Gold Update: బాండ్లు అమ్మేసి బంగారం కొనండి.. భారీగా పెరగనున్న బంగారం ధర..!
బంగారం ధర దూసుకెళ్తోంది. ఈ రోజు పసిడి ధర భారీగా పెరిగింది. ఇందుకు ప్రధాన కారణం అమెరికా బాండ్లు ఈల్డ్ తగ్గడం. అమెరికా భారీగా పెరుగుతున్న ప్రభుత్వ రుణభారం భవిష్యత్తులో తీవ్ర ఆర్థిక సంక్షోభానికి దారితీసే అవకాశం ఉందని బిలియనీర్ ఇన్వెస్టర్, బ్రిడ్జ్‌వాటర్ అసోసియేట్స్ వ్యవస్థాపకుడు రే డాలియో పేర్కొన్నారు. ప్రస్తుత అమెరికా ఆర్థిక విధానాల్లో మార్పు రాకపోతే అమెరికాలో ఆర్థిక సంక్షోభం వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. మరో మూడు సంవత్సరాల్లో ఈ పరిస్థితి ఎదురయ్యే అవకాశం ఉందని ఆయన అంచనా వేశారు.
అమెరికా బాండ్లలో తమ పెట్టుబడులను తగ్గించాలని ఆయన సూచించారు. పోర్ట్‌ఫోలియోలో 10-15 శాతం వరకు బంగారానికి కేటాయించాలని సలహా ఇచ్చారు. అలాగే కొంతమేర బిట్‌కాయిన్లలో కూడా పట్టుబడి పెట్టాలని పేర్కొన్నారు. బలమైన ఆర్థిక స్థితి ఉన్న దేశాలు, వివిధ రకాల ఆస్తుల్లో పెట్టుబడులను విస్తరించుకోవాలన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ బాండ్లపై అధికంగా ఆధారపడటం కంటే బంగారం, ఇతర ప్రత్యామ్నాయ ఆస్తులపై పెట్టుబడులపై పెట్టుబి పెట్టడం మంచిదని వివరించారు.

అమెరికా రుణభారం రోజురోజుకు భారీగా పెరుగుతోంది. చెల్లించాల్సిన వడ్డీ చెల్లింపుల కూడా భారీగా పెరిగే అవకాశం ఉందని ఆయన హెచ్చరించారు. అమెరికా ఫెడరల్ ప్రభుత్వ నికర వడ్డీ వ్యయం 2026లోనే సుమారు 1 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని కాంగ్రెస్ బడ్జెట్ కార్యాలయం అంచనా వేసిన నేపథ్యంలో రే డాలియో పెట్టుబడిదారులను హెచ్చరించారు. తన దృష్టిలో ఇది సాధారణ రుణ సమస్య మాత్రమే కాదని డాలియో పేర్కొన్నారు. ప్రభుత్వ రుణాన్ని తీర్చేందుకు చెల్లించాల్సిన వడ్డీ వ్యయం పెరుగుతూనే ఉండటం, అదే సమయంలో భారీగా కొత్త రుణాలు సమీకరించాల్సి రావడం ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరిగే అవకాశం ఉందని ఆయన వివరిస్తున్నారు.
ప్రభుత్వ రుణానికి తగినంత డిమాండ్ లేకపోతే అధిక వడ్డీ రేట్లను అంగీకరించాల్సి రావచ్చని ఆయన తెలిపారు. కేంద్ర బ్యాంకు ద్వారా మరింత డబ్బు సృష్టించే పరిస్థితి రావచ్చని పేర్కొన్నారు. ఆగస్టు 21న 30 ఏళ్ల ట్రెజరీ ఈల్డ్ 5.27 శాతానికి చేరగా, వారంలో అది 2007 తర్వాతి అత్యధిక స్థాయికి చేరింది. అమెరికా ప్రభుత్వ రుణభారం 40 ట్రిలియన్ డాలర్లను దాటడం కూడా పెట్టుబడిదారుల ఆందోళనకు గురి చేస్తోంది. ఈ నేపథ్యంలోనే బంగారంలో పెట్టుబడి పెట్టాలని రే డాలియో సూచించారు. ఈ నేపథ్యంలో బంగారం ధర భారీగా పెరుగుతోంది. ఇంకా కూడా భారీగా బంగారం ధర పెరిగే అవాకశం ఉందని నిపుణలు అంచనా వేస్తున్నారు.
డిస్క్లైమర్: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Goodreturns.in లేదా Greynium Information Technologies Private Limited అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు.మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం, విద్యా ప్రయోజనాల కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.


Click it and Unblock the Notifications