడి ధర రూ.6865గా ఉండగా, 24 క్యారెట్లో గోల్డ్ గ్రాము ధర రూ.7489గా కొనసాగుతున్నాయి.

వాస్తవానికి అనూహ్యంగా వెండి ధరలు గడచిన కొన్ని నెలలుగా భారీగా పెరుగుతున్నాయి. దీనికి దారితీస్తున్న కారణాలను గమనిస్తే.. ఆధునిక ఎలక్ట్రానిక్స్, సోలార్ ప్యానెల్స్ తయారీ, నీటి శుద్ధి వ్యవస్థలలో వెండి ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. దీనికి తోడు అంతర్జాతీయంగానూ వెండికి డిమాండ్ పెరిగిందని నిపుణులు చెబుతున్నారు. వెండికి ప్రపంచ పారిశ్రామిక డిమాండ్ 2033 నాటికి 46 శాతం పెరుగుతుందని సిల్వర్ ఇన్స్టిట్యూట్ పేర్కొంది. అలాగే స్టాక్‌లో ఉన్న వెండి మొత్తం తక్కువగా ఉందని చెప్పారు.
భూమిపై బంగారం కంటే వెండి నిక్షేపాలు అధికంగా ఉన్నందున పారిశ్రామిక డిమాండ్ పెరుగుతోంది. వెండికి డిమాండ్ పెరగడం, తవ్విన వెండి పరిమిత పరిమాణం రెండింటినీ పోల్చి చూస్తే రాబోయే సంవత్సరాల్లో వెండి ధర గణనీయంగా పెరుగుతుందని అంటున్నారు. ఎలక్ట్రానిక్స్ తయారీ, ఉపగ్రహాలు, రాకెట్లతో సహా ఏరోస్పేస్ పరిశ్రమలలో వెండి విస్తృతంగా ఉపయోగించబడుతుంది. మొత్తం వెండి ఉత్పత్తిలో 20% ఆభరణాలు, పాత్రలకు ఉపయోగించబడుతుంది. మిగిలిన 80% పారిశ్రామిక అవసరాలకు ఉపయోగించబడుతుంది. ఎలక్ట్రానిక్ పరికరాలలో రాగి కంటే వెండిని పూతకు వినియోగిస్తున్నారని తెలుస్తోంది.


Click it and Unblock the Notifications